బుధవారం, జూన్ 20, 2018

Google-to-train-Indian-journalists-on-how-to-debunk-fake-news-45454654545.jpg

ఫేక్ న్యూస్ లపై గూగుల్ యుద్ధం... | Google War on Fake News ...

ప్రస్తుతం సమచార వెల్లువ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం - పుట్టలు పుట్టలుగా పుట్టుకొస్తున్న వెబ్ సైట్లు - బ్లాగ్ ల వల్ల తప్పుడు వార్తలు బాగా ప్రచారమవుతున్నాయి. ఈ క్రమంలో అలాంటి సమాచారం - వార్తలు జనాలకు ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. దీంతో ఇలాంటి తప్పుడు వార్తలను తెలుసుకునేందుకు - మరింత నాణ్యమైన సమాచారాన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశ్యంతో జర్నలిస్టులకు సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ ఉచితంగా ట్రెయినింగ్ ఇచ్చేందుకు సిద్ధమైంది.

గూగుల్ భారత్ లో ఉన్న జర్నలిస్టులకు ఉచితంగా ట్రెయినింగ్ ఇవ్వాలని సంకల్పించడం వెనుక పలు కారణాలు ఉన్నాయి. నిజ నిర్ధారణ - ఆన్ లైన్ లో పరిశీలన - జర్నలిస్టులకు డిజిటల్ విజ్ఞానం వంటి అంశాలు జర్నలిస్టులకు సవాల్గా మారాయి. ఈ నేపథ్యంలో ఫస్ట్ డ్రాఫ్ట్ - స్టోరీఫుల్ - ఆల్ట్ న్యూస్ - బూమ్ లైవ్ - ఫ్యాక్ట్ చెకర్ - డేటా లీడ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన నిపుణులు రూపొందించిన అంశాలను శిక్షణ కార్యక్రమం రూపంలో బోధించనున్నారు. 'గూగుల్ న్యూస్ ఇనిషియేటివ్' పేరిట దేశంలో ఉన్న జర్నలిస్టులకు గూగుల్ ప్రత్యేక వర్క్షాపుల్లో ట్రెయినింగ్ ఇవ్వనుంది. మరో ఏడాదిలోగా మొత్తం 8వేల మందికి ఈ ట్రెయినింగ్ ఇవ్వనున్నారు. ఇంగ్లిష్ - హిందీ - కన్నడ - తమిళం - తెలుగు - మరాఠీ - బెంగాలీ భాషలకు చెందిన జర్నలిస్టులకు ట్రెయినింగ్ ఇస్తారు. ఈ భాషలకు చెందిన ఔత్సాహికులైన జర్నలిస్టులు https://goo.gl/Ttur3b అనే వెబ్ సైట్ ను సందర్శించి అందులో ఉండే దరఖాస్తు ఫాంలో వివరాలను నింపి ట్రెయినింగ్ పొందేందుకు ఫాంను సబ్మిట్ చేయవచ్చు. ఇందుకు గాను ఇంగ్లిష్ కు జూలై 5వ తేదీ వకు - హిందీ - కన్నడ - తమిళ్ జర్నలిస్టులకు జూలై 15వ తేదీ వరకు గడువిచ్చారు. అలాగే తెలుగు - మరాఠీ - బెంగాలీ భాషలకు చెందిన జర్నలిస్టులకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు గడువు విధించారు. ఆ గడువులోగా ట్రెయినింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అందులో అర్హత ఉన్నవారిని ఎంపిక చేసి ఉచితంగా ట్రెయినింగ్ ఇస్తారు.

ట్రెయినింగ్ లో భాగంగా జర్నలిస్టులకు ఉచిత రవాణా - భోజన సదుపాయాలతోపాటు స్టయిఫండ్ కూడా ఇస్తారు. ఇక ట్రెయినింగ్ సమయంలో జర్నలిస్టులకు పలు రకాల నూతన తరహా సాఫ్ట్వేర్ల గురించి అవగాహన కల్పిస్తారు. వాటి సహాయంతో వార్తలను ఎలా సేకరించాలి - నకిలీ వార్తలు - సమాచారాన్ని ఎలా గుర్తించాలి అనే విషయాలపై జర్నలిస్టులకు అవగాహన కల్పిస్తారు. అలాగే ట్రెయినింగ్ మొదటి దశలో మొత్తం 200 మంది జర్నలిస్టులకు శిక్షణనిస్తారు. శిక్షణ తరగతులు జరగనున్న తేదీలు - ప్రదేశాల వివరాలు ఇలా ఉన్నాయి.

* తెలుగు - నవంబర్ 19 నుంచి 22 వరకు - హైదరాబాద్ - దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 15

* ఇంగ్లిష్ - జూలై 20 నుంచి ఆగస్టు 3 వరకు - గురుగ్రామ్ - దరఖాస్తుకు చివరి తేదీ జూలై 5

* హిందీ - ఆగస్టు 20 నుంచి 24 వరకు - గురుగ్రామ్ - దరఖాస్తుకు చివరి తేదీ జూలై 15

* కన్నడ - ఆగస్టు 27 నుంచి 31 వరకు - బెంగళూరు - దరఖాస్తుకు చివరి తేదీ జూలై 15

* తమిళం - సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు - చెన్నై - దరఖాస్తుకు చివరి తేదీ జూలై 15

* బెంగాలీ - జనవరి 15 నుంచి 19వ తేదీ వరకు - కోల్ కతా - దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 15

* మరాఠీ - డిసెంబర్ 3 నుంచి 7 వరకు - ముంబై - దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 15

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Popular Posts

Recent Posts