గురువారం, జనవరి 31, 2019

want-to-have-newest-success-in-new-year
Want to have the newest success in the new year
సైకాలజీ టుడే -జనవరి :2019 సంచిక... పై టైటిల్తో ఒక ఉపయోగకరమైన ఆర్టికల్ వచ్చింది. ఇందులో మనం ఎక్కువుగా కలిగియుండే "వాయిదా వేసే రుగ్మత" గూర్చి చర్చించడం, దానిని వలన వచ్చే భారీ నష్టాలూ, ఎలా వదిలించుకోవాలో తెలియజేసే సూచనలు అందించడం జరిగింది.
ఉదా:-కు ఈ వ్యాసంలోని కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఇస్తున్నాను.

  • పనులను వాయిదాలు వేయడం అంటే మీ విజయాన్ని మీరే వాయిదా వేసుకున్నట్టు.
  • వాయిదాలు వేయడం ఒక మానసిక రుగ్మత.
  • కొత్త సంవత్సరంలో ఈ రుగ్మతను వదిలించుకోవడానికి గట్టిగా తీర్మానించుకోండి.
  • మనిషి ప్రవర్తన ముఖ్యంగా Pain లేదా Pleasure అనే సూత్రంపై ఆధారపడియుంటుంది. మనం చెయ్యవలసిన అతి ముఖ్యమైన పనిపై అనాసక్తి, కష్టం వుంటే... ఆ పనిని కొంత కాలం తరువాత చాలా శ్రద్దగా చేద్దాం అనే భ్రమలో తాత్కాలికంగా సంతోషం, తృప్తినిచ్చే అనవసరమైన పనుల మీద దృష్టి పెడతారు.
  • ఈ అలవాటు బాల్యంలోనే మొదలవుతుంది. Pleasure Principle ఆధిక్యత చూపిస్తుంది. విద్యార్ధి దశలో టివి, ఆటలు, స్నేహితులు, కాలక్షేపంతో Pleasure పొందుతూ చదువును వాయిదా వేస్తారు. Pleasure కు అలవాటు పడిన విద్యార్ధికి చదువు Painలా అనిపిస్తుంది. చదువును ఆస్వాదించలేక ఒత్తిడి (Pleasure) లేనప్పుడు వాయిదా వేస్తాడు.
  • వాయిదాలు వేసే అలవాటున్న వారిని మానసికంగా ఒక భయం వెంటాడుతుంది. తప్పు జరుగుతుందేమోనన్న భయం, అపజయం పొందుతానేమోననే భయం (Fear of failure) మనసులో మెదులుతూ (ఆలోచిస్తూ) వుంటుంది.

ఇటువంటి అనేక విషయాలు ఈ వ్యాసంలో అందించడం జరిగింది.

నిజానికి వాయిదాలు వేసేవారు ప్రపంచంలో 20శాతం మంది ఉంటారని బిహేవియరల్ సైంటిస్టుల అంచనా, అన్ని అర్హతలు, జ్ఞానసంపద, నైపుణ్యతలు, డిగ్రీలు ఉన్నా... ఈ వాయిదాల రోగం వల్ల జీవితంలో చాలా కోల్పోతారు. ఈ రుగ్మత గురించి వారికి తెలిసినప్పటికీ బయటపడే సమయానికి చాలా అవకాశాలు పోగొట్టుకుంటారు. ఈ వాయిదాలు వేసే రుగ్మత పుట్టుకతో వచ్చింది కాదు. ఇది ఒక దురలవాటు. పుట్టిన తరువాత నేర్చుకున్నదే. కనుక వదిలించుకోవచ్చు. కానీ... అంత సులభం కాదు. గట్టి ప్రయత్నం చెయ్యాల్సిందే! ఎందుకంటే ఇది కూడా ఒక వ్యసనం లాంటిదే! జీవితంలో విజయాలు దూరం చేసుకునే మహత్తరమైన మార్గాలలో "వాయిదాల రోగం" ఒకటి. దీని గురించి మరిన్ని లోతైన విషయాలు అధ్యయనం చేయడం కోసం డా: బి.వి.సత్యనాగేష్ (మైండ్ పౌండేషన్ సెంటర్ ఫర్ పర్సనల్ ఎక్స్ లెన్స్ డైరెక్టర్)గారు "సైకాలజీ టుడే -జనవరి :2019 సంచిక"లో అందించిన "కొత్త సంవత్సరంలో సరికొత్త విజయాలు సొంతం కావాలంటే..?" అనే ఉపయోగకరమైన వ్యాసాన్ని తప్పక చదవండి.

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Popular Posts

Recent Posts