నేను ఉంటున్న రూమ్ కి ప్రక్కనున్న ఇంటి వారు క్రైస్తవులనుకుంటా! ప్రతిరోజూ ఉదయమే ఎవరో విజయప్రసాద్ రెడ్డంట..ఆయనగారి ప్రసంగాలు ఫుల్ సౌండ్ తో పెడుతుంటే నా రూమంతా అదురులతో మారుమోగిపోతుంది. బహుశా నన్ను క్రైస్తవంలోకి ఆహ్వానించడం కోసం కాబోలు. అంతకు ముందు కొన్నిసార్లు ఒక అబ్బాయి అన్నయంటూ వచ్చి యేసు దేవుడని,మనందరికోసం ప్రాణం పెట్టాడని ఏవో పాస్టర్లు దండుకోవడానికి కల్పించిన నాలుగు కల్పిత బోధనలు తీసుకొచ్చాడు. నేను బైబిల్ మధ్యలో పెట్టి అవ్వన్నీ చూపించు అనేటప్పటికి అక్కడి నుండి తెలివిగా జారుకున్నాడు. మళ్ళీ నాదగ్గరకు రావడానికే భయపడుతున్నాడు. ఇక తన వల్ల పని అవ్వదనుకున్నాడో,ఏమో ఆ విజయ ప్రసాద్ రెడ్డి అనే పాస్టర్ ప్రసంగాలతో మారుమోగిస్తున్నాడు. ఆ పాస్టర్ బోధనలు ఒకసారి విన్నానో, లేదో అన్నీ జంతర్ మంతర్ బోధనలే. ఒకదానికొకటి సంబంధం ఉండి చావదు. తలపోటు పెరిగిపోతుంది. వేసిన కేసట్టే వేసి,వేసి విసిగిస్తుంటే వీళ్ళు ఇంత మూర్ఖులా అనిపిస్తోంది. ఏదో ఒకరోజు బైబిల్ చేత బట్టుకుని వాళ్లెంటికే వెళ్ళి గట్టిగా ఇవ్వక తప్పదనిపిస్తోంది.
సోమవారం, మార్చి 07, 2016
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
బైబిలు బట్టెర చౌదరి
రిప్లయితొలగించండిబాబుల మార్చుద నటంచు బాగుగ చదివెన్
ఖాబిలు అయ్యెర మీదుగ
ప్రాబల్కుల చదివె యసు ప్రభువుగ నయ్యెన్ :)
చీర్స్
జిలేబి
మీ శతక సాహిత్యం నాకు అర్ధమవ్వలేదు గాని స్పందనకు మాత్రం కృతజ్ఞతలు జిలేబీగారు.:)
తొలగించండి
తొలగించండిజిలేబి రాతలే అర్థం కాక బోతే ఇక బైబిల్ ఎప్పడు చదివేది ? ఎట్లా అర్థం చేసుకునే దండీ బాబు :)
జిలేబి
జిలేబీగారి శతకం అంతా గొప్పది మరి.:)
తొలగించండిYes chowdary garu. It is a torture to listen to loud speeches like that. It is horrible like telugu serials.
రిప్లయితొలగించండి