ఉరుకుల పరగుల జీవితం లో ఏకాంతంగా .. ప్రశాంతంగా గడపడానికి సమయం ఎక్కడ వుంటుంది. అయినా అలా గడపాల్సిందే అంటున్నారు నిపుణులు . దానివల్ల శారికంగా ,మానసికంగా మరెన్నో ప్రయోజనాలు చేకూరతాయి .అవేంటంటే ..
ప్రతిరోజూ ఎంతో కొంత సమయం ఎకాంతంగా గడపడానికి అందరికీ కుదరకపోవచ్చు. కానీ వారంలో కనీసం ఒక సారైనా అందుకోసం సమయం కేటాయించుకోండి. అలా చెయ్యడం వల్ల ఆలోచనా తీరు మారుతుంది .కేవలం మీతో ముడిపడిన బావాలే మనసు లో మెదులుతాయి .చిరాకూ ,విసుగూ పక్కకు వెళ్ళిపోయి .. ఒత్తిడి తగ్గుతుంది .
ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇతరులతో పంచుకుంటే ఏదో ఒక సలహా ఇస్తారు. కొన్ని సమస్యల్ని ఎవరితోనూ పంచుకోవాలనిపించదు. అలాంటప్పుడు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఓ గంటపాటు ఉండండి. సమస్య గురించి ఆలోచించి .. దానికి పరిష్కారాలను కూడా మీకు మీరుగా సూచించుకోండి. .మంచీ చెడులను విశ్లేషించుకోండి. మీతో మాట్లాడుకోవడమంటే ఇదే. ఇతరుల ప్రభావం లేకుంటే ఇదే. ఇతరుల ప్రభావం లేకుండా స్వయంగా నిర్ణయం తీసుకోవడం ఇలా సాద్యమవుతుంది.
ఎన్ని వ్యాపకాలున్నా సరే అభిరుచులకు ప్రాధాన్యమివ్వడం వల్ల సానుకూల దృక్పథo పెరుగుతుంది. డ్రైవింగ్ క్లాస్ లకు వెళ్ళడం ,తోట పని చేయ్యడం.. ఈత నేర్చుకోవడం వంటివి దూరమవుతాయి.
ఒంటరిగా షాపింగ్ కు వెళ్ళడం కూడా మనకోసం మనం గడపడమే! ఎవరి ఎంపికా లేకుండా మనసుకు నచ్చినవి ఎంచుకోవడం...గౌవించుకోవడమే!
కొన్ని సార్లు క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొనే ప్రమాదం వుంటుంది. కానీ ఆవేశం, కోపం ఎక్కువగా ఉన్నప్పుడు ఒంటరిగా వుండడం మంచిది. ఒంటరితనం ఆవేశాల్ని తగ్గిస్తుంది. మనసును నిదానపరుస్తుంది. మనతో మనం మాట్లాడుకోవడం...మంఛిచెడులను బేరీజు వేసుకోనే క్రమంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోo. అధిక రక్తపోటూ తగ్గుతుంది.

0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి