శనివారం, ఆగస్టు 12, 2017

that is narendra modi
ప్రజలను మిమ్మల్ని MPలను చేసింది తినేసి ఇళ్ళ దగ్గర పడుకోవడానికి కాదు..పని చేయడానికంటూ ప్రధాన మంత్రి నరేంద్రమోడి తన పార్టీ MPల తీరుపై విరుచుకుపడ్డాడు. వాళ్ళు సరిగా సభలకు రాకపోవడంపై విసుకు చెందిన మోడి పైవిధంగా స్పందించారు. అంతే కాకుండా మీరు పధ్ధతి మార్చుకోకపోతే వచ్చే 2019 ఎలక్షన్స్ లో సీటు ఇవ్వడం కష్టమేనని కూడా తేల్చేస్తూ గట్టి వార్నింగ్ కూడా ఇచ్చాడు.

మోడీ విషయంలో ఇవ్వన్నీ చూస్తుంటే త్వరలో మన ప్రధాని మోడీ గారు భారతదేశానికి ఎదురులేని రాజుగా,నియంతగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అధికార పక్షంతోపాటు ప్రతిపక్షం కూడా మోడీ ఎప్పుడు,ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడో తెలియక అనుక్షణం భయంతో బ్రతుకుతూనే ఉన్నారు.

ఏది,ఏమైనా MPల, MLAల మద్దతు కోసం ప్రాకులాడుతూ పరిపాలక సీట్లలో కూర్చుని కూడా ఏమీ చేయలేక మద్దతు ఎక్కడ ఊడుతుందో, అధికారం ఎక్కడ చేజారిపోతుందోనని భయపడి తన క్రింది సభ్యులకు బానిసలుగా మారిపోయే ముఖ్యమంత్రి,ప్రధానమంత్రుల పదవులకు దీటుగా ప్రధాని మోడి MPలకు లొంగక పోవడం గొప్ప విషయం. ఇదే నిజమైన ప్రధానమంత్రి పీఠానికి ఇచ్చే గొప్ప గౌరవం.

పదవిలో ఎంతకాలం ఉన్నామన్నది ముఖ్యం కాదు.ఎలా పరిపాలించాము? అన్నదే ముఖ్యం. దీనిని బట్టే భరతమాత ముద్దు బిడ్డలుగా మిగిలేది.చూద్దాం మన ప్రధాని నరేంద్రమోడి పరిపాలన సాగినంత కాలం భరతమాత ముద్దు బిడ్డగా ఉంటాడో,లేదో!!

3 కామెంట్‌లు:





  1. చూద్దారీయని గోడమీది వృషదంశున్వోలె నాకాశము
    న్నద్దాల్మేడన దాగురించి నరుడా నాట్యమ్ములేలా! పదా
    యిద్దారీ మన నేతకున్నెరవు,ఆయిందా సహాయమ్ములన్
    చేద్దామోయ్! జనులెల్ల జాగుకొని రాజేయింప జైహిందగున్ !

    రిప్లయితొలగించండి
  2. మీరు మాట్లాడిన వీడియో కాదు ఆయన మాట్లాడిన వీడియో పెట్టండి. MP లను బెదిరించే ధైర్యం ఆయనకుందా ? ఆయనే దేశాలు తిరుగుతూ ఉంటాడు ...తిరిగి వచ్చి పని చేయలేదని MP లను బెదిరించగలడా ?

    రిప్లయితొలగించండి

Popular Posts

Recent Posts