శుక్రవారం, డిసెంబర్ 02, 2016

రెండురోజుల క్రితం విపక్షాలన్నీ కలిపి భారత్ బందు ప్రకటించాయి. కానీ ఎవరూ పెద్దగా స్పందించకపోవడం మంచి శుభసూచకం. ఎందుకంటే పెరిగిన ధరలు తగ్గించమని బందు చేస్తే ఎవరైనా స్పందిస్తారు. అంతే గాని నల్ల కుబేరుల ఆట కట్టిస్తున్న నరేంద్ర మోడిని ప్రజలెలా వ్యతిరేకిస్తారు?

ఏ ప్రధాని చేయని పనిని ఏంతో ధైర్యంగా మన నరేంద్ర మోడిజీ గారు తలపెట్టారు. ఎవరు సపోర్ట్ చేయరు చెప్పండి?నోట్ల రద్దు వలన ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం కరెక్టే...కాని ఎవరూ కూడా తిండి లేనంతగా, కనీస అవసరాలు తీరలేనంతగా ఇబ్బంది పడడం లేదే? కొన్ని రోజులు కాస్త సమస్యను తట్టుకుంటే సర్దుబాటు అయిపోతుంది. ఇప్పటికే బ్యాంకులలోనూ, ATM సెంటర్లలోనూ రద్దీ తగ్గిపోయింది. ఇంకొన్ని రోజులు ఓపిక పెడితే అన్నీ పూర్తిగా సర్డుకుపోతాయి. ఈమాత్రానికి మన ఆవేశం,కోపం పడిపోవడం అవసరమా?

దీనికే ఇలా అనుకుంటే భారత్ రక్షణకోసం పగలనక,రాత్రనక, తిండీతిప్పలు మాని కాపలా కాస్తున్న మన సైనికులకంటే పెద్ద సమస్యా మనది? వాళ్ళు భార్య పిల్లలను వదిలి, తల్లిదండ్రులను వదిలి దేశం కోసం ప్రాణాలు అర్పిస్తుంటే కనీసం మనం దేశ భవిష్యత్ కోసం ఈమాత్రం సమస్య భరించలేమా?

మోడిని వ్యతిరేకిస్తున్న వారందరూ నల్ల కుబేరులే! వాళ్ళ అక్రమార్జనను ఎలా మార్చుకోవాలో తెలియక అమాయక ప్రజలను అయోమయానికి గురి చేసి దేశంలో పెద్ద,పెద్ద అలజడులు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు.

గొప్ప విషయమేమిటంటే ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. మోడీ తల పెట్టిన ఈ యజ్ఞం వలన దేశానికి ఎంత ఉపయోగమో గుర్తించగలిగారు.

ఈ ప్రజలు గనుక మోడిగారికి సంపూర్ణ మద్దతు ఇవ్వగలిగితే మరింత ఉపయోగాలు కలుగుతాయి. అది దేశ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. దీనికి మీరేమంటారు?

2 కామెంట్‌లు:

Popular Posts

Recent Posts