ఈ మధ్యకాలంలో ఎక్కువుగా గోవధ నినాదం వినబడుతోంది. తినకూడదని హిందువులు (ఇక్కడ హిందువులు అనే కంటే రాజకీయ వర్గాలు, లేక కొన్ని మతపరమైన సంస్థలు అంటే బాగుంటుందేమో! ఎందుకంటే హిందువులలో కూడా గోమాంసం తినే వారు ఎక్కువగానే ఉన్నారు.) ఇక మరోపక్క ముస్లింలు వాదులాడుకుంటున్నారు. మొన్నా మధ్య పరిపూర్ణానంద స్వామివారు మాంసాహార నిషేధం శాస్త్రాలలో లేదు అని చెప్పారు. అంటే దైవ దృష్టిలో మాంసాహార నిషేధం లేదన్నమాట. మనిషిని సృష్టించిన దేవునికి తెలియదా? ఏది తినాలో,ఏది తినకూడదో? అందుకే కాబోలు మనుస్మృతిలో పంది నిషేధం ఉంది. అంటే దానిని తినకూడదు. ఆవులు,గుఱ్ఱాల నిషేధం లేదు వేదంలో! ఆనాటి రోజుల్లో యాగాలలోనూ,యజ్ఞాలలోనూ వాటిని బలిచ్చిన దాఖలాలు ఎన్నో వున్నాయి. కాబట్టి దాశరధి రంగాచార్య గారన్నట్టు నేటి గోవధ నిషేధం రాజకీయ నినాదం తప్ప వేద నినాదం కాదని ఆయన తేల్చి చెప్పేశారు.
మనుషులకీ, ఇతర జీవరాసులకీ మధ్య ఒక వ్యత్యాసం ఉంటుంది....Read More
మనుషులకీ, ఇతర జీవరాసులకీ మధ్య ఒక వ్యత్యాసం ఉంటుంది....Read More
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి