శుక్రవారం, మార్చి 01, 2019

read-on-for-sure-story-you-love-your-mind
Read on for sure ... the story you love your mind
రాళ్ళు కొట్టుకుని జీవించే ఒక  అతను ఒక రోజు తన పని చేసుకుంటూ ఉండగా.. కను చూపులో ఒక రాయి ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. అతను ఆ రాయినిఇంటికి తీసుకుని వెళ్లి భార్యకు ఇచ్చాడు.

ఆమె దాన్ని గూట్లో పెట్టింది. కొన్ని రోజుల తరువాత కుంకుడు కాయలు కొట్టడానికి దాన్ని ఉపయోగించుకుంది!

ఒక రోజున వాళ్ళ పిల్లవాడు రాళ్ళ ఆట ఆడుకోటానికి ఆ రాయిని తీసుకుని బయటకి వెళ్ళాడు. కొద్ది సేపటికి అటుగా మిఠాయిలు అమ్ముకునే అతను వచ్చేటప్పటికి పిల్లలు అందరూ ఆ మిఠాయి బండి చుట్టూ మూగారు. ఈ పిల్లాడు కూడా రాయి  చేతిలో పట్టుకుని వెళ్ళాడు.

ఆ రాయి మిఠాయి వ్యాపారిని ఆకర్షించింది. అతను బాబుతో ఆ రాయి నాకు ఇస్తావా .. నీకు ఒక లడ్డూ ఇస్తాను అన్నాడు. పిల్లాడు సంతోషంతో ఆ రాయి అతనికి ఇచ్చేశాడు. సాయంత్రం చెత్త వస్తువులు ఏరుకునే అతని స్నేహితుడు చూసి ఆ రాయి గురించి అడిగితే అతను ఎవరో పిల్లాడి చేతిలో ఉంటె బాగుంది కదా అని ఒక లడ్డూ  ఇచ్చి తీసుకున్నాను అని చెప్పాడు. ఆ స్నేహితుడు ఆ రాయిని కోరగా అతనికి ఇచ్చేశాడు.



అతను ఆ రాయిని మిగతా చెత్త వస్తువులతో కలిపి చెత్త వస్తువులు కొనే వ్యాపారి వద్దకి పోయి వస్తువులని వివిధ రకాలుగా విభజించి అతనికి అమ్మగా అతను ఈ రాయిని చూసి అది ఏమిటి భలే ఉంది! నాకు ఇచ్చేయ్ అని అడిగాడు. దానికి అతను కొంత డబ్బు  తీసుకుని ఆ రాయి వ్యాపారి కి ఇచ్చేశాడు. బాగుంది కదా అని వ్యాపారి దాన్ని బల్ల పైన పేపర్ వెయిట్ గా వాడసాగాడు.

కొన్ని రోజులకి ఒక టోకు వ్యాపారి ఇతని దుకాణానికి వచ్చి ఆ రాయిని చూసి, అతనికి మరి కొంత  ఇచ్చి ఆ రాయిని తీసుకున్నాడు. దాన్ని వజ్రాల వ్యాపారి వద్దకి తీసుకుని వెళ్లి పరీక్ష చేయిస్తే అది కొన్ని కోట్లు విలువ చేసే మేలిమి వజ్రం అని తేలింది.

నీతి :-
అదే రాయి ని ఒకళ్ళు కుంకుడు కాయలు కొట్టుకో డానికి వాడుకున్నారు. ఒకళ్ళు రాళ్ళ ఆట ఆడుకోటానికి వాడుకున్నారు. ఒకళ్ళు ఒక లడ్డూ కోసం దాన్ని ఇతరులకి ఇచ్చేశాడు. ఒకళ్ళు దాన్ని పేపర్ వెయిట్ గా వాడుకున్నారు. నిజంగా దాని గురించి తెలిసిన వ్యక్తి దాని విలువ రాబట్టుకున్నాడు.

అట్లాగే ఈ మానవ జన్మ ఎంతో విలువైనది. ఎంతో అరుదుగా లభించేది. దాన్ని దేనికోసం వాడుకోవాలి అన్నది వారి వారి బుద్ధి మీద ఆధార పడి ఉంటుంది! మానవ జీవిత పరమార్థం తెలిసికొనినవారు ఈ జన్మను సరిగా వాడుకుంటూ జీవన్ముక్తి పొంద గలుగుతారు. లేని వారు ఈ జీవితాన్ని వృథా చేసుకొంటారు.
అసలు..,
మానవ జన్మ ఎత్తిన ఈ మనుషులందరూ వజ్రాలే!
తమలోని మంచి,మానవత్వం,ప్రేమ అనే ధగ ధగలను దాచుకుని రాళ్ళలా జీవిస్తున్నారు!

Related Posts:

2 కామెంట్‌లు:

Popular Posts

Recent Posts

 ప్రళయం రాబోతుందా? Whats Wrong In Oceans? | Doomsday Fish Oarfishసముద్రం 3k లోపల ఉండే ఈ చేప...
 America is sending our Indians back! | మన భారతీయులను వెనక్కి పంపేస్తున్న అమెరికా!America is...
 ప్రతిరోజూ ఈ లేడీ అఘోరా గొడవేంటి? | Lady Aghora | KSC Smart Guideప్రతిరోజూ ఈ లేడీ అఘోరా...
 Nara Chandrababu Naidu is a living example of patience | సహనానికి నిలువెత్తు నిదర్శనం నారా...
 ఈమధ్య Youtubeలో వచ్చే రాజకీయ ఫేక్ వీడియోలు చూస్తుంటే చాలా బాధేస్తుంది.రాజకీయాలకు బానిసయ్యి...