శుక్రవారం, జనవరి 05, 2018

ప్రతి రోజూ కొద్దిగా చదవడానికి నిర్ణయించుకో. అది ఒక వాక్యమే కావచ్చు. రోజుకు పదిహేను నిమిషాల వెచ్చించగలిగేతే, సంవత్సరాంతనికి ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది. -హోరేస్ మాన్ (అమెరికన్ విద్యావేత్త)

పేట్ సాజక్ నిర్వహించే 'అదృష్టచక్రం' [wheel of fortune] ప్రపంచంలో ప్రేక్షకులు ఎక్కువ చూసే టీవీషోలలో ఒకటి. ఈ గేంషో ప్రపంచవ్యాప్తంగా 51 మార్కెట్లకు టెలికాస్టు అవుతుంది. పదికోట్లమంది ప్రేక్షకులు ప్రతివారం చూస్తారు.
ఇప్పటికీ 20 సంవత్సరాలుగా సాజక్ 'అదృష్ట చక్రం' షోని నిర్వహిస్తున్నాడు. కనుక అతను ఈ గేంలో నిపుణులు అని మనం నిస్సందేహంగా అనవచ్చు. ఒక ఇంటర్వూయర్ సాజక్ ను షోలో ఎక్కువ గెలుచుకోవడానికి కీలకమైనదేమిటి అని అడిగినప్పడు, సాజక్ ఇలా చెప్పాడు.
'ఇంతకు ముందు ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. జనం దగ్గర చాలా డబ్బు ఉంటుంది. బోర్డు మీద ఎక్కువ అక్షరాలుండవు.. వాళ్లకు పజిల్ తెలియదు... అనేక ఖాళీ ప్రదేశాలుంటాయి... వాళ్లు చక్రం తిప్పుతారు... ఒక అచ్చు అక్షరం కొనడానికి బదులు తమకు తోచిన అక్షరాలు చెబుతారు. అచ్చు అక్షరం కొనకుండా అనేకమంది గేంలో నష్టపోవడం నేను చూశాను.' 
చదువు మీ అచ్చు [Vowel] అక్షరం 
పేట్ సాజక్ చెబుతున్నదేమిటో నేను అర్ధం చేసుకున్నాను. ఎందుకంటే నేను ఆ పేట్ చాలాసార్లు చూశాను. ఒక్కొక్కప్పుడు బోర్డు మీద చాలా కొద్ది అక్షరాలే ఉంటాయి. ఖాళీగా ఎక్కువగా ఉంటాయి. అప్పుడు పోటీదారులలో ఒకరు ఒక అచ్చు అక్షరాన్ని కొంటారు. వాన్నా వైట్ పని చెయ్యడం మొదలుపెడుతుంది. ఫ్లిప్... ఫ్లిప్ ...ఫ్లిప్ ... త్వరలోనే నేను ఒకటి రెండు పదాలు గుర్తించగలిగాను. కొంతసమయం గడిచేటప్పటికీ పోటీదారుడు ఎన్ని అక్షరాలు నింపేస్తాడంటే మాఇంటి కుక్క కూడా ఈ పజిల్ పరిష్కరించగలదు. ఈ పజిల్ పరిష్కరించడానికి కీలకం, పోటీదారుడు ఒక అచ్చు అక్షరం కొనడం ద్వారా ఒక అడుగు ముందుండడమే.
జీవితమే ఆటలో ఇదే సంభవిస్తుందని నేను అనుకుంటున్నాను. జనం తమ జీవితల్లో చాలా ఖాళీస్థలలతో ఒక పజిల్ చూస్తారు. అయితే, అధికసంఖ్యాక ప్రజల ఏం చేస్తారు? వాళ్లు తమ అదృష్ట చక్రం తిప్పడం మొదలుపెట్టి యాదృచ్ఛికంగా అక్షరాలు చెబుతుంటారు. 'ఇది ప్రయత్నిద్దాం.. కాదు ఇది... కాదు దాన్ని కొందా...'
హలో ... ఓ ...ఓ ...ఓ ... మిత్రులారా. యాదృచ్ఛికంగా అక్షరాలు చెప్పే పద్ధతికి స్వస్థి చెప్పాల్సిన సమయం వచ్చింది. ఒక అచ్చు అక్షరం కొనడం ద్వారా మీ జీవితంలో ఒక అడుగు ముందుకు వెయ్యాల్సిన సమయ౦ వచ్చింది... జీవితం అనే ఆటలో ఒక అచ్చు అక్షరం చదువు. క్లుప్తంగా చెప్పాలంటే, చదువు మీ జీవిత పజిల్ ను పరిశ్కాంచడంలో మిమ్మల్ని ఒక అడుగు ముందుంచుతుంది.
ఒక అడుగు ముందుకు అన్నప్పుడు, లాటరిలో విజయం సాధించడం, జిలియన్ డాలర్ల ఆస్థికి వారసుడు కావడం లాంటి బ్రహ్మాండమైన అంశం గురించి నేను మాట్లాడడం లేదు. నేను అడుగు ముందుకు అన్నప్పుడు, జీవితం అనే ఆటలో ఒక పెద్ద లాభం కలిగించే, మీరు మళ్ళీ, మళ్ళీ ఉపయోంచగల ఒక చిన్న వ్యూహం గురించి మాట్లాడుతున్నాను. నేను చెప్పేదానిని రుజువు చేసే రెండు గణాంకాలు ఈ దిగువనిస్తాను.
గణాంకం 1: 
ఏ నిర్దిష్ట సమయంలోనైనా, అమెరికన్లలో మూడవ భాగం దారిద్ర్యంలో జీవిస్తున్నారు.
ఒక అడుగు ముందుకు - రోజుకు పదిహేను నిమిషాల చదువు మీ జీవితాన్ని మార్చగలదు.
గణాంకం 2: 
హై స్కూల్ తర్వాత అమెరికన్లలో 37 శాతం మరో పుస్తకం ఎన్నడూ చదవరు.
ఈ గణాంకాల గురించి ఒక క్షణం ఆలోచించండి. ప్రపంచ చరిత్రలో అమెరికా అత్యంత అధికంగా సంపద కూడబెట్టిన దేశం. మనలో, ప్రతి ముగ్గురి లోనూ ఒకరు దారిద్ర్యంలో జీవిస్తున్నారు. ఇది దేశానికి అవమానం మనలో మూడవవంతు మంది, చరిత్రలో అత్యంత శక్తివంతమైన సాంకేతిక ముందంజ చదువు వలన లాభం పొందడానికి నిరాకరిస్తున్నాం.
మరోసారి చూద్దాం - మూడవవంతు దారిద్ర్యంలో... మూడవవంతు చదవనివారు. కాకతాళియమా? నేను అలా అనుకోవడం లేదు. కుటుంబ అక్షరాస్యత కొరకు జాతీయ కేంద్రం ప్రకారం, 4 కోట్ల యువకులకు ఒక సాధారణ ఫారం చదివి పూర్తిచేయ్యగల నైపుణ్యం లేదు. 5కోట్లు, భవిష్యత్తులో రాబోయే ఉన్నత సాంకేతిక ఉద్యోగాలకు సిద్దంగా లేరు. 29కోట్ల జనాభాలో, మొత్తం 9 కోట్ల యువకులు, తమ జీవితలను మెరుగుపరుచు కోవడానికి చదువు ఒక ముందడుగుగా వినియోగించుకోలేరు, వినియోగించుకోరు. ఇది జనాభాలో దాదాపు మూడోవంతు. వీళ్లు తమ జీవిత ఆటలో 'ఒక అచ్చు అక్షరం కొనడానికి' బదులు 'అక్షరలను యాదృచ్ఛికంగా చెబుతున్నారు.' చదవకుండా, ఆటలో ఓడిపోయే పరిస్థితిని స్వయంగా తెచ్చుకుంటున్నారు. 
మిత్రులారా, చదువు ఒక చిన్న ముందడుగు కావచ్చు. కానీ అది పెద్ద లాభాలను చేకూరుస్తుంది. రోజుకు 15 నిమిషాలు, లేదా అంతకన్నా మిలియన్ల ప్రజలకు లేకపోవడం సిగ్గుపడాల్సిన విషయం.

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Popular Posts

Recent Posts