కొంతమందికి అన్నీ సమస్యలుగానే, అడ్డంకులుగానే తోస్తాయి.కానీ తెలివిగలవారు అడ్డంకినే ఒక అవకాశంగా మలుచుకుని దాని సాయంతోనే పైకి ఎగబ్రాకుతాడు.
మీరు మేడ మీదికి చేరాలంటే మెట్లు ఎక్కి పోవాలి. పైకెక్కడానికి ఆ మెట్లు మనకి సహాయపడతాయి. కాని ఆ మెట్లను చూసి అవే అడ్డంకులు అనుకుంటే మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు.
దీన్ని గుర్తుంచుకోండి : "ఒక గాలిపటం గాలికి ఎదురు తిరిగి పైకి ఎగురుతుంది గాని గాలి వాలువ ఎగురదు" మీరు ఏదో ఒక పనిని చేపట్టారనుకోండి.జనం దాన్ని వ్యతిరేకించి మీమీద అన్ని రకాలుగా విమర్సల వర్షం కురిపిస్తున్నారనుకోండి. - సగటు మనిషి అసలు ఆ పని జరగనే జరగదని అనుకుంటాడు. కానీ తెలివిగలవాడు ఆ వీధి కుక్కలా మొరుగుల్లకి బెదిరిపోడు. ఆ మొరుగుల్లనే దీవెనలుగా తీసుకుని ముందుకి పోతాడు.
"సమస్యలు, అడ్డంకులు ఎదురవుతాయనే భయంతో అధములు ఏ పనినీ ప్రారంభించరు. పనిని మొదలు పెట్టి సమస్యలు ఎదురవ్వగానే మధ్యలో ఆపివేసేవారు మధ్యరకం మనుష్యులు. ఉత్తములు మాటిమాటికీ సమస్యలు ఎదురవుతున్నా చేపట్టిన పనిని వదలకుండా పూర్తీ చేస్తారు"
ఎన్నో యుద్ధాలలో విజయం సాధించిన నెపోలియన్ "అందరికన్నా ఎక్కువ పట్టుదల ఉన్నవాడికే విజయం లభిస్తుంది" అని చెప్పాడు.
చూశారా! పట్టుదల అనేది విజయాన్ని సాధించిన మనుష్యుల జీవితాలలో మనం తప్పక గమనించే లక్షణం. మీరు సృజనాత్మకతను పెంపొందించుకుని, ఎలా పని చెయ్యాలో అర్ధం చేసుకుంటే మీ అభివృద్ధిని ఆపగలిగేదేదీ ఉండదు.
Nothing is a problem for development.

0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి