జగన్ పనులు చూస్తుంటే మళ్ళీ జగనే సియం అయితే బాగుంటుంది...ఎందుకంటే ఒకవేళ చంద్రబాబు సియం అయినా పరిపాలన సాగదు..రాష్ట్ర భవిష్యత్ ను ఏమాత్రం పట్టించుకోని మన జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగూ రాష్ట్రాన్ని దివాళా తీసే దిశగానే తీసుకెళ్తున్నారు. ఒకవేళ చంద్రబాబు సియం అయినా ఆ బొక్కలన్నీ పూడ్చి మళ్ళీ ఆంధ్రాను గాడిలో పెట్టడానికి ఆయన పదవీకాలం కూడా సరిపోదు. ఇవేవీ తెలియని ప్రజలు చంద్రబాబు వచ్చి చేసిందేమిటి? బొంద అంటూ మళ్ళీ అట్టర్ ఫ్లాప్ విజయాన్ని మూటగడతారు. ఎలక్షన్ల ముందు మరోసారి చంద్రబాబుకి అధికారం ఇద్దాం. ఈసారి పోలవరం,అమరావతి పూర్తవుతాయి అన్న మాటలే ప్రజలు పలికారు. ఒక్క ఛాన్స్ అన్నందుకు జగన్ కు పట్టం కట్టేశారు. ఇంత చేసిన చంద్రబాబును, ఆంధ్రాను గాలికొదిలేశారు. ఇప్పుడు లబో,దిబో మంటున్నారు. ఉపయోగం ఏముంది? నిజానికి జగన్ గారు పోలవరం, అమరావతి ఆపకుండా దానిని తీర్చిదిద్ది ఉంటే తిరుగు లేకపోవును. కానీ చంద్రబాబు మొదలు పెట్టిన ఏపని కొనసాగించడం ఆయనకసలు ఇష్టం లేదు. అందుకే పేదవారి కడుపు నింపే అన్నా క్యాంటీన్లు కూడా మూసి పారేశారు. చంద్రబాబుగారు అడుగిడిన ప్రాంతాలు కూడా ఆయనకు నచ్చడం లేదు. ఏదో కోణంలో ఇబ్బడిముబ్బడిగా కేవలం వైయస్సార్ సిపి కార్యకర్తలను ఉద్యోగులుగా మార్చేస్తున్నారు. జగన్ పదవీకాలం పూర్తయ్యేటప్పటికి అన్ని రంగాలలో కేవలం వైయస్సార్ సిపి కార్యకర్తలు మాత్రమే ఉంటారు. ఖర్మకాలి చంద్రబాబు సియం అయ్యి వీళ్ళందరినీ తొలగించినా రాష్ట్రం అల్లకల్లోలం అయిపోవడం ఖాయం. మన ఆంధ్రా సెకండ్ బీహార్ గా మారిపోవడం తధ్యం.
మరొక బాధాకరమైన విషయమేమిటంటే ప్రత్యేక హోదా కోసం తెగ వాగిన చలసాని శ్రీనివాస్ , హైటెక్ లెక్కలు గీసే ఉండవల్లి అరుణకుమార్, భవిష్యత్ కర్త గరుడ శివాజీ, లడ్డూ కావాలా, బొంద కావాలా అంటూ ఓవర్ యాక్టింగ్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పచ్చి బూతులు తిట్టిన సోము వీర్రాజు ఇప్పుడు ఏమయిపోయారు?
చంద్రబాబు సియం అయితేనే కానీ వీళ్లకు మళ్ళీ పని దొరకదు. ఎక్కడో బొక్కలలో దాక్కున్న అరుణకుమార్ కూడా మళ్ళీ పద్దుల పుస్తకం పట్టుకుని ప్రజల ముందుకు, మీడియా ముందుకు దూకుతాడు. మనలాంటి సామాన్య ప్రజలు చోద్యం చూస్తున్నట్టు ఉండిపోవడం తప్ప ఏం చేయగలం?

0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి