శనివారం, నవంబర్ 25, 2017

Hindu-terrorism-will-all-Hindus-become-terrorists-Is-this-the-right-to-arrest-Kamal-Haasan
నిజానికి నేటి మన భారతదేశంలో పరిస్థితులు కమల్ హాసన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఏం లేవు. ఎక్కడ చూసినా కులాల గొడవ,మతాల గొడవలతోనే నిండిపోతుంది. సమాజాన్ని శాంతివంతంగా తీర్చిదిద్దాల్చిన కొంతమంది స్వామీజీలు సైతం కులమతాలను రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా పశువుల గొడవే.హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో ఎక్కడబడితే అక్కడ సంస్థలు నెలకొలిపి, ప్రతి ముఖ్యమైన పట్టణాలలోనూ, సిటీలలోనూ వాటి బ్రాంచులు స్థాపించి ఇతరమత నిర్మూలనకై దౌర్జన్యాలు చేస్తున్నారు. కొట్లాటలు ప్రారంభిస్తున్నారు. ఇది ఎంతవరకూ సమంజసం? దేశ సంస్కృతిని, జాతులను ధ్వంసం చేస్తున్నా, బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్నా హిందూ పరిరక్షకులు స్పందించడంలో తప్పు లేదు గాని వాటి పేరు చెప్పి హింసాత్మకం సృష్టించడం మాత్రం ఉగ్రవాదం క్రిందికే వస్తుందని నా అభిప్రాయం. చట్టాలు,కోర్టులు ఎందుకున్నట్టు? భారతదేశపు బలమైన పోలీస్ వ్యవస్థ ఎందుకున్నట్టు? దేశ సంస్కృతిని, జాతులను ధ్వంసం చేసేవారిని (వీరు కూడా ఉగ్రవాదులే) వీరి దృష్టికి తీసుకెళ్లి సరిదిద్దాలని ప్రయత్నించాలి తప్ప హింసాత్మకం చేయడం ఏవిధంగా న్యాయమవుతుంది? ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కమల్ హాసన్ "హిందూ ఉగ్రవాదం" అంటూ వ్యాఖ్యానించాడు. కాని కొత్త పార్టీలు పురుడు పోసుకుంటే జీర్ణించుకోలేని పాత (పాతుకుపోయిన)పార్టీలు కమల్ పార్టీని అడ్డుకోవడానికే ఆయనపై కుట్ర పన్నడం హాస్యాస్పదమేమీ కాదు.

ఈరోజు కమలహాసన్ గూర్చి అంతర్జాలంలో వచ్చిన ఒక వార్త యధాతధంగా ఇస్తున్నాను.

మామూలుగానే కొన్ని సంఘటన్ల మీద తనదంటూ ఒక అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పే కమల్ రాజకీయాల్లోకి వస్తున్నానంటూ నిర్ణయం ప్రకటించిన దగ్గరినుంచీ సామాజికాంసాలమీద స్పందించటం ఎక్కువ చేసాడు. నిజానికి కమల్ చేసిన వ్యాఖ్యలను ఎక్కువమందే సమర్థించారుకూడా. ఈ వ్యాఖ్య‌ల‌తో క‌మ‌ల్‌కు ఒక్క త‌మిళ‌నాడులోనే కాకుండా దేశ‌వ్యాప్తంగానూ మంచి మద్దతు లభించింది.

అయితే ఆ వ్యాఖ్యల వల్లే కమల్ ఇప్పుడు చిన్న చిక్కులో ఇరుక్కున్నాడు. . క‌మ‌ల్ చేసిన వ్యాఖ్య‌లకు సంబంధించి కేసులు న‌మోదు చేసి విచార‌ణ చేపట్టాల‌ని ఏకంగా మ‌ద్రాస్ హైకోర్టు చెన్నై పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాజకీయాల్లోకి దిగిపోయానంటూ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన క‌మ‌ల్‌. త‌న పార్టీ పేరును ప్ర‌క‌టించ‌క‌ముందే కేసులో ఇరుక్కున్న‌ట్టైంద‌న్న అభిప్రాయం వినిపిస్తోంది.

అయినా క‌మ‌ల్ చాలా వ్యాఖ్య‌లే చేశారు క‌దా. ఆ వ్యాఖ్య‌ల్లోని ఏ కామెంట్ ఆధారంగా క‌మ‌ల్‌పై కేసు న‌మోదు చేయాల‌ని కోర్టు ఆదేశించిందంటే... ఇటీవ‌ల ఆయ‌న ఓ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. దేశంలో హింందూ ఉగ్ర‌వాదం ఉంద‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న ఆ ఉగ్ర‌వాదం నానాటికీ పెచ్చ‌రిల్లుతోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ఈ వ్యాఖ్య‌ల‌పై వెనువెంట‌నే కొన్ని వ‌ర్గాల నుంచి రియాక్ష‌న్ వినిపించినా... క‌మ‌ల్ దానిని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అంతేకాకుండా తన పోస్టర్ వేలాడదీసి ఇద్దరు పిల్లలు కత్తులతో పొడుస్తున్నట్టుగా వచ్చిన ఒక వీడియోని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట‌ట్ చేసిన క‌మ‌ల్‌... అలాంటి ఏ పాపం ఎరుగ‌ని పిల్లాడి చేతిలో చ‌నిపోవ‌డం త‌న‌కు ఆనంద‌మేనంటూ మరో సంచ‌ల‌నాత్మ‌క కామెంట్ విసిరారు.

హిందూ ఉగ్ర‌వాదం అంటూ క‌మ‌ల్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు ఓ వ్య‌క్తి మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. తన వ్యాఖ్యల ద్వారా హిందువులపై ఉగ్రవాదులు అనే ముద్రను కమల్ వేశారంటూ పిటిషన‌ర్ కోర్టుకు విన్న‌వించాడు. హిందువులకు వ్యతిరేకంగా విషాన్ని వ్యాపింపజేసేందుకు క‌మ‌ల్‌ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

హిందూ ఉగ్ర‌వాదం అంటూ క‌మ‌ల్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు ఓ వ్య‌క్తి మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. తన వ్యాఖ్యల ద్వారా హిందువులపై ఉగ్రవాదులు అనే ముద్రను కమల్ వేశారంటూ పిటిషన‌ర్ కోర్టుకు విన్న‌వించాడు. హిందువులకు వ్యతిరేకంగా విషాన్ని వ్యాపింపజేసేందుకు క‌మ‌ల్‌ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

మానసికంగా బలహీనున్ని చేయాలని మ‌రి ఈ కేసు విచార‌ణ ఏ మ‌లుపులు తిరుగుతుందో చూడాలి. మొత్తానికి కమల్ ని ఇప్పటినుంచే ఇబ్బందులకు గురి చేసి పార్టీ పెట్టకముందే అతన్ని మానసికంగా బలహీనున్ని చేయాలని ప్రభుత్వ ఆలోచన అన్న ఇంకో వాదన కూడా తమిళ నాడు లో వినిఒపిస్తోంది.

2 కామెంట్‌లు:

 


Popular Posts

Recent Posts