ఆదివారం, జనవరి 27, 2019

How-many-Assembly-seats-will-the-Telugu-Desam-Party-win-in-the-2019-elections
చంద్రబాబు గారి నాయకత్వంలో నడుస్తున్న తెలుగుదేశం పార్టీ ఈసారి 2019 లో జరిగే శాసనసభ ఎన్నికలలో భారీ మెజారిటీని సొంతం చేసుకునే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. TDPకి పోటాపోటీగా వస్తుందనుకున్న YSRCP పార్టీ ఒక్కసారిగా క్రింది స్థాయికి పడిపోయింది. ఆంధ్రా ప్రజలను బూతులు తిడుతూ, పచ్చిగా మాట్లాడే కెసియార్ తో జగన్ మద్దతు తీసుకోవడం చాలా తీవ్రకరమైన విషయం. జగన్ గారి ఈ వ్యవహారం ఆంధ్రాప్రజల మనస్సుల్లో వ్యతిరేక భావన కలిగించిందనే చెప్పాలి. దానికి తోడుగా ప్రతిపక్ష నాయకుడు అయ్యుండి ప్రజా సమస్యల పట్ల పోరాడకుండా "అసెంబ్లీ"ని వదిలి పెట్టి ప్రజా సంకల్పయాత్ర పేరుతొ ఊర్లంట పాదయాత్ర చేస్తూ తిరగడం నచ్చలేదు. అలాగే కేంద్రంపై తలపెట్టిన అవిశ్వాస తీర్మానం రాక ముందే తన MPల చేత రాజీనామా చేయించడం కూడా పెద్ద తప్పిదమే. అటు మోడీకి నష్టం కలగకుండా చూసుకుంటూ ఇటు మాత్రం ప్రత్యేక హోదా కోసం మా MPలు రాజీనామా చేసారనే భ్రమను జగన్ ఆంధ్రా ప్రజలకు కలిగించలేక బొక్కబోర్లా పడిపోయాడు. ఎన్నుకున్న నాయకులు రాజీనామాలు చేసుకు కూర్చుంటే ఇక ఏం సాధించగలరు? ఇక మరొక ముఖ్య విషయమేమిటంటే "పార్లమెంట్"లో అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా కేసీయార్ తన MPల చేత ఎంతగా కుట్రలు చేసాడో మనమింకా మర్చిపోకుండానే కేసీయార్ మద్దతు జగన్ తీసుకోవడం, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ జగన్ తరుపున ప్రచారం చేస్తానంటే YSRCP శ్రేణులు తలూపడం...ఇవన్నీ జగన్ కు నష్టాన్ని చేకూర్చేవే. నిజానికి కేసీయార్ మద్దతు జగన్ కు ఏవిధంగా పనికొస్తుందో నాకిప్పటికీ అర్ధం కావడం లేదు. కెసియార్ నక్కజిత్తుల కుట్రదారుడు. తెలంగాణలో జగన్ గారికి అభిమానులు మెండుగానే ఉన్నారు. వాళ్లందరూ కూడా కేసీయార్, జగన్ తో కలవడం వలన కేసీయార్ కు అనుకూలంగా మారిపోతారు. దీని లాభకోసమే కేసీయార్ జగన్ కు మద్దతు పలికాడు. దీని వలన కేసియార్కు తప్ప జగన్ కు ఏవిధమైన లాభం లేదు. అలాగని కేసియార్ అభిమానులెవరూ ఇక్కడ ఆంధ్రాలో లేనేలేరు జగన్ కు ఓట్లు వేయడానికి. నక్కజిత్తుల కేసీయార్ చేసే కుట్రలకు జగన్ బుక్కయ్యాడంతే. ఇకపోతే చంద్రబాబు తన అభివృద్ధి పనులలో శరవేగంగా ముందుకు పోతున్నాడు. లేటుగా ప్రారంభించినా అతి వేగంగా అన్ని చోట్లా పనులు జరుగుతుండటంతో చంద్రబాబుగారికి ఉపయోగంగానే మారుతుంది. సంక్షేమ పధకాలు కూడా చక్కగానే అమలవుతున్నాయి. ఇవ్వన్నీ చూస్తున్న ఆంధ్రాప్రజలు మళ్ళీ చంద్రబాబుగారి వైపే తిరుగుతున్నారు. ఇదిలానే ఉంటే వచ్చే ఎలక్షన్లలో 175 అసెంబ్లీ స్థానాలకి TDPకి 100సీట్లు పైగా రావడం గ్యారెంటీ. YSRCP 50నుండి 55సీట్ల మధ్యలో గెలుసుకుంటుంది. 10నుండి 15సీట్లు మాత్రమే జనసేన సొంతమవుతాయి. మిగిలిపోయిన అడపాదడపా సీట్లతో వామపక్షాలు అలరిస్తాయి. ఇదంతా నేను నా పరిశీలనతోనూ నాకు అందుబాటులో ఉన్న సమాచారంతోనూ ఏర్పరుచుకున్న అభిప్రాయం మాత్రమే. నాకైతే మాత్రం నిజమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. ఒకవేళ జనసేన పొత్తు చంద్రబాబుకి లేకపోయి 80సీట్లు లోపు మాత్రమే TDP గెలుసుకుంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం అసాధ్యం.

11 కామెంట్‌లు:

  1. . . . అలాగని కేసియార్ అభిమానులెవరూ ఇక్కడ ఆంధ్రాలో లేనేలేరు జగన్ కు ఓట్లు వేయడానికి. . . .
    సాధారణంగా మీరన్నది నిజమే కావచ్చును. కాని కేసీఆర్ అభిమానసంఘాలంటూ కొందరు అప్పుడప్పుడూ హడావుడి చేయటం - ముఖ్యంగా కేసీఆర్ గారు వచ్చినప్పుడు కోలాహలం లావు చేయటం దేనికి సంకేతం అంటారూ? ఐతే గియితే కేసీఆర్ అభిమానులు నిజంగానే ఉండి ఉండాలి లేదా ఏ జగన్ పార్టీవాళ్ళో (నిజం చెప్పాలంటే చంద్రబాబుకు వ్యతిరేకంగా సవాలక్షపార్టీలున్నాయి కదా అందులో ఎవళ్ళైనా) ఇలా కేసీఆర్ అభిమానుల ముసుగులో హడవుడి చేస్తూ ఉండాలి.

    . . . . ఒకవేళ జనసేన పొత్తు చంద్రబాబుకి లేకపోయి 80సీట్లు లోపు మాత్రమే TDP గెలుసుకుంటే . . .
    మరి ఈ జనసేన అనే పవన్ సేన ఎందుకుందంటారూ? ఏపార్టీకైనా అధికారమే కదా లక్ష్యం? అధికారం రాకపోయినా అధికారపార్టీతో కలిసో బెదిరించో ఐనా బలం ప్రదర్శించగల సత్తా చూపటం ముఖ్యం. ఇదంతా ఎందుకూ అంటే అభివృధ్ధిపథంలో ఒక రాష్ట్రం నడుస్తున్నదంటే అది డబ్బుతో వ్యవహారం - తమవాటా తమకు రావాలన్న ఆశతోనే కదా అంధ్రాలో బోలెడు పార్టీలు పుట్టుకు రావటం? లేకుంటే అందరూ ప్రజాసేవకోసమే వస్తున్నారని నమ్మేంత వెర్రివాళ్ళా జనం?

    ... తెలంగాణలో జగన్ గారికి అభిమానులు మెండుగానే ఉన్నారు. వాళ్లందరూ కూడా కేసీయార్, జగన్ తో కలవడం వలన కేసీయార్ కు అనుకూలంగా మారిపోతారు. దీని లాభకోసమే కేసీయార్ జగన్ కు మద్దతు పలికాడు....
    ఆంధ్రద్వేషం నరనరాననిండి ఉన్న కేసీఆర్ గారికి కావలసినది ఆంద్ర్హాలో అభివృధ్ధి జరగకపోవటం, జరిగిన కాస్తైనా బోర్లాపడటం. అందుకు గాను ఆయన ఎవరినైనా సపోర్టు చేస్తారు, చంద్రబాబును ద్వేషించటం అనే విషయంలో కలిసివస్తే చాలు. ఆయనతో దోస్తీచేసిన వారికీ ఆంద్రా అభివృధ్ధి కాంక్ష ఉందనిపిస్తే వారిని కూడా కెసీఆర్ దించటానికే ఎత్తులువేస్తారు. ఈవిషయం అర్థమైతే మంచిది అందరికీ.

    రిప్లయితొలగించండి
  2. గత ఎన్నికలలో టీడీపీ వైకాపాల నడుమ ఓట్ల తేడా అరశాతం మాత్రమే. అందుకు ప్రధాన కారణాలు:

    1. దేశమంతా వీస్తున్న మోడీ హవా
    2. పవన్ కళ్యాణ్ మద్దతు + కాపు రిజర్వేషన్ ఇష్యూ
    3. రైతు & డ్వాక్రా రుణ మాఫీ హామీలు
    4. జాబు రావాలంటే బాబు రావాలి (ఇంటికో ఉద్యోగం) నినాదం

    ప్రస్తుత పరిస్థితికి వస్తే ఈ అంశాలు ఏవీ బాబుకు అనుకూలంగా లేవు. క్షేత్ర స్థాయి విషయాలు (ఉ. ఉద్దానం సమస్య, చింతమనేని/జేసీ సోదరుల ఆగడాలు, రమణ దీక్షితులు వివాదం, ఎన్టీఆర్ బయోపిక్కు అట్టర్ ఫ్లాప్, ఆర్టీసీ సమ్మె) కూడా టీడీపీకి ఆశాజనకంగా లేవు.

    జగన్ అసెంబ్లీలో పోరాటం చేయడం లేదేమో కానీ ఆయన ప్రజాక్షేత్రంలోనే ఉన్నాడు. నవరత్నాల పేరిట తాము చేయబోయే పనులను ఊరూరా తిరుగుతూ ప్రచారంలో ముందున్నాడు. దళితులు, మైనారిటీలు, రైతు కూలీలు & ఇతర అట్టడుగు వర్గాలలో పట్టు ఏమాత్రం చెక్కుచెదరకుండానే ఉండడం కూడా ప్లస్ పాయింటు.

    రిపబ్లిక్ & ఇండియా టుడే సర్వేలు రెంటిలో వైకాపాకు స్పష్టమయిన 10% ఆధిక్యత కనిపిస్తుంది. ఇంత భారీ అనుకూలతను తిప్పికొట్టాలంటే మాటలు కాదు. నిన్నటి జయహో బీసీ గర్జన తరహాలో ఇంకా ఎన్నో రెట్లు కృషి చేయాలి.

    ఎగువ మధ్య తరగతి అగ్ర వర్ణ పట్టణ ప్రాంత ఓటర్లు (ముఖ్యంగా "అసమదీయ" మీడియా సమర్థకులు) మాత్రమే ఓటేస్తారని భావించడం సరికాదు. ఇటువంటి "మేధావులు" జనాభాలో అత్యల్ప శాతమని గుర్తుంచుకొని మెసగడం శ్రేయస్కరం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జై గారు,
      మోదీహవా లేకుంటే క్రిందటి ఎన్నికలలో చంద్రబాబుగారికి ఓట్లుపడేవి కావన్న మాట! అసలు బీజేపీవారికి ఆంధ్రాలో ఎప్పుడన్న చెప్ప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లుపడ్డాయా చెప్పండి!! పోనివ్వండి, మీరుకలలు కంటున్నట్లుగా జగన్మోహనుడే గెలిచి ఆంధ్రా అడుక్కుతినే పరిస్థితికి వచ్చి మీకు మనశ్శాంతి దొరుకుతుందేమో కొన్నాళ్ళగిన తరువాత చూదాం.

      తొలగించండి
    2. @శ్యామలీయం:

      నా వ్యాఖ్య మళ్ళీ చదవండి:

      "టీడీపీ వైకాపాల నడుమ ఓట్ల తేడా అరశాతం మాత్రమే. అందుకు ప్రధాన కారణాలు"

      జగన్ ద్వేషం, చంద్రబాబు భక్తి లేదా ఇంకేదో కారణాల మూలాన "అరశాతం" అన్న చిన్న ముక్క కనిపించలేదేమో. మోడీ హవా & ఇతర అంశాలు *అరశాతం* కూడా తేడా చేయలేదని అరివీర భయంకర పచ్చపార్టీ అభిమానులు సైతం అనగలరా? 1998 వాజపేయి వేవులో ఆంధ్రాలో బీజేపీకి ఓట్లు పడ్డాయన్న విషయం మీరు మరిచిపోయారేమో కానీ అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్న మీ అభిమాన నాయకుడికి గుర్తుండే ఉంటుంది.

      తొలగించండి
    3. Please read as "1998 వాజపేయి వేవులో ఆంధ్రాలో బీజేపీకి *13.3%* ఓట్లు పడ్డాయన్న విషయం మీరు మరిచిపోయారేమో కానీ అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్న మీ అభిమాన నాయకుడికి గుర్తుండే ఉంటుంది"

      తొలగించండి
  3. కామెడీ ప్రియులు అందరూ తప్పక చదవాల్సిన "వార్త":

    http://www.andhrajyothy.com/artical?SID=702406

    ఇటువంటి అబద్దాలు & అభూత కల్పనలు నమ్మడానికి జనం సిద్ధంగా ఉన్నారా? ఇంత బరితెగింపు గోబెల్స్ ప్రచారం వేమూరి సొంత ఆలోచనా లేక నారా వారి "మేధోతనమా"?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జైగారూ! మీరు తెలంగాణ వారై కూడా ఇక్కడి ప్రజల నాయకుడు చంద్రబాబును ద్వేషిస్తారు. ఇంతకీ మీకెందుకంత కక్ష? కేసియార్లా మీరు కూడా ఆంధ్రా అభివృద్ధి అంటే జీర్ణించుకోలేక పోతున్నారా?

      తొలగించండి
    2. చౌదరి గారూ, ఇంత కామెడీలో సైతం మీకు తెలంగాణా కనిపించిందా :)

      తొలగించండి
    3. జై గారూ,

      ఏదో ఒక పార్టీని గుడ్డిగా సపోర్ట్ చేసే సాక్షి, ABN,తెలంగాణా న్యూస్ చానెల్స్ చూడకండి. షేర్ చేయకండి. మీరు చెప్పారు కదా అని చూసాను. అదంతా వండి వార్చిన కధనం....ఆ కోటీశ్వరుడి మాటలు రికార్డ్ చేయకుండా ఉంటారా ? యాంకర్ చెప్పడం ఏమిటి ? ఆయన మాట్లాడిందే చూపించవచ్చు కదా ?


      తొలగించండి
    4. @నీహారిక:

      వ్వాట్ ఐ ఆం టెల్లింగ్ ఈస్:

      హనుమంతన్న, సెవెనో క్లాక్ గణేష్, గరుడ శివాజీ, ట్రంపు తమ్ముడు కేఏ పాలుడు, లగడపాటి జరాపాగల్, బుల్బుల్ సారే జెహా సి అచ్చా విగ్గు బాబు, వేమురికి సీబీఎన్: వీరిని సీరియస్సుగా కాక ఉచిత హాస్యంగా చూసే పరిస్థితికి వచ్చాము. కడాన బిత్తిరి సత్తి కంటే ఎక్కువ నవ్వులు పండించే ఈ కామెడీలతో తరిస్తూ ఆ రకంగా ముందుకు పోవాలి. ఎన్టీఆర్ & రాజ్ నారాయణ్ వగైరాలు లేని లోటు వీరి వల్ల కాస్తయినా తీరిందని మీకు తెలియజేసుకుంటున్నాను.

      ఏమి తమ్ముళ్లూ నేను చెప్పేది కరెక్టా కాదా?

      తొలగించండి
  4. నాకు తెలిినంతవరకూ దేశంలో మోడీ పని,రాష్ట్రంలో బీజేపీ పని అవుట్. ఈ ఘనత చంద్రబాబుదే.

    రిప్లయితొలగించండి

Popular Posts

Recent Posts