సోమవారం, అక్టోబర్ 31, 2016

ఆఫీసులో ఇంట్లో ఉన్నన్ని సౌకర్యాలు ఉండొచ్చు.కానీ ఎదురుచూసే వాళ్లుండరు.ప్రేమించే వాళ్లుండరు.కొసరికొసరి వడ్డించే వాళ్లుండరు.అందుకే ఆరైపోగానే అంత ఆరాటం.ఉద్యోగ జీవితంలో అద్భుతవిజయాలు సాధిస్తే చాలు,ఇంకేం అక్కర్లేదనుకునే కెరీర్ జీవులకు ఆ గెలుపు జీవితంలో సగమేనని,ఒక భాగమేనని తేటతెల్లమైపోతోంది. మరో సగం,ఇంకో భాగం...కుటుంబమనే సంగతి అర్ధమవుతుంది."కుటుంబానికి ఇంకాస్త సమయం కేటాయించాలన్న లక్షల మంది దంపతుల నిర్ణయం.

   అంతవరకు బాగానే ఉంది.సమస్యంతా వ్యక్తిగత,వృత్తిజీవితాల మధ్య సమతూకం పాటించడంలోనే.ఆఫీసులో అనుకున్న సమయానికి లక్ష్యాలు పూర్తికావు.ఎంత తొదరగా గూడు చేరుకుందామన్నా ,అర్ధరాత్రి దాటే పరిస్థితి.అందుకే "ఎంత సమయం కేటాయిస్తున్నామన్నది ప్రక్కన పెట్టండి.ఎంత సంతోషంగా గడుపుతున్నామనే కోణంలోంచి చూడండి.అది పావుగంటే కావచ్చు.కాని లీనమయిపోండి. ఇల్లే సర్వస్వం కావాలి.ఆఫీసు,టార్గెట్లు...ఏవీ గుర్తుండకూడదు."అని సలహా ఇస్తారు.ఫ్యామిలీ కౌన్సెలర్స్ పదిలంగా అల్లుకున్న పొదరిల్లు గుర్తుకొస్తోందా! శుభం.

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Popular Posts

Recent Posts