Interest in Telugu blogs has waned? | తెలుగు బ్లాగుల పట్ల ఆసక్తి సన్నగిల్లింది?
Interest in Telugu blogs has waned? |
ఈమధ్యకాలంలో తెలుగు బ్లాగులోకంలో మంచి,మంచి బ్లాగర్లు కనుమరుగయ్యిపోయారు. చాలా తక్కువమంది బ్లాగర్లు అప్పుడప్పుడూ పోస్టులు పెడుతున్న చదివే బ్లాగు వీక్షకులు లేకుండా పోయారు. బహుశా సోషల్ మీడియా ప్రభావం అనుకుంటా! అత్యధికులు వీడియో కంటెంట్ కి కనెక్ట్ అయిపోయారు.
దానికారణంగా బ్లాగరుల వైపు చూడడమే తగ్గిపోయింది. దానికి తోడూ బ్లాగులలో బూతు కామెంట్లు, గోదావులు పెట్టె కామెంట్లు, తిట్ల పురాణాలు విరజిమ్మే కామేన్టర్లు తప్ప మంచి,మంచి అభిప్రాయాలు వెలిబుచ్చే వారు గాని, సలహా, సూచనలు అందించే కామేన్టర్లు గాని ఎవరూలేరు.
ఇది కూడా బ్లాగులు దెబ్బతినడానికి కారణమే!
పరిస్థితి ఇలానే ఉంటె తెలుగు బ్లాగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యి పూర్తిగా కనుమరుగయ్యి పోవడం ఖాయం. దయచేసి బ్లాగర్లు, బ్లాగు వీక్షకులు ఈ విషయాన్ని గమనించి తగు బాధ్యతా వహిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
ఏమి చేస్తే బాగుంటుందో తగు సూచనలు, సలహాలు ఈక్రింది కామెంట్ బాక్స్ ద్వారా అందించండి. అందరమూ పరిశీలించి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుందాం!
ఈవిషయం మీద ఎప్పటినుండో చెబుతున్నాను. ఇక్కడ అక్షరాలా చేపలబజారులలా ఉంది. ఈరణగొణధ్వనిలో ఎవరి సణుగుళ్ళూ వినిపించవు.
రిప్లయితొలగించండి