శుక్రవారం, అక్టోబర్ 14, 2016

కాలేజీ, ఫేస్ బుక్ , ఇరుగుపొరుగు... ఇలా మనకు రకరకాల చోట్ల స్నేహితులు ఉంటారు. వాళ్ల పరిధి పెరిగేకొద్ది అందరితో అన్నిసార్లు మాట్లాడటం కుదరకపోవచ్చు. మరి స్నేహబంధాన్ని ఎలా పదిలపరచుకోవాలో చూద్దాం రండి.
అప్పుడుప్పుడూ స్నేహితులకు ఉత్తరం రాయండి. ఈ మెయిల్, వాట్స్ యాప్, ఫేస్ బుక్ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో ఉత్తరమా అని అనకండి. అది తప్పనిసరే. అప్పుడప్పుడూ ఉత్తరాలు రాయడం వాళ్ల మీరు వారికి చాలా ప్రాధాన్యం ఇస్తున్నారనే విషయాన్ని తెలియజేసినవారవుతారు. పైగా అదో మధురజ్ఞాపకంగా మిగులుతుంది. 
స్నేహితులంతా ఓ చిత కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారా! మధ్యమధ్య ఫోను మాట్లాడం, సందేశాలు పంపడం వద్దు. స్నేహితుల మధ్య ఉన్నప్పుడూ వీలైనంతవరకూ ఫోనుని కట్టేయండి. అది కష్టం అనుకుంటే నిశ్శబ్దంగా ఉంచుకోవడం మంచిది. ఆ సమయం మొత్తం వారికే కేటాయించండి.
స్నేహితులకు సంబంధించి ఎన్నో ముఖ్యమైన రోజులు ఉంటాయి. వాటిల్లో మొదట చెప్పుకోవాల్సింది పుట్టినరోజు. దాన్ని మీరు వీలైనంతవరకూ మర్చిపోవద్దు. గుర్తుపెట్టుకుని, మరి అభినందనలు తెలియజేయండి. అలాగే ఉద్యోగంలో చిన్న పదోన్నతి సాధించినా, మంచి ర్యాంకు తెచ్చుకున్న అభినందించేవారిలో మీరు ముందుండండి.
ఎంత స్నేహితులయిన సరే అదేపనిగా మీ గొప్పలు చెప్పడం, సమస్యలు పంచుకోవడం, సాయంకొరడం సరికాదు. మరి తప్పనిసరి అయితేనే ఆఖరి ప్రయత్నంగా వారి సాయాన్ని కోరాలి. ఎంతో స్నేహంగా ఉన్న కూడా ఓ పరిధి పెట్టుకోవాలి.
మీరు మీ స్నేహితులకు ఎంత దూరంలో ఉన్న సరే.. వాళ్లకు ఏదయినా కష్టం వస్తే మీరు అండగా ఉండేలా చూడండి. దాన్ని మాటల రూపంలో కన్నా చేతల్లో చూపించడం మంచిది.

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Popular Posts

Recent Posts