ఆంధ్రా పోలీస్ శాఖలో 3,137 ఉద్యోగాలు రెడీ! | 3,137 jobs in AP Police department
రాష్ట్ర హోంశాఖ పరిధిలోని సివిల్, ఏఆర్, ఏపీఎస్పీతో పాటు జైళ్లు, అగ్నిమాపక శాఖల్లోని మొత్తం 3,137 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రా పోలీస్ శాఖలకు అనుమతి జారీ చేసింది.
నవంబర్ 1వ తేదీన 334 ఎస్సై, ఆర్‌ఎస్సై, డిప్యూటీ జైలర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు ఏపీ పోలీసు నియామక మండలి గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది.
నవంబర్ 12న వివిధ విభాగాల్లోని కానిస్టేబుల్, ఫైర్‌మెన్, జైలువార్డర్లు, డ్రైవర్ ఆపరేటర్లు తదితర 2,803 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది.
దరఖాస్తు చేసుకున్న వారందరికీ తొలుత ప్రాథమిక రాత పరీక్ష ఉంటుంది. ప్రాథమిక రాత పరీక్షలో రెండు ప్రశ్నపత్రాలను రాయాల్సి ఉంటుంది. ఎస్సై, ఆర్‌ఎస్సై, డిప్యూటీ జైలర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు పోటీ పడే అభ్యర్థులు వ్రాయాలి. ఒక్కో ప్రశ్నపత్రం వంద మార్కుల చొప్పున మొత్తం 200 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండు పత్రాలు ఐచ్ఛికం(ఆబ్జెక్టివ్) తరహాలోనే ఉంటాయి.
* మొదటి ప్రశ్నపత్రంలో అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ.. రెండో ప్రశ్నపత్రంలో జనరల్ స్టడీస్‌పై ప్రశ్నలుంటాయి.
* ఒక్కో పేపర్‌కు మూడు గంటల సమయమిస్తారు. ఒకే రోజు ఉదయం, మధ్యాహ్నం ఈ రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది.
* ఈ రెండు ప్రశ్నపత్రాల్లోనూ వేర్వేరుగా ఓసీ అభ్యర్థులు 40 శాతం, బీసీలు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, విశ్రాంత సైనికోద్యోగులు 30 శాతం మార్కులు పొందితే తదుపరి దశకు అర్హులవుతారు. ఒక ప్రశ్నపత్రంలో ఎక్కువ మార్కులు పొంది మరో దాంట్లో అర్హత మార్కులు సాధించకపోతే తదుపరి దశకు అనర్హులే.
* ప్రాథమిక రాత పరీక్షలో ఎంపికైన వారికి మాత్రమే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు.
* ప్రాథమిక రాత పరీక్ష అర్హత పరీక్ష మాత్రమే. ఈ మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు.
* ఎంపిక ప్రక్రియను 2019 మార్చి మాసాంతానికల్లా పూర్తి చేయాలని ఏపీ పోలీసు నియామక మండలి లక్ష్యంగా పెట్టుకుంది.
* భర్తీ చేయనున్న మొత్తం పోస్టులు: 3,137
* గురువారం(నవంబర్ 1) విడుదలైన నోటిఫికేషన్ లోని 334 పోస్టుల వివరాలు...
* సివిల్ ఎస్సై (మహిళలు, పురుషులు): 150
* ఏఆర్ ఆర్‌ఎస్సై (మహిళలు, పురుషులు): 75
* ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై (పురుషులు): 75
* డిప్యూటీ జైలర్ (పురుషులు): 10
* డిప్యూటీ జైలర్ (మహిళలు): 4
* స్టేషన్ ఫైర్ ఆఫీసర్ (పురుషులు): 20
Important things to note
* దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యే తేదీ: నవంబర్ ఐదో తేదీ మధ్యాహ్నం మూడింటి నుంచి
* దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు: 24వ తేదీ సాయంత్రం ఐదింటి వరకు
* హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడ్ తేదీలు: డిసెంబరు 8 నుంచి 14వ తేదీ వరకు
* ప్రాథమిక పరీక్ష తేదీ: 16.12.2018 (ఆదివారం)
* దరఖాస్తు రుసుము: ఓసీ, బీసీలకు: రూ.600, ఎస్సీ, ఎస్టీలకు: రూ.300
Age limit and qualifications
* సివిల్ ఎస్సై, ఏఆర్ ఆర్‌ఎస్సై, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై: 01.07.2018 నాటికి 21-25 ఏళ్ల మధ్య ఉండాలి (02.07.1993- 1.07.1997 మధ్య పుట్టినవారై ఉండాలి). డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు (01.07.2018 నాటికి పూర్తి చేయాలి)
* ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై తప్పనిసరిగా డిగ్రీ చదివి ఉండాలి.
* స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ (పురుషులు): 1.07.2018 నాటికి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి (02.07.1988 నుంచి 01.07.2000 మధ్య పుట్టినవారై ఉండాలి.). వీరికీ డిగ్రీ కావాలి.
* డిప్యూటీ జైలర్(పురుషులు): 01.07.2018 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. (2.07.1988- 01.07.1997 మధ్య పుట్టినవారై ఉండాలి). డిగ్రీ ఉత్తీర్ణులే అర్హులు.
* డిప్యూటీ జైలర్ (మహిళలు): 01.07.2018 నాటికి 21-25 ఏళ్ల మధ్య ఉండాలి. (2.07.1993 - 01.07.1997 మధ్య పుట్టినవారై ఉండాలి). డిగ్రీ ఉత్తీర్ణత కావాలి.
* ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే పై ఉద్యోగాలకు నిర్దేశించిన వయోపరిమితికంటే అయిదేళ్ల వయసు సడలింపు ఉంటుంది.
Website to consult: slprb.ap.gov.in
The number of posts for the post was issued on Thursday (November 1): 2,803
* సివిల్ పోలీసు కానిస్టేబుల్: 1,600
* ఏఆర్ కానిస్టేబుల్: 300
* ఏపీఎస్పీ కానిస్టేబుల్: 300
* ఫైర్‌మెన్: 400
* జైలువార్డర్లు (పురుషులు): 100
* జైలువార్డర్లు (మహిళలు): 23
* డ్రైవర్ ఆపరేటర్లు: 30
* అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు: 50
* నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యే సమయం: నవంబర్ 12వ తేదీ నుంచి
* దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు: డిసెంబరు 7వ తేదీ సాయంత్రం ఐదింటివరకూ
* హాల్‌టిక్కెట్ డౌన్‌లోడ్ తేదీలు: 24.12.2018 నుంచి 04.01.2019 వరకూ
* ప్రాథమిక పరీక్ష తేదీ: 06.01.2019 ఉదయం పదింటి నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ(ఒకే పేపర్)
* దరఖాస్తు రుసుము: ఓసీ, బీసీలకు: రూ.300, ఎస్సీ ఎస్టీలకు: రూ.150.
* ఈ పోస్టుల విద్యార్హతలు, వయోపరిమితి, సిలబస్ తదితర వివరాలన్నీ నవంబర్ 12న విడుదల చేయనున్న నోటిఫికేషన్‌లో ఇస్తారు.
Website to consult: slprb.ap.gov.in
ap police recruitment 2018-19, ap police si notification 2018, ap police upcoming notification 2018, appolice.gov.in 2018, ap police jobs 2018, ap police notification 2018, appolice.gov.in recruitment 2018, recruitment ap police gov
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి