ఒకొక్కరు ఒకో విధంగా చెప్తున్నారు. కొందరు ఖైదీ నెం:150 అంటుంటే మరికొందరు శాతకర్ణి అంటున్నారు. బహుశా వారి అభిమానాన్ని బట్టి చెప్తున్నారు అనుకుంటా! నా అంచనా ప్రకారం శాతకర్ణి, ఖైదీ నెం:150 కంటే బాగుండవచ్చు. ఎందుకంటే చరిత్రకు సంబంధిన సినిమా కాబట్టి ఎక్కువ ఆకర్షించవచ్చు. ఇకపోతే చిరంజీవి చాలా సంవత్సరాల తరువాత సినిమా తీసినప్పటికీ అతను పెట్టిన "ప్రజారాజ్యం" పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేసేసి పెద్దగా జనంలో ప్రచారం లేకుండా పోవడం కూడా కొద్ది దెబ్బ తగలవచ్చు. ఒకప్పుడు చిరంజీవి సినిమా అంటే మామూలు క్రేజ్ కాదు. కాని ఇప్పుడది పెద్దగా కనిపించడం లేదు. వాళ్ళ పట్ల ఉన్న సినీ అభిమానాన్ని ప్రక్కన బెడితే ఆ రెండు సినిమాల్లో ఏది కధాంశం బాగుందో దాన్నే ప్రజలు ఆదరిస్తారన్నది మాత్రం అక్షరసత్యం.
గురువారం, జనవరి 12, 2017
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి