మంగళవారం, జులై 24, 2018

Bill-To-Provide-Strict-Punishment-In-Rape-Cases--Introduced-In-Lok-Sabha-kscwrites

రేపిస్టు వెధవలకు ఉరిశిక్ష - అమలుకు నోచుకునేదెంత?

భారత దేశంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇటీవల కాలంలో అత్యాచారాలు అంతకంతకూ విపరీతంగా పెరిగి పోతున్నాయి. చిన్నా.. పెద్దా.. ముసలి.. ముతకా.. తర తమ భేదం లేకుండా సాగుతున్న రేప్ ల నేపథ్యంలో దేశం పరువు ప్రతిష్ఠలు ప్రశ్నార్థకంగా దిగజారి పోతున్నాయి. ఆ మధ్య వరకూ ఉన్న కొద్దిపాటి గౌరవం కూడా మంట కలిసి పోతోంది. దేశంలో ఇటీవల కాలంలో పెరిగిపోతున్న అత్యాచార ఉదంతాల నేపథ్యంలో మోడీ సర్కారు ఈ మధ్యన ఒక ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది.

పన్నెండేళ్ల బాలికల్ని రేప్ చేస్తే ఉరి విధించేందుకు వీలుగా ఆర్డినెన్స్ తెచ్చారు. తాజాగా ఇదే అంశాలతో బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టారు. కతువా.. ఉన్నావ్ ఘటనల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును ప్రవేశ పెట్టారు.

 

ప్రవేశ పెట్టబడిన బిల్లు ప్రకారం..

  1. పన్నెండేళ్ల లోపు చిన్నారులపై అత్యాచారాలు జరిపిన వారికి మరణశిక్ష... 
  2. 16 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన వారికి 20 ఏళ్ల జైలుశిక్ష... 
  3. మహిళలను రేప్ చేస్తే ఏడేళ్ల నుంచి గరిష్ఠంగా జీవితఖైదు...


అంతేకాదు.. అత్యాచార నేరస్తులు చనిపోయే వరకూ జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. వీటన్నింటికి మించి రేప్ కేసుల్ని రెండునెలల్లో తేల్చేయాల్సి ఉంటుంది. ఒకవేళ.. కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలు కోరితే.. దాన్ని తేల్చేందుకు ఆర్నెల్ల గడువు ఇవ్వాలన్న అంశాలతో బిల్లును తయారు చేశారు.

అయితే ఇది ఎంతవరకూ అమలులోకి వస్తుందో చూడాలి. నిర్భయ చట్టం క్రింద ఎన్ని కఠిన సెక్షన్లు పెట్టినా ఇచుమంత కూడా బయపడని ఈ మానవ మృగాలు ఉరిశిక్షకు లొంగుతారా? అయినా ఏస్థాయిలో అత్యాచారానికి పాలపడినా ఉరి శిక్షే కరెక్ట్ . మిగతా రెండు సెక్షన్లు పనికిరానివే. కొంతమందిని జైల్లో పెట్టి మేపడం వృధా ప్రయాస. దీనిని బలవంతులు ఉపయోగించుకుని జైల్ శిక్ష నుండి తప్పించుకోవడానికి మార్గం ఏర్పచు కోవడానికి సహకరిస్తుంది. కాదంటారా?

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Popular Posts

Recent Posts