
ఇవేమీ తెలియని సినిమా యాక్టర్స్ ని అనవసరంగా రాజకీయాలలోకి లాగి డాన్స్ వేయిస్తున్నారు ఈ రాజకీయ నాయకులు. దానికి ఉదాహరణ రోజా గారే! ఆమె ఏనాడూ తన సొంత నియోజకవర్గం గూర్చిన అభివృద్ధి మాటే ఎట్టలేదు. ఎప్పుడు చూసినా టివిలలో,పేపర్లలో వాల్లనూ,వీళ్ళనూ తిడుతూ,విమర్శిస్తూ కాలం గడుపుతోంది. ఆమె పరిస్తితి ఒక సంవత్సరం పాటు అసెంబ్లీలోకి అడుగు వేయడానికి కూడా వీలు లేనట్టుగా శిక్ష వేయించుకుంది. ఆమె ఏ పార్టీ ఉన్నా అలానే ప్రవర్తిస్తూ వస్తోంది. ఆమె ప్రజా ప్రతినిధేమిటో అర్ధమై చావడం లేదు.
ఇక పోతే చిరంజీవిగారు. "ప్రజారాజ్యం" పార్టీ పెట్టి కాంగ్రెస్ లో కలిపేసి మినిష్టర్ పదవి పూర్తిగా అనుభవించకుండానే ప్రజలలో లేకుండా ఒక మూలకు పోయాడు. ఇక ఆయనగారి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు రంగంలో దిగి ఎక్కడ ఏమి జరిగినా నాలుగు సినిమా టైపు డైలాగులు వదిలేసి పోతున్నాడు. పాపం ఇంతకు మించి ఈయనగారికి శీను లేదని కోడరి అభిప్రాయం.
ఇంకా ఇప్పుడు రాజకీయ నాయకుల వలకు బలయిన వాళ్ళలో బాలకృష్ణ ఒకరు. పాపం రాజకీయాలో కొచ్చినా తను హీరోనే అనుకున్నాడో,ఏమో కొన్ని భారీ (భయంకరమైన) డైలాగ్స్ వదిలి కొంప మీదకు తెచ్చుకున్నాడు. ఎటువంటి వివాదంలోకి రాకూడని పరిస్థితులలో పెద్ద వివాదాన్నే మీదేసుకున్నాడు. అభిమానుల్లో గుండెల్లో సింహం లా ఉన్నవాడు అభిమానులు సైతం చీదరించుకునే పరిస్తితి తెచ్చుకున్నాడు.
ఈనాటి తరంలో ఇలా ఎందరో ఉన్నారు. అయితే కొంతమంది రాజకీయాలలో ఇమిడిపోయినా వాళ్ళందరూ పెద్ద కీలక పదవులు పొందక పోవడం విశేషం. ఎన్.టి.ఆర్.ఏం.జె.ఆర్ ల కాలం కాదిది. కాబట్టి రాజకీయ నాయకుల ప్రలోభాలకు మురిసిపోయి రాజకీయాలలో కొచ్చి అభిమానుల హృదయాలలో స్థానాన్ని పోగొట్టుకోవద్దని సినిమా యాక్టర్లందరికీ మనవి.
రాజకీయాలలో కొచ్చి అభిమానుల హృదయాలలో స్థానాన్ని పోగొట్టుకోవద్దని సినిమా యాక్టర్లందరికీ మనవి.- good advice
రిప్లయితొలగించండి