America is sending our Indians back! | మన భారతీయులను వెనక్కి పంపేస్తున్న అమెరికా!
![]() |
America is sending our Indians back |
డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత మన భారతీయులను వెనక్కి పంపేస్తుంది. ఇందులో అసలు విషయం ఏమిటంటే మన మీడియా హల్చల్ చేస్తున్నట్టు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్నది తప్పేమీ కాదు.
అమెరికాలోకి అక్రమంగా చొరబడిన, అన్లీగల్ గా ఉంటున్న భారతీయులను మాత్రమే తరిమేస్తున్నారు.
మరొక గొప్ప విషయం ఏమిటంటే అమెరికా చట్టాల ప్రకారం జైల్లో వేస్తే మన భారతీయులు బయటికి వచ్చే అవకాశం లేదు. కాని అమెరికా తన స్వంత ఖర్చులతో మన భారతీయులను మాత్రమే కాకుండా ఇతర దేశస్తులను కూడా ఆయా దేశాలకు పంపేస్తున్నారు.
చొరబాటుదారులను జైల్లో వేసి మేపడం... వాళ్ళ వసతులకు ఖర్చులు పెట్టడం అన్నీ దండగ అని బహుశా డొనాల్డ్ ట్రంప్ భావన!
ఇక నుండి అమెరికా లోకి వచ్చిన చొరబాటు దారులకు చరమగీతమే! అమెరికాలో క్రైం రేటు చాలా దారుణంగా పెరిగిపోయింది. కొన్ని ప్రాంతాలలో అయితే చీకటి పడితే బయటికి రాలేని పరిస్థితి... ఆఖరికి ఇంటిలో కూడా దాక్కుని బ్రతకాల్సిన స్థితి... దోచుకోవడాలు... కాల్చి చంపేయడాలు
ఇవన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ సరి చేయాలనుకుంటున్నాడు... దానిలో భాగంగా దేశాన్ని ముందు శుభ్రం చేసుకుంటున్నాడు... ఇదే పని మన భారత్ కూడా ఎప్పుడు మొదలు పెడుతుందో చూడాలి?
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి