గురువారం, జులై 07, 2016

ఈమధ్య ప్రతి రొజూ మాలిక అగ్రిగేటర్ చూస్తూనే ఉన్నాను. మనువుగారి బ్లాగు ఎప్పుడూ మొదటి పంక్తిలోనే కూర్చుంటుంది. క్రిందికి దిగిరావడం లేదు. కొత్తగా ఎవరు వ్రాసినా దాని క్రిందికి రావాల్సిందే. గతంలో ఇదేలాగబ్బా మనువుగారు ప్రతి క్షణం టపాలు వ్రాసేస్తున్నారా ? ఏమిటి? అనుకుంటున్న తరుణంలో మన బ్లాగిల్లు శ్రీనివాస్ దాని మాయాజాలం విప్పి చెప్పారు.
   నేను కూడా ట్రై చేద్దామని నా బ్లాగు యొక్క పాత టపాలు మళ్ళీ ఫ్యూచర్ డేట్ అప్లై చేసి చూసాను. అంతే నా టపాలు కూడా మాలిక నెత్తి పైకెక్కి కూర్చున్నాయి. ఇలా నాలుగైదు టపాలు పెట్టినాను.
    అయితే ఈ విధానం నాకు నచ్చలేదు. పాత టపాలను బ్లాగు వీక్షకుల నెత్తిపై మళ్ళీ రుద్దడం కరెక్ట్ కాదనిపించింది. వెంటనే విరమించుకున్నాను. ఇంతలోనే మన జిలేబీ నాయకమ్మ ఆ బ్రహ్మ విద్యనూ నేనే కనిపెట్టినట్టు, మాయ సృష్టించినట్టు తన బ్లాగులో గాటుగా విమర్శిస్తూ ఊదరగొటిన్ది. ఆమెగారు ఏదీ కూడా సరిగా తెలుసుకోదు. తన పద్య గానంలో అడ్డదిడ్డంగా వ్రాసేస్తుంది.
     ఏది, ఏమైనా ఆ జిలేబి గారి తీపి కబుర్లు ఒకొక్క సారి బాగున్నా ఎక్కువుగా వెగటు కలిగిస్తాయి.
       మొత్తానికి పాత టపాలను మళ్ళీ తిరగదోరటం మాలికలో ఉన్న సౌలభ్యమో, లేక లోపమో తెలియదు గాని రెగ్యులర్ బ్లాగు వీక్షకులకు మాత్రం ఇబ్బందే!

3 కామెంట్‌లు:

  1. శివుడికీ పార్వతికీ మధ్యలో కోదండం రానంతవరకూ ఎవరు ఎవరి నెత్తిమీద కూర్చున్నా కమెంట్స్ రాలవు.

    రిప్లయితొలగించండి
  2. శివుడికీ పార్వతికీ మధ్యలో కోదండం రానంతవరకూ ఎవరు ఎవరి నెత్తిమీద కూర్చున్నా కమెంట్స్ రాలవు. నిజమండి

    రిప్లయితొలగించండి
  3. మాలిక ఏమిటి సాయంత్రం నుండి అప్డేట్ కావట్లేదు ! కొంపదీసి అందరూ పోస్టు తేదీలు గానీ మార్చారా ఏంటి ? :)

    రిప్లయితొలగించండి

Popular Posts

Recent Posts