గురువారం, ఫిబ్రవరి 04, 2016

ఫేస్ బుక్ లోని ఈ పోస్టు చూసి మనసంతా చలించిపోయింది. నిజానికి ఈ దిక్కుమాలిన కులాలన్నీ కేవలం ఒకరికొకరు పరిచయం,గుర్తింపు కొరకే! పెద్ద కులం,చిన్న కులం అన్న మాటలు పనికిమాలిన వెధవలు మాటలాడే మాటలు. ఆమె మన తల్లి లాంటిది కాదా? ఎలా నగ్నంగా నిలబెట్టారో చూడండి. ఆ మాతృమూర్తి తన కడుపున పుట్టిన బిడ్డతో తన మానాన్ని కప్పుకోవడం చూస్తుంటే ఛ... ఆతల్లి గుండె కోత,హృదయ వేదన ఎలా భరించగలుగుతుందో, దేవుడా? ఈ దారుణాలు ఎలా భరిస్తున్నావు?
ఫేస్ బుక్ లో వచ్చిన వివరాలు క్రింది ఇస్తున్నాను.  
మన డిజిటల్ ఇండియాలో ఒక దళిత కుటుంబానికి జరిగిన పరాభవం .... దొంగతనం జరిగింది చర్య తీసుకోండంటూ వచ్చిన ఓ దళిత కుటుంభంతో పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారు. స్టేషన్ బైటికి గుంజుకొచ్చి నడి రోడ్డు మీద భార్య భర్తల బట్టలు ఊడదీసి కొట్టారు. ఉత్తరప్రదేశ్ లోని దన్ కౌర్ పోలీసు స్టేషన్ పరిదిలో సునీల్ గౌతమ్ అనే అతని ఇంట్లో బుధవారం నాడు రాత్రి దొంగతనం జరిగింది. ఆ విషయం పై కంప్లైంట్ ఇవ్వడానికి సునీల్ గౌతమ్, అతని భార్య మరికొందరు బందువులతో కలిసి గురువారం నాడు దన్ కౌర్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. స్టేషన్ లో ఉన్న స్టేషన్ ఆఫీసర్ ప్రవీణ్ యాదవ్ కేసు నమోదు చేయడానికి నిరాకరించాడు. దాంతో ఎందుకు కేసు నమోదు చేయరో చెప్పాలని సునీల్ కుటుంభం ప్రవీణ్ ను నిలదీసింది. అంతే.... పోలీసు అధికారి ప్రవీణ్ కు కోపమొచ్చింది. ఆగ్రహంతో ఊగిపోయాడు. అతనికి స్టేషన్ లో ఉన్న మరికొందరు పోలీసులు తోడయ్యారు. డ్రస్సులో ఉన్న పోలీసులు, డ్రస్సుల్లో లేని పోలీసులు అందరూ కలిసి ఒక్క సారి సునీల్ కుటుంభ సభ్యులు, బందువుల మీద పడ్డారు. కొట్టుకుంటూ రోడ్డుమీదికి ఈడ్చుకొచ్చారు. సునీల్ భార్య చీరను లాగి పడేశారు. బట్టలు చించేశారు. అడ్డుపోయిన సునీల్ బట్టలు కూడా చించి పడేశారు. అడ్డుకున్న బందువులను చితక్కొట్టారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రవీణ్ ʹఎఫ్ ఐ ఆర్ రాయాల్నా వద్దా అనేది నా ఇష్టం నన్నే ప్రశ్నిస్తారా ʹ అని బూతులు తిట్టుకుంటూ నగ్నంగా ఉన్న సునీల్ ను అతని భార్యను రోడ్డు మీద ఈడ్చుకుంటూ కొట్టాడు. వందలాది లాది మంది చూస్తుండగా ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టిన పోలీసులు అంతటితో ఊరుకోకుండా సునీల్ పై, అతని భార్యపై, బందువులపై క్రిమినల్ కేసులు బనాయించి జైలుకు పంపారు. ఈ దుర్మార్గం జరుగుతుండగా అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో ఈ సంఘటనను చిత్రీకరించి యూట్యూబ్ లో పెట్టాడు. ఈ దాడి సంఘటనపై జర్నలిస్టులు ప్రవీణ్ యాదవ్ ను ప్రశ్నిస్తే అసలు అలాంతి వేమీ జరగలేదని. సునీల్ కుటుంభమే పోలీసులపై దాడికి ప్రయత్నించిందనిఅందుకే వారందరి పై క్రిమినల్ కేసులు పెట్టామని చెప్పాడు. పోలీసులకు కథలు చెప్పడం మామూలే కానీ విజువల్స్ నిజాలు మాట్లాడుతాయి కదా !

6 కామెంట్‌లు:

  1. మీడియా అయినా మీరయినా ఒక కుటుంబానికి అవమానం జరిగింది అని వ్రాయాలి కానీ దళిత కుటుంబానికి అవమానం జరిగింది అని వ్రాస్తారా ? ఇటువంటి అవమానం ఎవరికి జరిగినా తప్పే కదా ? అక్కడ అంతమంది ఉన్నారు ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకురాలేదు. మీరు ఫేస్ బుక్ లోనూ బ్లాగుల్లోనూ పండగ చేసుకుంటున్నారు. ఇది మాత్రం నేను సహించలేకపోతున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Sensible response !!
      Great !!
      ఇదే ఫొటో తో ఇంకొక వెర్షన్ కథ ఉంది ...
      దంగతనం జరిగింది దొంగ అని నిర్దారించుకుని అరెస్ట్ చేయడానికి వెలితే ఆ దొంగ మొగున్ని కాపాడడానికి ... అరెస్టుని అడ్డుకోవడానికి ....ఆ మహానుభావురాలు తనే బట్టలు చించుకుంది అని ....!!

      బట్టలు కప్పడానికి ప్రయత్నిస్తే నిరాకరించింది అని!

      ఆంగ్ల మీడియా కూడా ఏ కథ నిజమో తెలియక ....సిక్యులర్ ప్రభుత్వాన్ని.... పాలనని నిందించలేక ...ఓ 2 రోజులు అరచి విషయం మర్చిపోయారు!!

      ఏ గొడవ అయినా దలిత లేబుల్ పడితే వచ్చే కిక్కు వేరయిపోయింది!!
      ఆ అవమానం నిజమే అయ్యి ....ఆ కుటుంబం బ్రామ్హణులది అయితే మీకు

      అబ్యంతరం లేదు అనుకోవాలేమో!!

      తొలగించండి
    2. First 2 lines for Niharika ....
      Rest of the lines for Post owner ...
      Tried posting 2 different comments but something went wrong with browser!!

      తొలగించండి
  2. నీళ్ళు లేక పంట ఎండిపోయి "దళిత" రైతు ఆత్మహత్య, అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డ "దళిత" కుటుంబం, ట్రాక్టర్ తిరగబడి పదిమంది "దళిత" కూలీలు దుర్మరణం, పడవ మునిగిపోయి నలుగురు "దళిత" విద్యార్ధులు గల్లంతు, అత్యాచారానికి గురయిన "దళిత" యువతి. ఎన్నిసార్లు చూడలేదు ఈ రకం వార్తల రిపోర్టింగ్. ఇటువంటి సంఘటనలు ఎవరికయినా జరగొచ్చు. ఈ టపాలో వర్ణించిన అవమానం తప్పక ఖండించవలసిందే - ఏ వర్గం వారికి జరిగినా కూడా, కానీ మీడియా వారికి Narasimha Kammadanam గారు చెప్పినట్లు "దళిత లేబుల్" తగిలిస్తే ఆ కిక్కే వేరబ్బా.

    వార్తల్లో సెన్సేషన్ జొప్పించడమే లక్ష్యంగా పెట్టుకుని అందుకోసం ఏ అవకాశాన్నీ వదులుకోని మన మీడియా వారికి నీహారిక గారు చెప్పే విలువలు తలకెక్కుతాయా? బ్లాగుల్లో కూడా ఆ ధోరణి అప్పుడప్పుడు తొంగి చూస్తోంది.

    రిప్లయితొలగించండి
  3. మరి దళితులు అనే పదం పోతుందంటారా...మన దేశంలో నుండి? బ్రదర్ మిమ్మల్ని కాదు.ప్రస్తుతం నేటి క్రైస్తవులు కూడా...పేరు చివర్న కులం(తోక) పేరు మోజెస్ చౌదరి, జయపాల్ రెడ్డి,జేఫన్య శాస్త్రి,సొలోమోను గుప్తా, అలాగే చర్చిలలో మాలలు మాలలుగా మాదిగలు మాదిగలుగా, ఇతర కులస్తులు వారి కులాలలోనే జీవిస్తున్నారు.క్రీస్తు వచ్చింది కుల వర్ణ వర్గ జాతి మత భేదాలతో వున్న లోకాన్ని క్రీస్తులో ఒకే కులం ఒకే మతం ఒకే వర్ణం ఒకే వర్గం ఒకే జాతిగా నిలబెట్టడానికి వచ్చాడు.నిజముగా క్రీస్తుని వెంబడించేవారు ఏ కులములోను ఉండరు. బైబిల్....
    పౌలు గలతీయులకు వ్రాస్తు ౩:1 ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువవేయబడినవాడైనట్టుగా యేసు క్రీస్తు మీ కన్నులయెదుట ప్రదర్శింపబడెనుగదా!
    2 ఇది మాత్రమే మీవలన తెలిసికొనగోరుచున్నాను; ధర్మశాస్త్ర సంబంధ క్రియలవలన ఆత్మను పొందితిరా లేక విశ్వాస ముతో వినుటవలన పొందితిరా?
    3 మీరింత అవివేకులైతిరా? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి, యిప్పుడు శరీ రానుసారముగా పరిపూర్ణులగుదురా? 26 యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసమువలన దేవుని కుమారులై యున్నారు.
    27 క్రీస్తు లోనికి బాప్తిస్మముపొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు.
    28 ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.
    29 మీరు క్రీస్తు సంబంధులైతే3 ఆ పక్షమందు అబ్రాహాముయొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు.
    ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు వాక్యము అనుసరించుటల్లేదు కాబట్టే అనాధిగా వచ్చిన కులాలు అలాగే వేరులు విస్తరించుకుపోయాయి.

    రిప్లయితొలగించండి
  4. కులాల కుంపటి పెట్టినవాడు కులము గోత్రము లేనివాడు
    మతాల మంటలు రేపినవాడు మానవత్వము మరచినవాడు.

    రిప్లయితొలగించండి

Popular Posts

Recent Posts