గురువారం, డిసెంబర్ 10, 2015

"అమ్మాయి కాదు అబ్బాయని..అదీ ఆ టైపు అబ్బాయని ఎలా తెలిసిందో మా ప్రసాద్ గాడు చెప్పడం ప్రారంభించాడు.
"వాడు నిన్న ఎర్లీ మార్నింగ్ 7am కల్లా ఇంటికొచ్చేయమని ఫోన్ చేశాడు. నేను పుల్ మేకప్ మీద తయారయ్యి రాజమండ్రి సందులూ,గొందులూ అన్నీ తడుముకుని మొత్తానికి ఆ అమ్మాయి, ఛ... ఆ అబ్బాయి ఇంటికెల్లాను. డోర్ దగ్గర నిలబడి పిలిస్తే లోపలికొచ్చి సోఫాలో కూర్చోండి అనే వాయిస్ వినబడింది. నాకు ఎక్కడ లేని టెన్షన్ అనుకో. తను డ్రెస్ మార్చుకుంటున్నానని కొద్దిసేపు వెయిట్ చేయమని చెప్పింది. సరే అనుకుని రిలీఫ్ దొరికింది కదా అని సోఫాలో కూలబడ్డాను. కొద్ది సేపటికి వాడు కాఫీ గ్లాసుతో వచ్చి నాదగ్గర నిలబడి నీవు నాకు ట్రైన్ లో పరిచయమయిన వాడివి కాదే" అని అడిగింది.
   "ట్రైన్లో పరిచయమేమిటి?" ఏమీ తెలియనట్టు అడిగాను నేను.
  "అదా! ఆ అమ్మాయి చ..వాడు ఫస్ట్ టైమ్ కాల్ చేసినప్పుడు "బాగున్నారా" అని అడిగాడు. మీరెవరు అని నేను అడిగితే విజయవాడ టైన్ లో కలిసాము కదండీ" అని చెప్పాడు. వాయిస్ చాలా నైస్ గా ఉంది కదాని నేనేనని చిన్న ఆబద్ధంతో కమిట్ అయ్యిపోయాను. ఇప్పుడు నా కొంప మునిగింది." లబో దిబో మన్నాడు.
  సర్లే... తరువాత ఏమైంది నవ్వు ఆపుకుంటూ అడిగాను.
  "వాడిచ్చిన టీ త్రాగే వరకూ నేను టెన్షన్ తో తల పైకి ఎత్తనే లేదు.
  "ఆమె (వాడు) అడిగిన ప్రశ్నకు నాకు టైన్ లో పరిచయమయ్యినది మీరు కాదా? సారీ అన్నాను. బహుశా ఇద్దరమూ రాంగ్ నంబర్ వలన కలిసి ఉంటాం. నేను వెళ్లిపోతాను.ఆయామ్ సారీ..! అని లేవబోయాను. టెన్షన్ ని ఆపుకోవడం నావల్ల కావడం లేదు. ఆ టెన్షన్ వలన వాడిని అప్పటికీ చూడలేదు.
   "ఏదో విధంగా మనిద్దరమూ పరిచయమ్మాము కదండీ... వెళ్లిపోవడం ఎందుకు? కల్సే ఉందాం!" అని నా వెనుక నుండి వచ్చి నా భుజాలపై చేతులేసి గట్టిగా ఒత్తింది.కాదు..కాదు ఒత్తాడు. నాకు ఆ సమయంలో స్వర్గలోకాలన్నీ తిరిగి వచ్చి హ్యాపీ గా కూర్చున్నట్టుగా అనిపించింది.
  వాడు కొట్టుకున్న సెంట్ బహుశా భూమి మీదది కాదేమో అనిపించింది.నాకు మాత్రం నవ్వు ఆగడం లేదు.
 "బెడ్ రూమ్ లోకి వెళ్లిపోదాం పద" అన్నాడు.
 "ముందు మీరు వెళ్ళండి"సిగ్గుతో మెలికలు తిరుగుతూ చెప్పాను.
  "వాడు బెడ్ రూమ్ కి వెళ్లిపోయేడు. విచిత్రం ఏమిటంటే వాడు పాత సినిమాలోని సావిత్రిలా చీర చెంగు తలపై నుండి కప్పుకునే ఉన్నాడు. వాడు సూచన మేరకు ఒంటి మీద కట్ట డ్రాయర్ తప్ప మరేమీ లేకుండా ఫ్యాంట్,షర్ట్ విప్పేసాను. తరువాత వాడు తన బట్టలు మొత్తం విప్పేస్తానని అన్నప్పుడు ఆనందంతో పొంగిపోయాను.
  "వాడు చీర చెంగు ముఖం మీద నుండి తీసిన తరువాత అప్పుడు...అప్పుడు చూశాను. ఒక్కసారిగా నా నరాలన్నీ తెగిపోయినట్టుగా అనిపించాయి. భూమి లోపలికి నేను కూరుకుపోతున్నట్టు అనిపించి౦ది. వాడు నవ్వుతూ మీదకు రాబోతుంటే ఒక్కసారిగా వెనుకకు నెట్టేసి ఫ్యాంట్, షర్ట్ పట్టుకుని ఒక్క  ఉదుటున అక్కడ నుండి జంప్ చేసి వీధిలోకొచ్చి పడ్డాను. నన్ను ఆ వీధి మొత్తం ఆశ్చర్యంగా చూస్తుంటే సిగ్గుతో చచ్చిపోయాననుకో" 
 ఈ విషయాలన్నీ వాడు చెప్తుంటే నాకు విపరీతమైన నవ్వు ముంచుకొచ్చింది.
    "ఇక జన్మలో ముక్కూ,ముఖం తెలియని వాళ్ళతో అసలు మాట్లాడకూడదు... టైమ్ వేస్ట్..బోల్డు రిచార్జ్ బిల్లు వేస్ట్" అంటూ పని ఉందని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంటే వాడి వంక నవ్వుతూ చూస్తూ ఉండిపోయాను.
ఇంతకీ ముఖ్య విషయమేమిటంటే ఆ రాజమండ్రి అమ్మాయికి...చ..చ...కాదు..కాదు అబ్బాయికి నంబర్ నేనే ఇచ్చానని ఈ పోస్టులు చదివే వరకూ మా ప్రసాద్ గాడికి ఎప్పటికీ తెలియదు. ఉంటాను.బై!!!
  
    

2 కామెంట్‌లు:

  1. బ్లాగ్ ప్రపంచంలో ఇద్దరు పిచ్చివాళ్లు తిరుగుతున్నారు చౌదరిగారు. వాళ్ళు ఎప్పుడెలా ఎవర్ని కరుస్తున్నారో తెలియడం లేదు.జర భద్రం సారు. మీకధకు ఈరోజు ఒక పిచ్చికుక్క కరిచింది.మీ బ్లాగు చుట్టూరా ఇంజక్షన్లు చేయించుకుని ఆ పిచ్చికుక్కను చంపేయండి.బ్లాగ్ లోకంలో అందరూ ధైర్యంగా తిరుగుతారు.నేను ఎక్కడికక్కడ ఒక బడిత పట్టుకుని కాపలా కాస్తున్నా. దొరికిందా నాలుగు ఉతికి హరిహరన్ కి అప్పగిస్తాను.

    రిప్లయితొలగించండి
  2. ఎవరండీ ఆ ఇద్దరు పిచ్చివాళ్లు.కాస్త మాకు మరింత వివరంగా చెబితే మిగతా బ్లాగర్లు కూడా జాగ్రత్త పడతారు కదా?

    రిప్లయితొలగించండి

Popular Posts

Recent Posts