స్థానిక ఎలక్షన్లలో టిడిపి పోటీ చేయడం అవసరమా?
ప్రస్తుత వైయస్సార్ సిపి పరిస్తితి చూస్తుంటే స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం అనవసరం అనిపిస్తోంది. ఎందుకంటే పైన అధికారంలో వైయస్సార్ సిపి ఉన్నప్పుడూ ఒకవేళ టిడిపి పార్టీ వాళ్లు గెలిచినా వాళ్లు ఎటువంటి పనులు చేయలేరు సరికదా తీవ్రమైన పరిస్థితులు ఎదురుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని చోట్ల వైయస్సార్ సిపి వాళ్ళ దౌర్జన్యానికి భయపడి నామినేషన్లు వేయడానికే భయపడే వాళ్లు ఒకవేళ నెగ్గినా అధికారంలో ఉన్న వైసీపీ వాళ్లను ఏవిధంగా ఎదురుకోగలరు?జెసి స్థానిక ఎన్నికలలో టిడిపి పోటీ చేయకపోవడమే మంచిదన్న వాదన సమర్ధనీయమైనది. ఎటూ ఆంధ్రా అంతా వైసీపీనే రాజ్యమేలుతుంది కాబట్టి స్థానిక సంస్థలు కూడా వాళ్ళకే అప్పగించేస్తే బాగుంటుంది. ఇదే పని టిడిపి చేయగలిగితే 2024 అసెంబ్లీ ఎలక్షన్లలో టిడిపికి ఎదురు లేకుండా పోతుంది. ప్రజలు పూర్తిగా టిడిపికే పూర్తిగా ఒరిగిపోతారు.
నిన్నా మొన్నా వరకు "ఏయ్ జగన్ దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు పెట్టు" అంటూ హుంకరించిన సైకిలోళ్లు తీరాపోసి స్థానిక ఎన్నికలు వచ్చేసరికి ఇలా తోక ముడుస్తున్నారేమిటి చెప్మా.
రిప్లయితొలగించండి