బుధవారం, ఫిబ్రవరి 03, 2016

మిగతా కులాలలోనే పేదవాళ్లు ఉన్నారా? చౌదరుల (కమ్మ జాతుల)లో లేరా? చౌదరులలో ఎంతో మంది ఆకలికి అలమటిస్తూ ఉన్నారు. ఒకపూట ఉంటే మరొక పూట గడవని ఎన్నో దయనీయ కుటుంబాలు నిలువ నీడ లేకుండా బ్రతుకీడుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లెక్క వేస్తే మిగతా కులాలలో మాదిరిగానే ఈ చౌదరులలో కూడా పేదవారు ఉన్నారు. వీరికి కూడా రిజర్వేషన్లు కల్పిస్తే పోలా? మళ్ళీ వీళ్ళ ఉద్యమాలు కూడా చూడాలా ఏమిటి? కేంద్ర,రాష్ఠ్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ప్రత్యేక రాయితీలతో రిజర్వేషన్లు కల్పించాలి. లేక పోతే రాష్ఠ్ర వ్యాప్తంగా స్పందిస్తాము. రైళ్లను గాని, బస్సులను గాని ఆఖరికి సైకిళ్ళను కూడా తిరగనీయం. రాష్ట్రమంతా బైఠాయించి కూర్చుంటాము. అవసరమైతే చట్టాలను మార్చైనా సరే చౌదరులకు రిజర్వేషన్లు కలిపించవల్సిందే!.అన్ని కులాలకు  రిజర్వేషన్లు కల్పిస్తూ చౌదరుల కులాలను అణగదొక్కడం అమానుషం. దీనిని ప్రత్యేకంగా ఖండిస్తున్నాము. మాకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించే వరకూ మేము విశ్రమించేది లేదు.మాకు తక్షణమే రిజర్వేషన్లు కల్పించాలి.

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Popular Posts

Recent Posts