ఇంతకీ మనలో మన మాట: మతాలనీ, రాజకీయాలనీ పక్కన పెట్టి ఆలోచిస్తే ప్రపంచంలో అసలు భారతీయులని మించిన సహనవoతులు ఎక్కడా కనబడరు.
రుజువులు కావాలా? చిత్తగించండి.
* ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ బోలెడన్ని వాగ్దానాలు చేసి, గెలిచాక ప్రత్యక్ష నరకంలోకి నెట్టే నిర్ణయాలు తీసుకునే నేతాశ్రీలని ఏనాదైనా నిలదీస్తామా? ఇది సహనం కాదూ?
* మనకేమో ధరలనీ పన్నుల్నీ తమకేమో జీతాలనీ పెంచుకునే ప్రజాప్రతినిధులని ఇదేం అన్యాయం అని ఎప్పుడైనా అడిగామా? ఇది పరమ సహనవంతుల లక్షణం కాదా?
* రోజూ ఎన్నిరకాల పన్నుల్ని కడుతున్నామో తెలుసుకునే ప్రయత్నం మనలో ఎంతమంది చేస్తాం? అసలు అందుబాటులో లైబ్రరీలే లేనప్పుడు ఆ పేరుతో సెస్సు నెల,నెలా ఎందుకు కట్టాలని గాని, రోడ్ తాక్సులు కడుతున్నాం మరి మంచిరోడ్లు ఏవి అని గాని అడుగుతామా?
* హెల్మెట్ తో తాలని రక్షించుకుంటే చాలా? గతుకులూ, గుంటలూ, ఓపెన్ మాన్ హోల్సులో పడి కాళ్ళూ చేతులూ, నడుములూ విరగొట్టుకుంటే పర్లేదా అని వాదిస్తామా? (కొంపదీసి నిజంగా అడిగేరు- శిరస్త్రాణంతో పాటు శరీరం మొత్తాన్నీ లోహకవచంతో కవర్ చేసుకోండీ అని కొత్త రూలు తెస్తారు జాగ్రత్త)
* రిజర్వేషన్లని అద్దం పెట్టుకుని అత్తెసరు మార్కులు వచ్చినవాళ్లు, నూటికి తొంభై వచ్చినవాదిని తోక్కెసి ముందుకెళ్లిపోయి డాక్టర్లూ ఇంజినీర్లూ అయిపోతుంటే చూస్తూ వూరుకుంటున్నామా లేదా?
ఎవరక్కడ ఇండియన్స్ కి ఇంటాలరెన్స్ ఎక్కువ అని కూస్తుంట? అతి అయితే గతి చెడుతుందన్నా సామెత ప్రకారం మనకి ఉన్న "అతి" సహనం వల్లే ఈ దుర్గతి, ఈ దుస్థితి! ప్రజలకీ, నాయకులకీ సరైన విషయాల్లో "అసహనం" పెరిగితే బాగుపడతాం!

సేకరణ: 3/12/2015 ఆంధ్రభూమి వారపత్రిక "అద్దంలో మనం" శీర్షిక నుండి.
తెలంగాణావాదులలాగా పోరాటం చేసే ఓపిక ఉంటే ఇవన్నీ సహ చట్టం ద్వారా అడగవచ్చు. మనకే తీరుబడి లేదు.
రిప్లయితొలగించండి