సోమవారం, నవంబర్ 07, 2016

'ఆడపిల్లైనా పెద్దచదువులు చదివించాం. కానీ ఉద్యోగం రాలేదు...! అని పెద్దవాళ్ల బాధ. 'నాతో చదువుకున్న వాళ్లందరూ ఏదో రకంగా స్థిరపడ్డారు. నేను మాత్రం ఇలా..' ఆణి మీలో నిస్పృహ. ఇలాంటి ఎన్నో ప్రతికూల భావాలకి కారణమవుతుంది నిరుద్యోగ దశ ఆ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం రండి.

నాటి విజయాలు:
 ఉద్యోగం లేకపోవడం దేని గురించి ఆలోచించనివ్వదు. కాలేజీలో విద్య, క్రీడలూ,ఇతర అంశాల్లో మీరు అందుకున్న గెలుపు, చదువుని విజయవంతంగా ముగించిన విధానం.. ఇవన్నీ మరిచిపోతుంటాం.నాటి విజయలన్నింటినీ ఓసారి గుర్తుచేసుకోండి. మీ అధ్యాపకుల అభినందనలు నెమరేసుకోండి. వీలైతేఓసారి వెళ్లి వాళ్లని కలవండి. అది మీకు కొత్త నమ్మకాన్నిస్తుంది.

ప్రయత్నలోపం లేకుండా...:
 ఉద్యోగం కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నాన్నీ రాయండి. ఇంతవరకూ ఉద్యోగం రాకపోవడానికి కారణాలు గుర్తు చేసుకోండీ. నైపుణ్యాల లోపం ఉందనిపిస్తే.. వాటిని భర్తీ చేసేందుకు ప్రయత్నించండి. శిక్షణలో చేరండి. మరో విషయం. కంపెనీలకి మీరు నచ్చకపోవడమేకాదు.. మీకు నచ్చని సంస్థలను వద్దనుకున్న సందర్భాలూ ఉండొచ్చు. రాజీపడి ఏదో ఒకదాంట్లో చేరడంకన్నా.. మంచిదానికోసం వేచి ఉండటం ఉత్తమమని తెలుసుకోండి. 

పోలికలొద్దు:
ఇప్పటికే ఉద్యోగంలో స్థిరపడ్డవారితో పోల్చుకోవడంవల్ల ప్రతికులభావాలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఇంటర్వ్యూలూ బృంద చర్చలకు వెళ్లాల్సిన మనలో ఇవి తీవ్ర ప్రభావం చూపిస్తుంటాయి. ఎప్పటికప్పుడు మన ఆలోచనల్ని జాగ్రత్తగా పరిశీలించడం ఒక్కటే దీనికి పరిష్కారం. మీ మనసు ప్రతికూల భావాల్లోకి వెళుతోందనిపిస్తే.. చటుక్కున సానుకూల అంశాలపై దృష్టిమరల్చండి. మీకు నచ్చిన అభిరుచి పై మనసుని లగ్నం చేయండి.

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Popular Posts

Recent Posts