మంగళవారం, జులై 25, 2023

ఆంధ్రా రాజకీయాలు ఇంతిలా నాశనం కావడం ఇదే తొలిసారి!

ఆంధ్రా రాజకీయాలు చూస్తుంటే చాలా అసహ్యం వేస్తుంది. ప్రజలను సక్రమార్గంలో నడిపించాల్సిన మంత్రులు, MLAs పచ్చి బూతులు మాట్లాడుతుంటే... ప్రక్కనే ఉన్న ముఖ్యమంత్రిగారు చిరునవ్వులు నవ్వుతుంటే... ఇక ప్రజల పరిస్థితి ఏమిటి?

అబద్ధాలు, అసహ్యకరమైన బూతులు... ఇదేమి రాజకీయం!

న్యూస్ చానెళ్ళు చూడాలంటే భయమేస్తుంది.. ఎక్కడ పిల్లలు ఆ బూతులు వింటారేమోనని!

ఆంధ్రాలో ఎటువంటి అభివృద్ధి జరిగింది? 

ఉచిత పధకాల కోసం విపరీతంగా నిత్యావసరాల ధరలు పెంచేసారు. 

పూర్వం ఒకరాజ్యంలో రాజుగారు ప్రజలందరూ మనకి బానిసలుగా ఉండాలంటే ఏమి చెయ్యాలి? అని మంత్రివర్గంలో అడిగినప్పుడు మంత్రులందరూ ప్రజలలో స్వయం ఉపాధి లేకుండా చేసి మనం పడేసే డానికి అలవాటు చేస్తే చాలని సెలవిచ్చారట!

నేటి పాలన అలాగే ఉంది

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Recent Posts