మంగళవారం, అక్టోబర్ 25, 2016

పేపర్ తీస్తే తల్లి మందలించిందని ఆత్మహత్య, ఎంసెట్ లో ర్యాంకు రాలేదని ఆత్మహత్య, గురువు మందలించడని,తండ్రి తిట్టడని, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కాలేదని, సమైక్యాంధ్ర కావాలని, తమకిష్టమైన నాయకుడు మరణించడని, ఇంకేదో కావాలని, జీవితంపై విరక్తి కలిగిందని ఇలా ఏదో ఓ సాకుతో ఈ జీవితాన్ని ముగిస్తున్నారు.

ఆశయం, లక్ష్యం, గురి, ఎయిమ్, టార్గెట్ ఈ పదాలు మనకు సుపరిచితమే. ఈ పదాలే నేడు మనిషిని అతలాకుతలం చేస్తున్నాయి. తాత్కాలిక లక్ష్యాలు మనిషి ప్రాణాన్ని బలిగొంటున్నాయి. అహింసను ప్రేరేపిస్తున్నాయి. అలజడులను సృష్టిస్తున్నాయి.

లక్ష్యసాధన అంటే పోరాటం. పోరాటం అంటే కత్తి బట్టి కదనరంగంలో దూకడం కాదు. బైకాట్, ధర్నాలు ఆత్మహత్యలుకాదు. సాధారణ ప్రజలను ఇబ్బంది పెట్టడం, ప్రజల ఆస్తులను ద్వంసం చేయడం అంతకన్నా కాదు. లక్ష్య సాధనలో ఓ దృఢ సంకల్పం ఉండాలి, ఓ ప్రణాళిక ఉండాలి, అందుకు తగ్గ కృషి చేయాలి.

ప్రతి మనిషికి విభిన్న లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యసాధనలో మనిషి విభిన్న మార్గాలను అవలంభిస్తుంటాడు. అహింసకు తావులేకుండా సత్యమార్గంలో మానవతా దృక్పధం తో చేసే పోరాటమే ఉత్తమమైనది.

నేడు మనం లక్ష్యసాధనలో చేసే పోరాటంలో అహింస చోటు చేసుకుంటుంది. ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. 
మనిషికి ఆశయం ఉండాలి. ఆ ఆశయసాధన లో తగు కృషిచేయాలి. ఆశయ సాధకుడు ఎప్పుడూ అలుపెరగకూడదు. మంచి మార్గంలోనే మంచిని సాధించాలి. ఆత్మహత్యలు, బలిదానాలు చేసినా కలిగే ప్రయెజనం శూన్యం. ఆశయ సాధకునికి అపజయం ఎదురయ్యే ప్రతి దెబ్బ ఓ కొత్తపాఠాన్ని నేర్పాలి. మన ఆశయాలకు ఇంకా దృఢత్వాన్ని ఇవ్వాలి. అంతేకాని నిరాశ నిస్పృహలకు తవివ్వకూడదు. 

మనకు ఎదురయ్యే ప్రతి అపజయాన్ని విజయాలకు చిహ్నంగా గుర్తించాలి. పువ్వు పుట్టగానే పరిమళన్నిపంచినట్లు, ఆశయం పుట్టగానే ద్తెర్యాన్ని, సహనాన్ని పంచాలి.

నేడు ఆశయసాధనలో బలి అయ్యేది, బలిదానాలు చేసేది విద్యార్ధులే. తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని తమ పిల్లల్ని చదివిస్తున్నారు. దానికి ప్రతిగా వారు శోకాన్ని అడియాసలు చేస్తున్నారు. వారి ఆకాంక్షలపై నీళ్లు చల్లుతున్నారు.

పేపర్ తీస్తే తల్లి మందలించిందని ఆత్మహత్య, ఎంసెట్ లో ర్యాంకు రాలేదని ఆత్మహత్య, గురువు మందలించడని,తండ్రి తిట్టడని, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కాలేదని, సమైక్యాంధ్ర కావాలని, తమకిష్టమైన నాయకుడు మరణించడని, ఇంకేదో కావాలని, జీవితంపై విరక్తి కలిగిందని ఇలా ఏదో ఓ సాకుతో ఈ జీవితాన్ని ముగిస్తున్నారు.

అర్ధాంతరంగా జీవితాన్ని అంతమొందించుకొని తల్లిదండ్రులను శోకసముద్రంలోకి నెట్టివేసి ఇహపర లోకాలను నష్టపరుచుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజనం? ఆత్మహత్యలతో ఆశయాలు నెరవేరుతాయా? అంటే అదీలేదు. ఈ త్యాగం మన అన్నవాళ్లకు, కన్నా తల్లిద్రండ్రులకు గుండెకోతనే మిగులుస్తుంది. అంతేకాదు ద్తెవాజ్ఞను ధిక్కరిస్తుంది.

ఖుర్ఆన్ లో దైవం. ఇలా తెలుపుతున్నాడు :''మిమ్మల్ని మీరే హత్యగావించుకోకండి'' [ఖుర్ఆన్]
ఇంకా దైవప్రవక్త [స] ఓ హదీసులో ఇలా తెలిపారు : ''మీరు ఏ స్థితిలో ఉన్న మరణాన్ని కోరకండి '' అని. అపర్ధాల ఆశయాల మత్తులో మనం అంధులైపోతున్నారు. దైవజ్ఞ, దైవప్రవక్త ప్రవచనం, కన్నా తల్లిదండ్రుల ప్రేమ - దేన్ని గుర్తించలేనంత అంధులవుతున్నారు. 

ఆశయం అంటే ఎంసెట్ లో ర్యాంక్, మెడిసిన్ లో సీటు లేదా ప్రత్యేక తెలంగాణ సాధించడం, సమైక్యాంధ్రను సాధించడం, ఇంకా ఏదో సాధించడం కాదు ఇవన్నీ జీవితంలో సాధించే వాటిలో భాగాలు మాత్రమే వీటి సాధనలో కృషిసలపాలి కానీ ఇవే అంతిమ లక్ష్యాలు మాత్రం కాదు. ఈ ఆశయాలతోపాటు అంతిమ ఆశయం 'పరలోక సాఫల్యం.' పరలోక సాఫల్యమే మన అంతిమలక్ష్యం లేదా ఆశయం. మరణమే ఈ ఆశయ సాధనలో అంతిమ దశ. దైవం మరణాన్ని ప్రసాదించేవరకు ఈ ఆశయ సాధనలో పాటుపడుతూనే ఉండాలి.

ఏకేశ్వరుడైన దైవాన్నే విశ్వసించడం, పరలోకద్యాస కలిగి ఉండటం, తల్లిదండ్రులతో విధేయతతో మెలగడం, మంచిని పెంపొందించడం, చెడును నిర్మూలించడం, తోటిప్రాణుల పట్ల కరుణా, దయ, జాలి కలిగి ఉండడం వంటివి ఈ ఆశయ సాధనలోని అస్త్రాలు. ఈ అస్త్రాలను వినియెగించుకుంటూ ముందుకు సాగితే జీవితంలో ఆటుపోట్లు ఏర్పడవచ్చేమో కానీ, లక్ష్యసాధనలో విజయం తప్పక ప్రాప్తమవుతుంది. మన ఆశయం నెరవేరుతుంది.  

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Popular Posts

Recent Posts