సోమవారం, సెప్టెంబర్ 30, 2019

are-there-girls-in-your-house-care-must-exercised-by-parents-the-protection-home-bound-girlsమన భారత దేశంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను మనం ప్రతి రోజూ చూస్తూనే ఉన్నాం. ఆఖరికి నెలల పసికందులను కూడా వదలని కామాంధ రాక్షసులు రోజు,రోజుకూ పెరిగిపోతూనే ఉన్నారు. ఇటువంటి వారు మన ప్రాంతాలలో కూడా ఉండవచ్చు. నిజానికి వీళ్ళు ఆకాశంలోనుంచి రారు. మన చుట్టు ప్రక్కలనే ఉంటారు. మైనారిటీ రాని అబ్బాయిల నుండి కాటికి కాళ్ళు చాపే పండు ముసలి వాళ్ళ వరకూ అత్యాచారాలకు పాల్పడిన వాళ్ళను మనం TVలలో, వార్తా పత్రికలలో చూస్తూనే ఉన్నాము. ఇటువంటి పరిస్థితులలో మన ప్రాణమైన మన కంటి దీపాలైన ఆడపిల్లలను మనం నిత్యం కాపాడుకుంటూనే ఉండాలి. దీని నిమిత్తం "జనవిజ్ఞాన వేదిక" వారు కొన్ని సూచనలను మనకు అందించారు. వాటిని పరిశీలించి తగు జాగ్రత్త తీసుకోవడం అత్యంత ముఖ్యం. 

1) మన కుటుంబ సభ్యులు కానివారి నుంచి పిల్లలని దూరంగా పెట్టండి.
2) పిల్లలని ఒంటరిగా ఆడుకోమనడం,పక్క ఇళ్ళకు పంపడం అంత మంచిది కాదు.
3) మనతో ఎంతో చనువుగా ఉన్న బయట వాళ్ళు కూడా పిల్లలకి ప్రమాదకారులే కావచ్చు..
4) ఇతరులు మన పిల్లలని ఎత్తుకుని ముద్దులిడుతున్న విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.
5)చాక్లెట్ కొనిపెడతా షాపుకు తీసుకెళతా అంటూ మీ దగ్గర నుండి పిల్లలని తీసుకున్న వ్యక్తుల కోరికను సున్నితంగా తిరస్కరించండి.... పరిచయం ఉన్న వ్వక్తులకు పిల్లలని అప్పగించి బయటకు తీసుకెళ్ళమని మీరే పురమాయించకండి.
6)అత్యవసర పరిస్థితుల్లో పిల్లలని వేరే ఇంట్లో వదలిగానీ..లేదా మీ ఇంట్లోనే వదలి వెళ్ళలసి వస్తే ఆ ప్రయత్నం మానుకొండి.
7) పిల్లలు ఆడుకొనే చోటగాని,స్కూలుకు వెళ్ళే దారిలోగాని, స్కూల్లో జరిగే విషయాల్లో గాని ఆరా తీస్తూ ఉండండి.
8)కొంచెం ఎదిగిన పిల్లలకి దేహంలో ఎక్కడ ముట్టుకుంటే తప్పో.. అసభ్య  ప్రవర్తన ఏవిధంగా గుర్తించాలో వివరించండి.
8)అలాంటి వ్వక్తులు నుంచి ఎలా తప్పించుకొవాలో, ధైర్యంగా ఎలా నిలబడలో,స్వయం రక్షణ ఎలా చేసుకోవాలి వివరించాలి.
9)ఇంటి టెలిఫోన్ నెంబర్, పోలీస్ స్టేషన్ నెంబర్.. పిల్లల వద్ద ఉంచి..అత్యవసర సమయాల్లో ఇతరుల సహాయంతో ఫోన్ చేసేలా పిల్లలకు నేర్పండి.
10)ఇంటికి దూరపు చుట్టాలు వచ్చినప్పుడు మీ పిల్లలని మీ బెడ్ రూంలోనే పడుకోబెట్టుకోవడం ఉత్తమమైన పని.
11)పిల్లలు బయట ఆడుకుంటున్నారు కదా అని గంటలు గంటలు పనిలో తలమునకలై, పట్టించుకోకుండా ఉండడం అంత మంచిది కాదు.
12)పిల్లలు ఏదైనా చెప్పడానికి సంకోచిస్తున్న, లేదా మూడీగా ఉన్నా, భయం భయంగా చూస్తున్న, వాళ్ళల్లో వాళ్ళే మధనపడుతున్నా..ఏదో జరిగింది అని గ్రహించి ప్రేమగా ఆరా తియ్యండి.
13)లైంగిక విషయాలలో ఎవరిమీద అయినా పిల్లలు ఫిర్యాదు చేసినప్పుడు తేలిగ్గా తీసుకోవద్దు.
14)12 ఏళ్ల బాలురు నుంచి వృద్దులు వరకూ పిల్లలకు లైంగిక శత్రువులేనన్న విషయం గుర్తుపెట్టుకోండి.
15)మీ పిల్లలతో ప్రేమగా ఉండండి. ఏ విషయమైనా బెరుకు లేకుండా మీతో చెప్పగలిగే బాండిగ్ మీ మద్య పిల్లల మద్య ఉండాలి... పిల్లల మద్య మన మద్య అలాంటి సంబధాలు ఉన్నప్పుడే మన పిల్లలు మన ఇంట్లో సేఫ్ గా పెరగగలుగుతారు... 🙏

*ఆడపిల్లను పుట్టనిద్దాం.. బతకనిద్దాం .. చదవనిద్దాం..ఎదగనిద్దాం* 
*జనవిజ్ఞాన వేదిక* (ఏఐపీఎస్ఎన్)
*సమత విభాగం*
*విజయవాడ నగర కమిటీ*

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Popular Posts

Recent Posts