ప్రళయం రాబోతుందా? Whats Wrong In Oceans? | Doomsday Fish Oarfish
America is sending our Indians back! | మన భారతీయులను వెనక్కి పంపేస్తున్న అమెరికా!
![]() |
America is sending our Indians back |
డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత మన భారతీయులను వెనక్కి పంపేస్తుంది. ఇందులో అసలు విషయం ఏమిటంటే మన మీడియా హల్చల్ చేస్తున్నట్టు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్నది తప్పేమీ కాదు.
అమెరికాలోకి అక్రమంగా చొరబడిన, అన్లీగల్ గా ఉంటున్న భారతీయులను మాత్రమే తరిమేస్తున్నారు.
మరొక గొప్ప విషయం ఏమిటంటే అమెరికా చట్టాల ప్రకారం జైల్లో వేస్తే మన భారతీయులు బయటికి వచ్చే అవకాశం లేదు. కాని అమెరికా తన స్వంత ఖర్చులతో మన భారతీయులను మాత్రమే కాకుండా ఇతర దేశస్తులను కూడా ఆయా దేశాలకు పంపేస్తున్నారు.
చొరబాటుదారులను జైల్లో వేసి మేపడం... వాళ్ళ వసతులకు ఖర్చులు పెట్టడం అన్నీ దండగ అని బహుశా డొనాల్డ్ ట్రంప్ భావన!
ఇక నుండి అమెరికా లోకి వచ్చిన చొరబాటు దారులకు చరమగీతమే! అమెరికాలో క్రైం రేటు చాలా దారుణంగా పెరిగిపోయింది. కొన్ని ప్రాంతాలలో అయితే చీకటి పడితే బయటికి రాలేని పరిస్థితి... ఆఖరికి ఇంటిలో కూడా దాక్కుని బ్రతకాల్సిన స్థితి... దోచుకోవడాలు... కాల్చి చంపేయడాలు
ఇవన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ సరి చేయాలనుకుంటున్నాడు... దానిలో భాగంగా దేశాన్ని ముందు శుభ్రం చేసుకుంటున్నాడు... ఇదే పని మన భారత్ కూడా ఎప్పుడు మొదలు పెడుతుందో చూడాలి?
![]() |
ప్రతిరోజూ ఈ లేడీ అఘోరా గొడవేంటి? |
ఈమధ్య సోషల్ మీడియా తెరిస్తే చాలు..
ఈక్రింది లేడీ అఘోరా ప్రచారం ఎక్కువయ్యిపోయింది
ఈమె మొన్న అమావాస్య రోజు ఆత్మార్పణం చేసుకుంటానని ప్రకటించినందుకు... దాని నుండి ఆమెను కాపాడటానికి 2000 మంది పోలీసులు సైతం కాపలా కాయాల్సి వచ్చిందని మీడియాలో చూసి ఆశ్చర్యపోయా!
ఒంటి మీద ఒక్క గుడ్డ ముక్క లేకుండా అఘోరా అవతారమెత్తి తిరుగుతున్న ఈమెను మెంటల్ చెకప్ చేయించి వైద్యం చేయిస్తే మంచిది
ఎందుకంటే...
సనాతనధర్మమంటే... ఒంటిమీద గుడ్డలు తీసేసి నగ్నంగా సభ్యసమాజం సిగ్గు పడేలా తిరగడం కాదు
సనాతనధర్మమంటే... శవాలను పీక్కు తినడం, శవాలతో పడుకోవడం కాదు
సనాతన ధర్మమంటే మహోన్నతమైనది...
అటువంటి స్త్రీని భక్తీ పేరుతో, ధర్మం ముసుగులో నగ్నంగా నిలబెట్టే అవకాశం సనాతన ధర్మంలో లేనే లేదు.
ఈరోజు ఆశ్రమాలలోనూ, సమాజాల పేరుతొ పెట్టిన సంస్థలలోనూ చివరికి బలి చేస్తున్నది స్త్రీలనే!
దొంగ స్వామీజీలు, దొంగ ఆశ్రమాలు ఒకొక్కటి నేటికీ బయట పడుతూనే ఉన్నాయి...
వాటికి బలయిన స్త్రీల ఉదంతాలు ఒళ్ళు గగురు పొడుస్తూనే ఉన్నాయి
వీటిని తమ స్వార్ధం కోసం రచ్చ, రచ్చ చేసి వదిలేసే మీడియాలు..
వీటిని గొప్పగా సమర్ధించే దొంగ సనాతన వాదులు మరో వైపు...
నేటి సమాజమే ఇలా తయారైనది... ఇక సనాతన ధర్మం ఉనికెక్కడ?
మనిషి పుట్టేటప్పుడు నగ్నంగా ఉన్నాడు కాబట్టి... నగ్నంగా తిరగడమే సనాతనధర్మమట... వాదన విడ్డూరంగానూ, అసహ్యకరంగానూ ఉన్నది.
బిడ్డ పుట్టకముందు తల్లి గర్భమూ... పుట్టిన తరువాత తల్లి యొక్క చాటు, ఎదిగిన తరువాత బట్ట మనిషికి పరదా ఉంటూనే ఉన్నాయి
ఇక్కడ నగ్నత్వానికి చోటేది?
సనాతన ధర్మమంటే తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ, దైవ చింతనలో తన జీవితాన్ని గడపటం..
అంతేగాని కన్న తల్లిదండ్రులను, కట్టుకున్న తోడును గాలికొదిలేసి భక్తీ ముసుగులో తిరిగే వారు సనాతన వాది అంటే మహా పాపాత్ములు అయ్యిపోతారు
గుడ్డలిప్పి తిరిగే ఈ లేడీ అఘోరాను ఏదో సృష్టిని కాపాడుతున్నట్టు, దైవమయినట్టు మొక్కడాలేమిటో... పూజించడాలెమిటో...
సనాతన ధర్మం పేరుతో వీళ్ళందరూ ఒకరికొకరు సమర్ధించుకుంటూ అమాయక ప్రజలను దోచుకుంటున్న పరమ దుర్మార్గులు... వీళ్ళు చేస్తున్నదీ... వీళ్ళు బోధిస్తున్నదీ అసలు సనాతన ధర్మమే కాదు... వేదమే కాదు
ఇదంతా ఒక మాయ!!!
ఈ లేడీ అఘోరాకు మెంటల్ ట్రీట్ మెంట్ ఇప్పించి మానసిక రోగాన్ని నయం చేయించి తల్లిదండ్రులకు అప్పగిస్తే... పాపం తల్లిదండ్రులకు కడుపు కోత తగ్గుతుంది, ఆ దరిద్రమూ మనకు తప్పుతుంది.
*జై హింద్!*
Nara Chandrababu Naidu is a living example of patience | సహనానికి నిలువెత్తు నిదర్శనం నారా చంద్రబాబునాయుడు!
![]() |
Nara Chandrababu Naidu is a living example of patience |
సహనంగా ఉండటం అంటే ఏమిటో... సహనానికి ఫలితం ఏవిధంగా ఉంటుందో తెలుసుకోవాలంటే చంద్రబాబునాయుడిగారిని చూసి నేర్చుకోవాల్సిందే! తనను అక్రమంగా అరెస్ట్ చేసి చంపాలని చూసినా ఏమాత్రం భయపడలేదు, జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి అనేక రకాలుగా అవమానాలకు గురవుతూనే ఉన్నారు.
దేవాలయంలాంటి నిండు అసెంబ్లీలో తన సతీమణిపై సైతం అక్రమ సంబంధం అంటకట్టి... లోకేష్ పుట్టుకను దారుణాతి దారుణంగా చిత్రించి 14సంవత్సరాల పాటు సియం గా రాష్ట్రానికి సేవలందించిన చంద్రబాబునాయుడి మనస్సును, వ్యక్తిత్వాన్ని కించపరిచినా, గుండెల్లోని భారాన్ని కన్నీళ్ళ ద్వారా వదులుకున్నాడు గాని ఏమాత్రం తొణకలేదు.
కౌరవ సభగా మార్చి వేసిన అసెంబ్లీలో మళ్ళి తిరిగి ముఖ్యమంత్రిగా అడుగుపెడతానని శపథం చేసి గెలిచిన మహా ధీరుడు నారా చంద్రబాబునాయుడు
2019లో కేవలం 23సీట్లకే పరిమితమై ఎన్నో ఎగతాలులకు, అవహేళనలకు గురైనా ఏమాత్రం తొణకకుండా తనను హింస పెట్టిన పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన అపర చాణిక్యుడు చంద్రబాబునాయుడు గారు
పక్కరాష్ట్రంలో ఉన్న కెసియార్, స్వంతరాష్ట్రంలోని జగన్ మోహన్ రెడ్డి, కేంద్రంలోని మోడీ కలిసి చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని సమూల నాశనం చేయాలని చూసినా ఏమాత్రం బెదరకుండా, భయపడకుండా, నిరాశ, నిష్రుహులకు గురికాకుండా కెసియార్ ను, జగన్ మోహన్ రెడ్డిని రాజకీయ పతనం చేసి, కేంద్రంలోని మోడీ సైతం తనపై ఆధారపడేలా చేసిన అపర మేధావి నారా చంద్రబాబునాయుడు
ప్రతి ఒక్కరూ చంద్రబాబులోని సహనాన్ని, ఓర్పును ఆదర్శంగా తీసుకోవాలి.
పడిన స్థితి నుండే ఎలా లేవాలో చంద్రబాబును చూసి నేర్చుకోవాలి
దుర్మార్గం ఒంటబట్టిన వారూ, సమాజం పట్ల బాధ్యతలేనివారు, స్వార్ధం నిండిన వారూ చంద్రబాబును విమర్శిస్తారు తప్ప మరెవరూ చంద్రబాబును అభిమానించకుండా ఉండలేరు
చంద్రబాబంటేనే ఒక నిలువెత్తు నిదర్శనం... కనుచూపుమేర అభివృద్ధి!!
2024 ఎలాక్షన్లలలో అఖండ మెజారిటీ సాధించి, మళ్లి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని, దేశానికే దిశానిర్దేశ్యం చేసే స్థాయికి ఎదిగి, ycp కౌరవ సభలా మార్చివేసిన అసెంబ్లీలో శపథం చేసి, సాధించిన గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు!.. అభినందనలు!!!
"సత్యమేవ జయతే...జైహింద్!!!"
ఈమధ్య Youtubeలో వచ్చే రాజకీయ ఫేక్ వీడియోలు చూస్తుంటే చాలా బాధేస్తుంది.
రాజకీయాలకు బానిసయ్యి పోయేవాళ్ళు.. కొంతమందయితే... తమ కెడిబిలిటీని గాలికొదిలేసి కేవలం డబ్బులకు ఆశపడి దిగజారిన జర్నలిస్టులు, స్వయంప్రకటిత మేధావులు మరికొంతమంది
వీళ్ళు ఎంతగా సోషల్ మీడియాలో దిగజారిపోతున్నారంటే పందిని సైతం నందిగా చూపెట్టడానికి పడే ప్రయాస చూస్తుంటే ప్రజాస్వామ్యం పట్ల బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరి హృదయం ద్రవించిపోతుంది. నరనరాలలో రక్తం మరిగిపోతుంది.
నోరు విప్పితే చాలు అన్నీ అసత్యాలే... ఆరోపణలే!.. వీళ్ళకసలు మనశ్శాక్షి అనేదే ఉండదా అనిపిస్తుంది?
వీళ్ళకు అర్ధమవుతుందో.. లేదో.. గాని ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడవడమే కాదు... సామాన్య ప్రజల భవిష్యత్ ను భస్మం చేసేస్తున్నారు.
నాయకుడిని ఎన్నుకోవడమంటే అతని యొక్క వ్యక్తిత్వం... గత జీవితం... మాటతీరు... నిస్వార్ధత... నైపుణ్యం చూడాలి. ఎందుకంటే మన ఐదేళ్ల జీవితం.. దేశ, రాష్ట్ర భవిష్యత్ అతని చేతుల్లో పెడుతున్నాము కాబట్టి.
ఈవిషయంలో సామాన్య ప్రజలకంటే పైన చెప్పుకున్న సోకాల్డ్ మేధావులకే ఎక్కువ భాద్యత ఉంది.. వీళ్ళే సామాన్యులను ఎడ్యుకేట్ చెయ్యాలి... కాని వీళ్ళకంటే రోత తిని పెరిగే పంది నయం అనిపిస్తోంది... (పంది క్షమించాలి... వీళ్ళను దానితో పోల్చినందుకు... ఎందుకంటే వీళ్ళు అంతకంటే దిగజారిపోయారు)
దుర్మార్గులను గెలిపించడానికి... సామర్ధ్యం కలిగిన వ్యక్తులను ఎంతకైనా దిగజార్చుతున్నారు
నిజం చెప్పాలంటే ప్రజలను మాయ చేసి ఓట్లు వేయించుకోవడమంటే ద్రోహం కాదా? వారి యొక్క జీవితాలను నాశనం చేయడం కాదా? ప్రజాస్వామ్యాన్ని పగలగొట్టడం కాదా? అభివృద్ధిని అంతమొందించడం కాదా? ఒక్కసారి ఆలోచించండి
ఆంధ్రాలో అబద్ధాన్ని మాటి,మాటికి చెపితే నిజం అయ్యిపోతుందన్న నానుడి నడుస్తోంది.. ఈ ప్రయోగమే అమలవుతోంది.
కాబట్టి ప్రజలారా! ఇప్పటికైనా కళ్ళు తెరవండి... మనకి కావాల్సింది పార్టీలు కాదు... రాజకీయ నాయకులు అంతకంటే కాదు.
మన భవిష్యత్ బాగుండాలి, ప్రజాస్వామ్యం బ్రతకాలి, అభివృద్ధి పెరగాలి.
ఎవడైతే పై వాటికి వ్యతిరేకమో వాడంత ప్రమాదకారి మరొకడుండడు... బయటి నుండి వచ్చే ఉగ్రవాదుల కంటే ఈ ముసుగుల్లో ఉన్న సామాజిక ఉగ్రవాదులు చాలా భయానకం. వీళ్ళను తరిమి కొట్టండి... వీళ్ళను దూరం పెట్టేయండి.
వీళ్ళను మనం వదిలినపెట్టినా, కాలం...ప్రకృతి మాత్రం ఎప్పటికీ వదలవు... ఇటువంటి వాళ్ళందరూ "పిచ్చి ముదిరితే పతనమే"నన్న సామెతకు నిదర్శనంగా మిలిగిపోతారు
Happy New Year to all blog friends!
బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు: హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. 2020 నుండి కరోనా వలన అనేక ఆర్ధిక సమస్యల వలన, మనమందరమూ ఇబ్బంది పడుతూనే ఉన్నాము. ఇక నుండీ రాబోయే కొత్త సంవత్సరం బాగుండాలి. అలాగే ఈ నూతన సంవత్సరంలో ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో అవన్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలతో... మీ KS చౌదరి
![]() |
Know the value of words |
Know the value of words: బ్లాగు మిత్రులందరికీ నమష్కారం. ఫ్రెండ్స్ ఈ క్రింది వీడియో మాటల యొక్క విలువ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియజేయడం జరిగింది. నా సేకరణ, నాకున్న జ్ఞానపరిధి మేరకు మంచి విషయాలనే పరిచయం జరిగింది.
వేదంలో ఒక మాటుంది నాలుకే నాకం(స్వర్గం), నాలుకే నరకం. ఇదే మాట బైబిల్ గ్రంధంలో జీవమరణములు నాలుక వశం అని ఉంది. ప్రవక్త ముహమ్మద్(స)వారు కూడా రెండు పెదాల మధ్య ఉన్నదానిని కాపాడుకుంటే (కంట్రోల్) స్వర్గం గ్యారెంటీ అన్నారు.
అంటే నాలుక ద్వారా వెలువడే మాటలకు అంత విలువ, అంత ప్రమాదమూ ఉన్నాయి. కాబట్టి ప్రతిఒక్కరూ నాలుక విలువ తెలుసుకోండి. మా youtube ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.
Read Also: How to improve your mind power | మీ మైండ్ పవర్‌ని ఎలా మెరుగుపరుచుకోవాలి?