సోమవారం, జూన్ 15, 2020

ప్రపంచానికి కరోనా వరమా? శాపమా?

China-Virus-Corona-effect-in-world
ఈ పోస్టు చదువుతున్నవారందరూ ఇదేమి ప్రశ్నా? అనుకోవచ్చు. కానీ నిజానికి చాలామంది హృదయాలలో కరోనా భగవంతుడి తరుపునుండి వచ్చిన ఒక వరమని కొంతమంది, ఒక శాపమని మరికొంతమంది భావిస్తున్నారు. 

ఒకరోజు ఉదయం నేను నా మిత్రుడు "ధర్మ"తో ఫోన్లో సంభాషిస్తుండగా ఒక ఆసక్తికర సంఘటన ఒకటి చెప్పుకొచ్చారు. అదేమిటంటే తను "బజార్లో కూరగాయలు తీసుకుంటుండగా ఒక పెద్దాయన మరొకరితో వాదిస్తున్నాడు. " కరోనాను వైరస్ అని అనకండి.. నేను ఒప్పుకోను... అది భగవంతుడి అవతారం.. దుర్మార్గులను అంతమొందించడానికి, నాశనమయిన ప్రకృతిని పునరుద్ధరించడానికి వచ్చింది... మీరే గమనించండి మన పద్ధతులు ఎంత చక్కగా మారాయో ఉన్న సంపదను పొదుపుగా వాడుకోవడం.. క్రమశిక్షణను పాటించడం.. అనవసరంగా బయట బలాదూరుగా తిరుగుడు ఆగిపోవడం... అర్ధరాత్రులు వరకూ తాగి తందనాలాడటం ఆగిపోవడం... కుటుంబ సభ్యులతో గడపటం ఎలా సాధ్యమయింది కరోనా వలన కాదా? సౌండ్ పొల్యూషన్ లేదు, డస్ట్ పొల్యూషన్ లేదు.. రోడ్లు అన్నీ నిర్మాన్యుషంగా, ప్రశాంతంగా లేవా?... పెద్దాయన మాటలు వింటూ ఉంటే వాస్తవమే కదా అనిపిస్తోంది.
ప్రకృతి సిద్ధమైన ఆహారం తిన్నవాడు ఆరోగ్యవంతుడు... వాడికే రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది.. వాడి జోలికి కరోనా రమ్మన్నా రాదు. జంక్ ఫుడ్స్ , ఫాస్ట్ ఫుడ్స్ తిన్నవాడే కరోనాకి కావాలి.. ఎందుకంటే వాడికి ఆరోగ్యం బలంగా ఉండదు. 

కరోనా రాకముందు మనం వండుకుని కుటుంబ సభ్యులతో కల్సీ భోజనం చేయడం మాయమయిపోయింది. స్విగ్గీలు, జమోటాలు ద్వారా రప్పించుకుని తినేయడం, తరువాత అల్సర్లకు, గ్యాస్ ట్రబుళ్లకు గురవ్వడం.. మన జీవితంలో నిత్యకృత్యమయిపోయింది. ఇవన్నీ కరోనా వచ్చి రూపు మాపేసింది. స్విగ్గీలు, జమోటాలు ద్వారా తినే పద్దతిని పీకి పారేసింది. అది ఎంతమంది చేతులు మారుతుందో, ఆచేతులలో ఏ చేతికి కరోనా వచ్చిందో తెలియదు కదా అన్న భయంతో మనం స్విగ్గీలు, జమోటాలకి మనం స్వస్తి పలికాం. చక్కగా వండుకుని కుటుంబ సభ్యులతో కలసి ఆరోగ్యవంతమైన బోజనాన్ని భుజించడం ప్రారంభించాం.

ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేమిటి? బొల్డున్నాయి!

సినిమాలు, షికార్లు బంద్ అయిపోయాయి. 
అనవసర ఖర్చులు అడుగంటిపోయాయి.
కుటుంబ సంబంధాలు బలం పుంజుకున్నాయి.
చీటికి, మాటికి ప్రయాణాలు చేసేవాళ్ళు తగ్గిపోయారు.
మరీ ముఖ్యంగా దానగుణం ఉన్నవారెవరో, పిసినారితనం అవలంభించేవారెవరో తెల్సిపోయింది.
ఆరోగ్యం పట్ల జాగ్రత్త, పొదుపు పట్ల శ్రద్ధ, కుటుంబం పట్ల బాధ్యత అన్నీ పెరిగాయి. 

ఇంట్లో ఉంటూ ఏం చేస్తే బాగుంటుంది? ఎలా బ్రతికితే బాగుంటుంది? ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? ..ఇలా అనేక ఆలోచనలు మనిషి బుర్రకు ప్రారంభమయ్యాయి. 

కేవలం కరోనా వలన మాత్రమే ప్రకృతి కూడా పులకరిస్తోంది. వర్షాలు కూడా సకాలంలో ప్రారంభమవుతున్నాయి. 

ఒక కఠోర సత్యం ఏమిటంటే కరోనాకి మందు లేదు..రాదు. కరోనా ఎలా వచ్చిందో అలాగే వెళ్లిపోతుంది. అప్పటివరకూ మనం జాగ్రత్త పడాల్సిందే. ఎప్పటి నుండైతే మనిషి ప్రకృతిని పునరుద్ధరింపజేస్తాడో... ప్రకృతి ధ్వంస కార్యక్రమాలు మానివేస్తాడో.. మనతో పాటు సృస్టిలో ఉన్న పశు పక్ష్యాదులను బ్రతకనిస్తాడో.. తోటి మానవుడి పట్ల మానవత్వంతో మెలుగుతాడో అప్పుడే కరోనా పోతుంది. అప్పటివరకూ కరోనాను మనం ఏమీ చేయలేము.. చేతులు ఎత్తేయడం తప్ప.. జైహింద్!!!

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Popular Posts

Recent Posts