గురువారం, అక్టోబర్ 25, 2018

*👴తాత గారి గడియారం*

*తాతగారి గడియారం స్టోర్ రూమ్ లో ఎక్కడో పడిపోయింది.ఎంత వెతికినా దొరకలేదు. మనవళ్లందరినీ పిలిచి, ఎవరు గడియారం వెతికిపెడితే వాళ్లకు పది రూపాయలు అని ప్రకటించాడు.*

*పిల్లలందరూ గోలగోలగా రోజు రోజంతా వెతికారు.  గడియారం దొరకలేదు.*

*అంతా వెళ్లిపోయిన తరువాత ఒక మనవడు తిరిగి వచ్చాడు."నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వు తాతా... నేను వెతుకుతాను." అన్నాడు. గదిలోకి వెళ్లాడు. తలుపులు మూసుకున్నాడు.*

*ఒక పది నిమిషాల తరువాత "ఇదిగో తాతా గడియారం" అంటూ బయటకు వచ్చాడు.*

*"ఎలా దొరికిందిరా?" అని అడిగాడు తాత."తాతా ఇందాక అందరూ మాట్లాడుకుంటూ, కేకలు వేసుకుంటూ వెతికాం. గడియారం దొరకలేదు. ఈ సారి గదితలుపు వేసి నిశ్శబ్దంగా కాస్సేపు నిలుచున్నాను. "టిక్ టిక్" మంటూ గడియారం శబ్దం వినిపించింది. కాస్త చెవులు రిక్కించి, ఇంకాస్త మౌనంగా ఉండిపోయాను. ఆ శబ్దం ఎటు వైపు నుంచి వస్తుందో అర్థమైంది. ఆ వైపు వెళ్లి వెతికాను. ఇదిగో దొరికింది."*

*🕸నిజమే...ఎంత సమస్యైనా హడావిడి పడితే పరిష్కరించలేం...*

*🐿ప్రశాంతంగా ఆలోచిస్తే,నిశ్శబ్దంగా ఉంటే బతుకు గడియారం శబ్దం దానికదే వినిపించి తీరుతుంది...సమాధానం కనిపించి తీరుతుంది...*

*🐺అంతేగాని ఒత్తిడికి గురైతే , తికమక పడితే , నానా యాగీ చేస్తే , పరేషాన్ అయితే , దుఖిస్తే ఫలితం వ్యతిరేఖంగా ఉంటుంది.*

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Popular Posts

Recent Posts