Happy New Year to esteemed blog friends |
భయంకరమైన కరోనా వైరస్ సృష్టించిన అలజడి తరువాత మొదటిసారిగా, నూతన సంవత్సర వేడుకలు సాధారణంగా ఫ్యామిలీతో కలిపి చేసుకుంటున్నాం. ఓమిక్రాన్ భయంతో ఎవరూ భయట పెద్దగా తిరగనూ లేదు. ప్రభుత్వాలు కూడా కాస్త కటినంగానే వ్యవరించడం అభినందనీయం. నిజానికి మనం నూతన్ సంవత్సర వేడుకలు జరుపుకోవడం అంటే డిసెంబర్ 31 అర్ధరాత్రి (పార్టీ!) గడియారం ముల్లు దాటి,దాటగానే, కేకు కంటిగ్లు చేయడం, పార్టీలు చేసుకోవడం కాదు.ఈ సంవత్సరం కంటే వచ్చే నూతన సంవత్సరంలో భవిష్యత్తు కోసం శక్తివంతమైన ఆశాజనకంగా ఉండడానికి సరైన ప్రణాళిక వేసుకోవడం. గడిచిపోయిన గత సంవత్సరం అవసరం లేదు. మన ముందున్న కొత్త సంవత్సరమే మనకవసరం. దానిని ఎంతవరకూ మరింత మెరుగ్గా తీసుకు వెళతామా అన్నదే ముఖ్యం.
కాబట్టి మనలో ప్రతి ఒక్కరమూ కొన్ని గోల్స్ వ్రాసుకుని మనం నిద్ర నుండి లేచినప్పుడు మొదటగా కనిపించేలా గోడకు వేలాడదీయండి. ప్రతి రోజూ మనం చూస్తూ ఉండటం వలన తప్పనిసరిగా వాటిని సాధించే అన్ని సాధనాలు మనకి సమకూరుతాయి.
మనకి అవసరం లేని పనికిమాలిన విషయాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే కట్టెల పొయ్య కాలిపోయే కొద్దీ బూడిద మిగుల్చుకున్నట్టు, మన బుర్రలోకి పనికిమాలిన విషయాలు, అనవసరమైన విషయాలు ఎక్కించుకునే కొద్దీ నాశనాన్నే మిగులుస్తాయి.
మీకు అభిమానం ఉన్న హీరో సినిమా రిలీజ్ అయితే హుందాగా చూసి రావాలి. నచ్చిన నాయకుడు పోటీ చేస్తే అతని వలన ప్రజలకు, ప్రజాస్వామ్యానికి మేలా,కీడా అని ఆలోచించి ఓటు వేసి మీ పనులు చూసుకోండి. అంతే గాని హీరో కోసం తలకు గుడ్డలు కట్టుకోవడం, రంగులు జల్లుకోవడం, కటౌట్ ల కోసం డబ్బులు వృధా చేసుకోవడం వికృత చర్యలు, రాజకీయ నాయకుల కోసం ప్రతి అడ్డమైన వివాదాలు సృష్టించటం, దూరటం, ప్రజాస్వామానికి ఆటoకాలు కలిగించడం ఇవి క్రూరత్వ చర్యలు. సమాజ మేలు కోసం పోరాడటం మహోన్నతం.. మంచి, చెడ్డా ఆలోచించకుండా అలజడులు సృష్టించడం మూర్ఖత్వం. ఇటువంటి చర్యలు కూడా చివరకి బూడిదనే మిగుస్తాయి.
తెర వెనుక డ్రామాగాల్లు ఉంటారు. తెర ముందు మంచివాల్లుంటారు, చెడ్డవాల్లుంటారు.. మనం ఏవర్గంలో ఉన్నామో అదే ముఖ్యం. మూడు గంటల సినిమాలో ..క్లైమాక్స్ వరకూ విలన్ మాత్రమే సుఖపడతాడు. కాని చివరకు విజయాన్ని మాత్రం హీరో దక్కించుకుంటాడు. అందుకనే పేక్షక హృదయాలలో హీరోకి తప్ప విలన్లకు చోటుండదు. మన పరిస్థితి కూడా అంతే!
మనం అడుగు పెట్టిన నూతన సంవత్సరం ఎంత సఫలీకృతం చేసుకున్నామో అదే మన విజయం. కాబట్టి మీకు అనుకూలమైన ప్రణాళికలు వేసుకోండి. దానిని ఆచరించడానికి కావాల్సిన సాధనాలు సమకూర్చుకోండి. సక్సెస్ కాళ్ల దగ్గరే పడి ఉంటుంది.
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి