ఆదివారం, మార్చి 15, 2020

సంపూర్ణ విజయానికి 10 సూత్రాలున్నాయి | There are 10 principles for absolute success.


  1. జీవితాన్ని సింపుల్ గా గడపండి. ఖరీదైన అలవాట్లు మానుకోండి.ఇక్కడ ఖరీదు అంటే ఆర్ధికపరమైన ఖరీదు కాదు.ఇతరుల మీద మనం ఆధారపడేట్లు చేసే అలవాట్లు కూడా ఖరీదైన అలవాట్లే. ఎప్పుడయితే నిరాడంబరంగా బ్రతకడం ప్రారంభిస్తామో అప్పుడు మనకి స్వార్ధం కూడా తక్కువుగా ఉంటుంది.
  2. సంపాదించిన దానికన్నా తక్కువ ఖర్చు పెట్టండి. అప్పు తీసుకోవడాన్ని ఎవాయిడ్ చేయండి.
  3. మీ మెదడు ద్వారం దగ్గర మీరే వెయిటర్ లాగా నిలబడండి. లోపలినుంచి ఎప్పుడు ఏం కావాలో దానిని అందజేయడానికి సన్నద్దులుగా వుండండి. మెదడు ఏదైనా అడిగినప్పుడు దానిని హృదయం కిచెన్ లోంచి తీసుకు వెళ్లి అందజేస్తూ వుండండి. ఈ విధంగా మెదడుకీ, హృదయానికి మధ్య మీరు తిరుగుతూ వుంటే ఆ ఎక్సర్ సైజ్ మిమ్మల్ని మానసికంగా ఎంతో శక్తిమంతుల్ని చేస్తుంది.
  4. మనిషిగా పుట్టినందుకు నిరంతరం గర్వంగా,ఆనందంగా ఫీలవుతూ ఉండండి.ఇతరుఅలని సంతోషపెట్టడం వలన వచ్చే ఆనందాన్ని గ్రహించండి. అదే సమయంలో మీకే మాత్రం నష్టం కలుగకుండా చూసుకోండి.
  5. ఫలితం ఏమైనా, ఉద్దేశ్యం మాత్రం నిజాయితీగా ఉండేలా చూసుకోండి.
  6. పక్కవారి జ్ఞానం మీదా, అనుభవం మీదా నమ్మకాన్ని వుంచండి. అలా అని వారు మీ నమ్మకాలని కూలదోయడానికి ప్రయత్నిస్తే తప్పకుండా ఎదుర్కోండి. తార్కికంగా ఆలోచించి వారు చెప్పింది కరెక్టా, మీది కరెక్టా అన్న విషయం ఒంటరిగా నిర్ధారించుకోండి.
  7. నిన్నటికీ, ఈ రోజుకీ మధ్య మీ జీవితాన్ని తీసుకుంటే అందులో తప్పనిసరిగా ఒక అనుభవమో, ఒక అనుభూతో, ఒక ఆహ్లాదమో కనీసం ఒక్కసారైనా మీద పెదవుల మీద చిరునవ్వో ఉండి తీరాలి. అలాంటి రోజు లేదంటే మీ జీవితంలో ఒకరోజు నిరర్ధకమైనట్లే. ఈ విషయం సదా గుర్తుంచుకోండి.
  8. పక్షుల్ని గమనించడం, ఉదయం పూట నడవటం, తోటపని, సంగీతం పట్ల అభిరుచి, ఎదో ఒక ఆట, ఒక విదేశీ బాష నేర్చుకోవటం, పుస్తకాలు చదవటం, ఫోటోగ్రఫీ, సాంఘిక సేవ, స్టేజీ మీద మాట్లాడటం, దూరప్రాంతాలు చూసే అభిలాష, రచన, మ్యూజిక్ - పై వాటిలో కనీసం మూడిటి పట్ల మీకు ఇష్టం, అభిరుచి వుంది తీరాలి.
  9. ప్రార్ధనలని నమ్మండి. ప్రార్ధన మనసుని ప్రక్షాళన చేస్తుంది. నిస్వార్ధమైన ప్రార్ధనలో ఉన్న ఆనందం మరి దేనిలోనూ లేదు.
  10. "మనం ఒక వ్యక్తిని ఎంత ఇష్టపడుతున్నాం అనేది అతడికి మనం చేసిన మంచి' మీద ఆధారపడి ఉండాలే తప్ప అతడు మనకు చేసిన సాయం మీద కాదు" ఈ వాక్యం కొంచెం కన్ ఫ్యూజింగ్ గా వున్నా ఒకటికి పదిసార్లు చదివి అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి. "మానవ సంబంధాలు" అన్న అధ్యాయం మొత్తం ఈ ఒక్క వాక్యం మీద ఆధారపడి వుంది. ఇష్టపడి మనం సాయం చేయటం దైవత్వం. సాయం చేయటం వల్లనే ఇష్టపడటం స్వార్ధం (లేదా) కృతజ్ఞత.

1 కామెంట్‌:

 


Popular Posts

Recent Posts