వార్తలు - వాయింపులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వార్తలు - వాయింపులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

సోమవారం, నవంబర్ 04, 2024

 ప్రతిరోజూ ఈ లేడీ అఘోరా గొడవేంటి? | Lady Aghora | KSC Smart Guide

ప్రతిరోజూ ఈ లేడీ అఘోరా గొడవేంటి?
ప్రతిరోజూ ఈ లేడీ అఘోరా గొడవేంటి?

ఈమధ్య సోషల్ మీడియా తెరిస్తే చాలు..

ఈక్రింది లేడీ అఘోరా ప్రచారం ఎక్కువయ్యిపోయింది

ఈమె మొన్న అమావాస్య రోజు ఆత్మార్పణం చేసుకుంటానని ప్రకటించినందుకు... దాని నుండి ఆమెను కాపాడటానికి 2000 మంది పోలీసులు సైతం కాపలా కాయాల్సి వచ్చిందని మీడియాలో చూసి ఆశ్చర్యపోయా!

ఒంటి మీద ఒక్క గుడ్డ ముక్క లేకుండా అఘోరా అవతారమెత్తి తిరుగుతున్న ఈమెను మెంటల్ చెకప్ చేయించి వైద్యం చేయిస్తే మంచిది

ఎందుకంటే...

సనాతనధర్మమంటే... ఒంటిమీద గుడ్డలు తీసేసి నగ్నంగా సభ్యసమాజం సిగ్గు పడేలా తిరగడం కాదు

సనాతనధర్మమంటే... శవాలను పీక్కు తినడం, శవాలతో పడుకోవడం కాదు

సనాతన ధర్మమంటే మహోన్నతమైనది...

  • స్త్రీ యొక్క మానాన్ని, గౌరవాన్ని కాపాడేదే సనాతన ధర్మం
  • దేవతలను సైతం తన దగ్గర నిలుపుకునే శక్తి సామర్ధ్యం కలిగిన గొప్పతనం స్త్రీ
  • మానవ సృష్టి అభివృద్ధికి, భగవంతుణ్ణి తరువాతి స్థానంలో నిలబడి ఉన్నదీ స్త్రీ మాత్రమే!

అటువంటి స్త్రీని భక్తీ పేరుతో, ధర్మం ముసుగులో నగ్నంగా నిలబెట్టే అవకాశం సనాతన ధర్మంలో లేనే లేదు.


ఈరోజు ఆశ్రమాలలోనూ, సమాజాల పేరుతొ పెట్టిన సంస్థలలోనూ చివరికి బలి చేస్తున్నది స్త్రీలనే!

దొంగ స్వామీజీలు, దొంగ ఆశ్రమాలు ఒకొక్కటి నేటికీ బయట పడుతూనే ఉన్నాయి...

వాటికి బలయిన స్త్రీల ఉదంతాలు ఒళ్ళు గగురు పొడుస్తూనే ఉన్నాయి


వీటిని తమ స్వార్ధం కోసం రచ్చ, రచ్చ చేసి వదిలేసే మీడియాలు..

వీటిని గొప్పగా సమర్ధించే దొంగ సనాతన వాదులు మరో వైపు...


నేటి సమాజమే ఇలా తయారైనది... ఇక సనాతన ధర్మం ఉనికెక్కడ?


మనిషి పుట్టేటప్పుడు నగ్నంగా ఉన్నాడు కాబట్టి... నగ్నంగా తిరగడమే సనాతనధర్మమట... వాదన విడ్డూరంగానూ, అసహ్యకరంగానూ ఉన్నది.

బిడ్డ పుట్టకముందు తల్లి గర్భమూ... పుట్టిన తరువాత తల్లి యొక్క చాటు, ఎదిగిన తరువాత బట్ట మనిషికి పరదా ఉంటూనే ఉన్నాయి

ఇక్కడ నగ్నత్వానికి చోటేది?


సనాతన ధర్మమంటే తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ, దైవ చింతనలో తన జీవితాన్ని గడపటం..

అంతేగాని కన్న తల్లిదండ్రులను, కట్టుకున్న తోడును గాలికొదిలేసి భక్తీ ముసుగులో తిరిగే వారు సనాతన వాది అంటే మహా పాపాత్ములు అయ్యిపోతారు


గుడ్డలిప్పి తిరిగే ఈ లేడీ అఘోరాను ఏదో సృష్టిని కాపాడుతున్నట్టు, దైవమయినట్టు మొక్కడాలేమిటో... పూజించడాలెమిటో...


సనాతన ధర్మం పేరుతో వీళ్ళందరూ ఒకరికొకరు సమర్ధించుకుంటూ అమాయక ప్రజలను దోచుకుంటున్న పరమ దుర్మార్గులు... వీళ్ళు చేస్తున్నదీ... వీళ్ళు బోధిస్తున్నదీ అసలు సనాతన ధర్మమే కాదు... వేదమే కాదు

ఇదంతా ఒక మాయ!!!


ఈ లేడీ అఘోరాకు మెంటల్ ట్రీట్ మెంట్ ఇప్పించి మానసిక రోగాన్ని నయం చేయించి తల్లిదండ్రులకు అప్పగిస్తే... పాపం తల్లిదండ్రులకు కడుపు కోత తగ్గుతుంది, ఆ దరిద్రమూ మనకు తప్పుతుంది.


*జై హింద్!*

సోమవారం, జూన్ 10, 2024

 Nara Chandrababu Naidu is a living example of patience | సహనానికి నిలువెత్తు నిదర్శనం నారా చంద్రబాబునాయుడు!

Nara Chandrababu Naidu is a living example of patience

సహనంగా ఉండటం అంటే ఏమిటో... సహనానికి ఫలితం ఏవిధంగా ఉంటుందో తెలుసుకోవాలంటే చంద్రబాబునాయుడిగారిని చూసి నేర్చుకోవాల్సిందే! తనను అక్రమంగా అరెస్ట్ చేసి చంపాలని చూసినా ఏమాత్రం భయపడలేదు, జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి అనేక రకాలుగా అవమానాలకు గురవుతూనే ఉన్నారు.

దేవాలయంలాంటి నిండు అసెంబ్లీలో తన సతీమణిపై సైతం అక్రమ సంబంధం అంటకట్టి... లోకేష్ పుట్టుకను దారుణాతి దారుణంగా చిత్రించి 14సంవత్సరాల పాటు సియం గా రాష్ట్రానికి సేవలందించిన చంద్రబాబునాయుడి మనస్సును, వ్యక్తిత్వాన్ని కించపరిచినా, గుండెల్లోని భారాన్ని కన్నీళ్ళ ద్వారా వదులుకున్నాడు గాని ఏమాత్రం తొణకలేదు.

కౌరవ సభగా మార్చి వేసిన అసెంబ్లీలో మళ్ళి తిరిగి ముఖ్యమంత్రిగా అడుగుపెడతానని శపథం చేసి గెలిచిన మహా ధీరుడు నారా చంద్రబాబునాయుడు

2019లో కేవలం 23సీట్లకే పరిమితమై ఎన్నో ఎగతాలులకు, అవహేళనలకు గురైనా ఏమాత్రం తొణకకుండా తనను హింస పెట్టిన పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన అపర చాణిక్యుడు చంద్రబాబునాయుడు గారు

పక్కరాష్ట్రంలో ఉన్న కెసియార్, స్వంతరాష్ట్రంలోని జగన్ మోహన్ రెడ్డి, కేంద్రంలోని మోడీ కలిసి చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని సమూల నాశనం చేయాలని చూసినా ఏమాత్రం బెదరకుండా, భయపడకుండా, నిరాశ, నిష్రుహులకు గురికాకుండా కెసియార్ ను, జగన్ మోహన్ రెడ్డిని రాజకీయ పతనం చేసి, కేంద్రంలోని మోడీ సైతం తనపై ఆధారపడేలా చేసిన అపర మేధావి నారా చంద్రబాబునాయుడు

ప్రతి ఒక్కరూ చంద్రబాబులోని సహనాన్ని, ఓర్పును ఆదర్శంగా తీసుకోవాలి.

పడిన స్థితి నుండే ఎలా లేవాలో చంద్రబాబును చూసి నేర్చుకోవాలి

దుర్మార్గం ఒంటబట్టిన వారూ, సమాజం పట్ల బాధ్యతలేనివారు, స్వార్ధం నిండిన వారూ చంద్రబాబును విమర్శిస్తారు తప్ప మరెవరూ చంద్రబాబును అభిమానించకుండా ఉండలేరు

చంద్రబాబంటేనే ఒక నిలువెత్తు నిదర్శనం... కనుచూపుమేర అభివృద్ధి!!

2024 ఎలాక్షన్లలలో అఖండ మెజారిటీ సాధించి, మళ్లి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని, దేశానికే దిశానిర్దేశ్యం చేసే స్థాయికి ఎదిగి, ycp కౌరవ సభలా మార్చివేసిన అసెంబ్లీలో శపథం చేసి, సాధించిన గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు!.. అభినందనలు!!!

"సత్యమేవ జయతే...జైహింద్!!!"

శనివారం, మే 25, 2024

 

ఈమధ్య Youtubeలో వచ్చే రాజకీయ ఫేక్ వీడియోలు చూస్తుంటే చాలా బాధేస్తుంది.

రాజకీయాలకు బానిసయ్యి పోయేవాళ్ళు.. కొంతమందయితే... తమ కెడిబిలిటీని గాలికొదిలేసి కేవలం డబ్బులకు ఆశపడి దిగజారిన జర్నలిస్టులు, స్వయంప్రకటిత మేధావులు మరికొంతమంది

వీళ్ళు ఎంతగా సోషల్ మీడియాలో దిగజారిపోతున్నారంటే పందిని సైతం నందిగా చూపెట్టడానికి పడే ప్రయాస చూస్తుంటే ప్రజాస్వామ్యం పట్ల బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరి హృదయం ద్రవించిపోతుంది. నరనరాలలో రక్తం మరిగిపోతుంది.

నోరు విప్పితే చాలు అన్నీ అసత్యాలే... ఆరోపణలే!.. వీళ్ళకసలు మనశ్శాక్షి అనేదే ఉండదా అనిపిస్తుంది?

వీళ్ళకు అర్ధమవుతుందో.. లేదో.. గాని ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడవడమే కాదు... సామాన్య ప్రజల భవిష్యత్ ను భస్మం చేసేస్తున్నారు.

నాయకుడిని ఎన్నుకోవడమంటే అతని యొక్క వ్యక్తిత్వం... గత జీవితం... మాటతీరు... నిస్వార్ధత... నైపుణ్యం చూడాలి. ఎందుకంటే మన ఐదేళ్ల జీవితం.. దేశ, రాష్ట్ర భవిష్యత్ అతని చేతుల్లో పెడుతున్నాము కాబట్టి.

ఈవిషయంలో సామాన్య ప్రజలకంటే పైన చెప్పుకున్న సోకాల్డ్ మేధావులకే ఎక్కువ భాద్యత ఉంది.. వీళ్ళే సామాన్యులను ఎడ్యుకేట్ చెయ్యాలి... కాని వీళ్ళకంటే రోత తిని పెరిగే పంది నయం అనిపిస్తోంది... (పంది క్షమించాలి... వీళ్ళను దానితో పోల్చినందుకు... ఎందుకంటే వీళ్ళు అంతకంటే దిగజారిపోయారు)

దుర్మార్గులను గెలిపించడానికి... సామర్ధ్యం కలిగిన వ్యక్తులను ఎంతకైనా దిగజార్చుతున్నారు

నిజం చెప్పాలంటే ప్రజలను మాయ చేసి ఓట్లు వేయించుకోవడమంటే ద్రోహం కాదా? వారి యొక్క జీవితాలను నాశనం చేయడం కాదా? ప్రజాస్వామ్యాన్ని పగలగొట్టడం కాదా? అభివృద్ధిని అంతమొందించడం కాదా? ఒక్కసారి ఆలోచించండి

ఆంధ్రాలో అబద్ధాన్ని మాటి,మాటికి చెపితే నిజం అయ్యిపోతుందన్న నానుడి నడుస్తోంది.. ఈ ప్రయోగమే అమలవుతోంది.

కాబట్టి ప్రజలారా! ఇప్పటికైనా కళ్ళు తెరవండి... మనకి కావాల్సింది పార్టీలు కాదు... రాజకీయ నాయకులు అంతకంటే కాదు.

మన భవిష్యత్ బాగుండాలి, ప్రజాస్వామ్యం బ్రతకాలి, అభివృద్ధి పెరగాలి.

ఎవడైతే పై వాటికి వ్యతిరేకమో వాడంత ప్రమాదకారి మరొకడుండడు... బయటి నుండి వచ్చే ఉగ్రవాదుల కంటే ఈ ముసుగుల్లో ఉన్న సామాజిక ఉగ్రవాదులు చాలా భయానకం. వీళ్ళను తరిమి కొట్టండి... వీళ్ళను దూరం పెట్టేయండి.

వీళ్ళను మనం వదిలినపెట్టినా,  కాలం...ప్రకృతి మాత్రం ఎప్పటికీ వదలవు... ఇటువంటి వాళ్ళందరూ "పిచ్చి ముదిరితే పతనమే"నన్న సామెతకు నిదర్శనంగా మిలిగిపోతారు

ఆదివారం, జులై 30, 2023

 Nara Lokesh is the best politician: ఒకప్పుడు YSR పార్టీ లో "పప్పు..పప్పు" అంటూ ఎగతాళి చేయబడిన నారా లోకేష్ ఇప్పుడు ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషిగా అందరికీ అర్ధమవుతున్నాడు. అతనేమాత్రం "పప్పు" కాదు మంచి సంస్కారం, మంచి నడవడిక, ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తీ అని ప్రతి ఆంధ్రుడికీ అర్ధంయ్యిపోయింది.

Nara-Lokesh-is-the-best-politician
Nara Lokesh is the best politician

ఈమధ్య యువగళం పేరుతో లోకేష్ ప్రారంభించిన పాదయాత్ర చూస్తే... ఈ విషయం ఇట్టే అర్ధమయిపోతుంది. వివిధ వర్గాల మధ్య జరుగుతున్న చర్చా వేదికలు చూస్తుంటే లేకేష్ హుందాతనాన్ని గాని, అతని యొక్క గౌరవ ప్రదమైన మాటతీరు గాని ఎవరూ కొనియాడకుండా ఉండలేరు.

నేటి రాజకీయాలలో అసెంబ్లీ నుండి పార్లమెంట్ దాకా కేవలం బూతులనే వింటున్న ప్రజలు లోకేష్ వ్యవహారశైలికి ఆకర్షితులవుతున్నారు. ఆంధ్రా పరిస్థితులను, రాజకీయాలను ఒక గాటిన పెట్టగలిగే దమ్మున్న నాయకుడన్న విషయం ఆంధ్రా ప్రజలకు అర్ధమయిపోయింది.

రాబోయే కాలంలో... ఆంధ్రాకి కాబోయే సియం... నారా లోకేష్ మాత్రమే!

Read More:

  1. ఒత్తిడిని అధిగమించే 10 పద్ధతులు
  2. నిన్ను నీవే గౌరవించుకోలేకపోతే ఇతరులెలా గౌరవిస్తారు?
  3. Best niches for blogging

గురువారం, జులై 27, 2023

 

Innocent voters are a danger to the country! | అమాయక ఓటర్లు దేశానికి ప్రమాదమే!

ఆకలితో ఉన్న సింహం నక్కతో అన్నది. ఏదన్నా జంతువుని తీసుకురా లేకపోతే నిన్ను తింటాను అన్నది. 

నక్క వెతగ్గా ఒక గాడిద కనబడింది. సింహం నిన్ను తన వారసుడిగా నిన్ను ఈ అడవికి రాజును చేస్తానన్నది, నాతో రా! అన్నది. 

గాడిదను చూడగానే దాడి చేసి దాని చెవులు కొరికేసింది. గాడిద పారిపోతూ నక్కతో కోపంగా:  ఇంత మోసం చేస్తావా అన్నది.

పిచ్చిదానా! కిరీటం పెట్టడానికి చెవులడ్డమని కోరికిందంతే: ఏం సందేహించకు అని నచ్చ చెప్పి మళ్ళీ తీసుకొచ్చింది. 

ఈసారి దాడిలో దాని తోక దొరికితే కొరికి తెంపేసింది. మళ్ళీ పారిపోతూ కోపంతో బాధతో వెంట వస్తున్న నక్కతో: మళ్ళీ మోసం చేశావు కదూ! 

నక్క: ఛీ! ఛీ! అదేంలేదు. నీన్ను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి తోక అడ్డమని కొరికేసిందంతే! అన్నది.

సరే అని మళ్ళీ వచ్చిన గాడిదని సింహం చంపేసి నక్కతో: దీని చర్మం వలిచి మెదడు, గుండె, లివరు ఊపిరితిత్తులు తీసుకురమ్మన్నది.

నక్క మెదడు తాను తినేసి మిగిలినవి పట్టుకొచ్చింది. అవి చూసి సింహం: వీటిలో మెదడేది? అని అడిగింది.

నక్క: ప్రభూ! దీనికి మెదడే లేదు. ఉండి ఉంటే మీరు దాడి చేస్తున్నా మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వచ్చేది కాదు కదా! అన్నది.

నిజమే! అన్నది సింహం.

 సందేశం: మోసం చేసిన నక్క లాంటి అవినీతి నాయకులది కాదు

పదే పదే వాళ్ళ మాటలు నమ్మి ఓట్లసే గాడిద లదే తప్పంతా...

సోమవారం, జూన్ 22, 2020

చైనా వస్తువులు వాడని వాడు దేశ భక్తుడు? వాడే వాడు దేశద్రోహి!

is-china-devotee-of-goods-hes-traitor
భారత్-చైనా యుద్దమేఘాలు కమ్ముకుంటున్న సమయంలో కొంతమంది రాజకీయ ప్రముఖుల నినాదం ఏమిటంటే.. "చైనా వస్తువులు వాడని వాడు దేశ భక్తుడు? వాడే వాడు దేశద్రోహి!" అని.

నిజానికి ఇది వినడానికి చాలా గమ్మత్తుగా ఉంది. నిజమే కదా చైనా వస్తువులు వాడటం మానేస్తే చైనా ఆర్ధిక పరిస్థితి పడిపోయి అప్పుల ఊబుల్లో కూరుకుపోయి సర్వనాశనం అయిపోతుందని కొంతమంది మేధావులు ఊదరగొడుతున్నారు. ఇది ఎంత వరకూ నిజమనేది నాకయితే తెలీదు గాని.. యుద్ధానికి రెడీ అయిన చైనా మాత్రం ఈమాత్రం నష్టాన్ని అంచనా వేయకుండా ఉంటుందా అన్నది నా సందేహం. 

ఇకపోతే పై విషయం వదిలేద్దాం.. ఎందుకంటే చైనా కొచ్చే నష్టాలతోనూ, కష్టాలతోనూ ఆలోచించాల్సిన పనిలేదు. ఇప్పటికే చైనా తీసుకొచ్చిన కరోనాకి ప్రపంచమే అంధకారంలోకి పోతోంది.

బుధవారం, మార్చి 11, 2020

స్థానిక ఎలక్షన్లలో టి‌డి‌పి పోటీ చేయడం అవసరమా?

ప్రస్తుత వైయస్సార్ సిపి పరిస్తితి చూస్తుంటే స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం అనవసరం అనిపిస్తోంది. ఎందుకంటే పైన అధికారంలో వైయస్సార్ సిపి ఉన్నప్పుడూ ఒకవేళ టి‌డి‌పి పార్టీ వాళ్లు గెలిచినా వాళ్లు ఎటువంటి పనులు చేయలేరు సరికదా తీవ్రమైన పరిస్థితులు ఎదురుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని చోట్ల వైయస్సార్ సిపి వాళ్ళ దౌర్జన్యానికి భయపడి నామినేషన్లు వేయడానికే భయపడే వాళ్లు ఒకవేళ నెగ్గినా అధికారంలో ఉన్న వైసీపీ వాళ్లను ఏవిధంగా ఎదురుకోగలరు?

జెసి స్థానిక ఎన్నికలలో టిడిపి పోటీ చేయకపోవడమే మంచిదన్న వాదన సమర్ధనీయమైనది. ఎటూ ఆంధ్రా అంతా వైసీపీనే రాజ్యమేలుతుంది కాబట్టి స్థానిక సంస్థలు కూడా వాళ్ళకే అప్పగించేస్తే బాగుంటుంది. ఇదే పని టిడిపి చేయగలిగితే 2024 అసెంబ్లీ ఎలక్షన్లలో టిడిపికి ఎదురు లేకుండా పోతుంది. ప్రజలు పూర్తిగా టిడిపికే పూర్తిగా ఒరిగిపోతారు.

సోమవారం, అక్టోబర్ 14, 2019

will-chandrababu-naidu-join-bjp-again
ఆంధ్రా ప్రజలకు ఇదే అభిప్రాయం ఏర్పడుతుంది. ఎందుకంటే టిడిపి పార్టీలోని కొంతమంది ప్రముఖ నాయకులు బిజెపిలోకి జంప్ అయినా చంద్రబాబునాయుడు గారు వ్యతిరేకించకపోవడం, అలాగే మొన్న వైజాగ్ మీటింగ్ లో చంద్రబాబు ప్రసంగిస్తూ బిజెపిని వీడడం తప్పుడు నిర్ణయమని, వైసిపి రెచ్చగొట్టినందునే టిడిపికి,బిజెపికి విరోధాలు ఏర్పడ్డాయని చెప్పడం బిజెపి మద్దతు ఉన్నట్లు అనిపిస్తోంది. నిజానికి చంద్రబాబు బిజెపిని దారుణంగానే విమర్శించాలి గాని ఇవేవీ చంద్రబాబు నాయుడుగారు చేయలేదు. నిజం చెప్పాలంటే బిజెపికి చంద్రబాబును మళ్ళీ కలుపుకుపోవడం వలనే ప్రయోజనం గాని జగన్ గారి వలన ఎంటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే చంద్రబాబుకు హైలెవెల్లో ఉన్న సర్కిల్ జగన్ ఏమాత్రం లేదు. ఇకపోతే దేశీయంగా చూస్తే ఏమాత్రం ఇమేజ్ లేని కాంగ్రెస్ ను పట్టుకుని ఉండటం కంటే కేంద్రంలో బలంగా ఉన్న బిజెపినే కలుపుకుంటే ప్రయోజనం. అటు బిజెపికి ఇటు జగన్ కంటే చంద్రబాబు వలెనే ప్రయోజనాలు ఎక్కువ. దానికితోడు చంద్రబాబు యొక్క నేషనల్ ఇమేజ్ కూడా బిజెపి వారికి మరింత ప్రయోజనాన్ని చేకూర్చుతుంది. ఇవన్నీ కలిసి ఒకవేళ బిజెపి, టిడిపి కలిస్తే జగన్ గారికి గడ్డు కాలం ప్రారంభమయ్యినట్లే... కాదంటారా?

సోమవారం, సెప్టెంబర్ 23, 2019

జగన్ పనులు చూస్తుంటే మళ్ళీ జగనే సియం అయితే బాగుంటుంది...ఎందుకంటే ఒకవేళ చంద్రబాబు సియం అయినా పరిపాలన సాగదు..రాష్ట్ర భవిష్యత్ ను ఏమాత్రం పట్టించుకోని మన జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగూ రాష్ట్రాన్ని దివాళా తీసే దిశగానే తీసుకెళ్తున్నారు. ఒకవేళ చంద్రబాబు సియం అయినా ఆ బొక్కలన్నీ పూడ్చి మళ్ళీ ఆంధ్రాను గాడిలో పెట్టడానికి ఆయన పదవీకాలం కూడా సరిపోదు. ఇవేవీ తెలియని ప్రజలు చంద్రబాబు వచ్చి చేసిందేమిటి? బొంద అంటూ మళ్ళీ అట్టర్ ఫ్లాప్ విజయాన్ని మూటగడతారు. ఎలక్షన్ల ముందు మరోసారి చంద్రబాబుకి అధికారం ఇద్దాం. ఈసారి పోలవరం,అమరావతి పూర్తవుతాయి అన్న మాటలే ప్రజలు పలికారు. ఒక్క ఛాన్స్ అన్నందుకు జగన్ కు పట్టం కట్టేశారు. ఇంత చేసిన చంద్రబాబును, ఆంధ్రాను గాలికొదిలేశారు. ఇప్పుడు లబో,దిబో మంటున్నారు. ఉపయోగం ఏముంది? నిజానికి జగన్ గారు పోలవరం, అమరావతి ఆపకుండా దానిని తీర్చిదిద్ది ఉంటే తిరుగు లేకపోవును. కానీ చంద్రబాబు మొదలు పెట్టిన ఏపని కొనసాగించడం ఆయనకసలు ఇష్టం లేదు. అందుకే పేదవారి కడుపు నింపే అన్నా క్యాంటీన్లు కూడా మూసి పారేశారు. చంద్రబాబుగారు అడుగిడిన ప్రాంతాలు కూడా ఆయనకు నచ్చడం లేదు. ఏదో కోణంలో ఇబ్బడిముబ్బడిగా కేవలం వైయస్సార్ సిపి కార్యకర్తలను ఉద్యోగులుగా మార్చేస్తున్నారు. జగన్ పదవీకాలం పూర్తయ్యేటప్పటికి అన్ని రంగాలలో కేవలం వైయస్సార్ సిపి కార్యకర్తలు మాత్రమే ఉంటారు. ఖర్మకాలి చంద్రబాబు సియం అయ్యి వీళ్ళందరినీ తొలగించినా రాష్ట్రం అల్లకల్లోలం అయిపోవడం ఖాయం. మన ఆంధ్రా సెకండ్ బీహార్ గా మారిపోవడం తధ్యం.

మరొక బాధాకరమైన విషయమేమిటంటే ప్రత్యేక హోదా కోసం తెగ వాగిన చలసాని శ్రీనివాస్ , హైటెక్ లెక్కలు గీసే ఉండవల్లి అరుణకుమార్, భవిష్యత్ కర్త గరుడ శివాజీ, లడ్డూ కావాలా, బొంద కావాలా అంటూ ఓవర్ యాక్టింగ్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పచ్చి బూతులు తిట్టిన సోము వీర్రాజు ఇప్పుడు ఏమయిపోయారు?

 చంద్రబాబు సియం అయితేనే కానీ వీళ్లకు మళ్ళీ పని దొరకదు. ఎక్కడో బొక్కలలో దాక్కున్న అరుణకుమార్ కూడా మళ్ళీ పద్దుల పుస్తకం పట్టుకుని ప్రజల ముందుకు, మీడియా ముందుకు దూకుతాడు. మనలాంటి సామాన్య ప్రజలు చోద్యం చూస్తున్నట్టు ఉండిపోవడం తప్ప ఏం చేయగలం?

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

ఉన్నతమైన వైద్యుడుగా పేరుగాంచి, ఎన్టీఆర్ ప్రోద్బలంతో గొప్ప నాయకుడిగా ఎదిగిన కోడెల శివప్రసాద్ గారు బలవంతపు మరణం ఆంధ్రాను దిగ్బ్రాంతికి గురిచేసింది. నిజానికి ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. ఇలా ఎందుకు జరిగిందో...? కారణాలు..కారకులు ఎవరో?

ఆదివారం, ఏప్రిల్ 14, 2019

Andhra people vs KCR
Andhra people vs KCR
చంద్రబాబే మళ్ళీ సియంగా రావాలని అత్యధికులు భావిస్తుంటే "జగనే" సియం అవ్వాలని కాదు,కాదు చెయ్యాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్, ప్రధాని మోడీగారు తెగ కుట్రలు పన్నుతున్నారు.

ఆంధ్రాప్రజలు కుక్కలు,నక్కలు,రాక్షసులు అంటూ ఆంధ్రా వెధవలతో సంబంధాలు తెగ్గోట్టేసు కోవాలని కారుకూతలు కోసిన కెసియార్ ఇప్పుడు ఆంధ్రా రాజకీయాల్లో ఇన్ని కుట్రలు ఎందుకు చేస్తున్నాడు?

జగన్ సియం చేయండి...మీకు (ఆంధ్రాకు) ప్రత్యేక హోదా నేనిప్పిస్తా అంటూ కెసియార్ చేసిన ప్రసంగం ఇప్పటికీ మర్చిపోలేము. కెసియార్ ఇప్పిస్తే గాని మనం తెచ్చుకోలేని దిక్కుమాలిన పరిస్థితికి దిగజారిపోయామా?

ఏది,ఏమైనా పవన్ కళ్యాణ్ గారు చాలా కరెక్ట్ గా చెప్పారు..జగన్ సియం చేస్తే కేసియార్ను సియం చేసినట్టేనని. అంటే ఆంధ్రాపై కెసియార్ ఆధిపత్యం చేయడానికే జగన్ కు సపోర్ట్ చేయడం. ఎందుకంటే చంద్రబాబు సియం అయితే కెసియార్ ఆటలు అసలు సాగవు. ఎందుకంటే YSRCP నాయకుడు విజయసాయి అన్నట్లు చంద్రబాబు ఎవరికీ లొంగడు. అయితే జగన్ కేసియార్కు, మోడీకి చేతులు ఎత్తి పూర్తిగా లొంగిపోవడానికి ప్రధాన కారణం ఉమ్మడి ఆంధ్రాలో జగన్ పై ఉన్న కేసులే. అవ్వన్నీ పట్టుకుంటే ఎక్కువ కేసులు కెసియార్ (తెలంగాణ) పరిధిలోకే పోతాయి. ఇవి గాని పట్టుకుని కెసియార్ లాగాడంటే జగన్ గారు పరిస్థితి ఊహించడానికి కూడా దారుణంగా ఉంటుంది. దీని కారణంగానే జగన్ కేసియార్కు, మోడీకి కీలుబొమ్మ మాదిరిగా మారిపోయేడు.

ఆదివారం, జనవరి 27, 2019

How-many-Assembly-seats-will-the-Telugu-Desam-Party-win-in-the-2019-elections
చంద్రబాబు గారి నాయకత్వంలో నడుస్తున్న తెలుగుదేశం పార్టీ ఈసారి 2019 లో జరిగే శాసనసభ ఎన్నికలలో భారీ మెజారిటీని సొంతం చేసుకునే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. TDPకి పోటాపోటీగా వస్తుందనుకున్న YSRCP పార్టీ ఒక్కసారిగా క్రింది స్థాయికి పడిపోయింది. ఆంధ్రా ప్రజలను బూతులు తిడుతూ, పచ్చిగా మాట్లాడే కెసియార్ తో జగన్ మద్దతు తీసుకోవడం చాలా తీవ్రకరమైన విషయం. జగన్ గారి ఈ వ్యవహారం ఆంధ్రాప్రజల మనస్సుల్లో వ్యతిరేక భావన కలిగించిందనే చెప్పాలి. దానికి తోడుగా ప్రతిపక్ష నాయకుడు అయ్యుండి ప్రజా సమస్యల పట్ల పోరాడకుండా "అసెంబ్లీ"ని వదిలి పెట్టి ప్రజా సంకల్పయాత్ర పేరుతొ ఊర్లంట పాదయాత్ర చేస్తూ తిరగడం నచ్చలేదు. అలాగే కేంద్రంపై తలపెట్టిన అవిశ్వాస తీర్మానం రాక ముందే తన MPల చేత రాజీనామా చేయించడం కూడా పెద్ద తప్పిదమే. అటు మోడీకి నష్టం కలగకుండా చూసుకుంటూ ఇటు మాత్రం ప్రత్యేక హోదా కోసం మా MPలు రాజీనామా చేసారనే భ్రమను జగన్ ఆంధ్రా ప్రజలకు కలిగించలేక బొక్కబోర్లా పడిపోయాడు. ఎన్నుకున్న నాయకులు రాజీనామాలు చేసుకు కూర్చుంటే ఇక ఏం సాధించగలరు? ఇక మరొక ముఖ్య విషయమేమిటంటే "పార్లమెంట్"లో అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా కేసీయార్ తన MPల చేత ఎంతగా కుట్రలు చేసాడో మనమింకా మర్చిపోకుండానే కేసీయార్ మద్దతు జగన్ తీసుకోవడం, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ జగన్ తరుపున ప్రచారం చేస్తానంటే YSRCP శ్రేణులు తలూపడం...ఇవన్నీ జగన్ కు నష్టాన్ని చేకూర్చేవే. నిజానికి కేసీయార్ మద్దతు జగన్ కు ఏవిధంగా పనికొస్తుందో నాకిప్పటికీ అర్ధం కావడం లేదు. కెసియార్ నక్కజిత్తుల కుట్రదారుడు. తెలంగాణలో జగన్ గారికి అభిమానులు మెండుగానే ఉన్నారు. వాళ్లందరూ కూడా కేసీయార్, జగన్ తో కలవడం వలన కేసీయార్ కు అనుకూలంగా మారిపోతారు. దీని లాభకోసమే కేసీయార్ జగన్ కు మద్దతు పలికాడు. దీని వలన కేసియార్కు తప్ప జగన్ కు ఏవిధమైన లాభం లేదు. అలాగని కేసియార్ అభిమానులెవరూ ఇక్కడ ఆంధ్రాలో లేనేలేరు జగన్ కు ఓట్లు వేయడానికి. నక్కజిత్తుల కేసీయార్ చేసే కుట్రలకు జగన్ బుక్కయ్యాడంతే. ఇకపోతే చంద్రబాబు తన అభివృద్ధి పనులలో శరవేగంగా ముందుకు పోతున్నాడు. లేటుగా ప్రారంభించినా అతి వేగంగా అన్ని చోట్లా పనులు జరుగుతుండటంతో చంద్రబాబుగారికి ఉపయోగంగానే మారుతుంది. సంక్షేమ పధకాలు కూడా చక్కగానే అమలవుతున్నాయి. ఇవ్వన్నీ చూస్తున్న ఆంధ్రాప్రజలు మళ్ళీ చంద్రబాబుగారి వైపే తిరుగుతున్నారు. ఇదిలానే ఉంటే వచ్చే ఎలక్షన్లలో 175 అసెంబ్లీ స్థానాలకి TDPకి 100సీట్లు పైగా రావడం గ్యారెంటీ. YSRCP 50నుండి 55సీట్ల మధ్యలో గెలుసుకుంటుంది. 10నుండి 15సీట్లు మాత్రమే జనసేన సొంతమవుతాయి. మిగిలిపోయిన అడపాదడపా సీట్లతో వామపక్షాలు అలరిస్తాయి. ఇదంతా నేను నా పరిశీలనతోనూ నాకు అందుబాటులో ఉన్న సమాచారంతోనూ ఏర్పరుచుకున్న అభిప్రాయం మాత్రమే. నాకైతే మాత్రం నిజమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. ఒకవేళ జనసేన పొత్తు చంద్రబాబుకి లేకపోయి 80సీట్లు లోపు మాత్రమే TDP గెలుసుకుంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం అసాధ్యం.

శనివారం, నవంబర్ 25, 2017

Hindu-terrorism-will-all-Hindus-become-terrorists-Is-this-the-right-to-arrest-Kamal-Haasan
నిజానికి నేటి మన భారతదేశంలో పరిస్థితులు కమల్ హాసన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఏం లేవు. ఎక్కడ చూసినా కులాల గొడవ,మతాల గొడవలతోనే నిండిపోతుంది. సమాజాన్ని శాంతివంతంగా తీర్చిదిద్దాల్చిన కొంతమంది స్వామీజీలు సైతం కులమతాలను రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా పశువుల గొడవే.హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో ఎక్కడబడితే అక్కడ సంస్థలు నెలకొలిపి, ప్రతి ముఖ్యమైన పట్టణాలలోనూ, సిటీలలోనూ వాటి బ్రాంచులు స్థాపించి ఇతరమత నిర్మూలనకై దౌర్జన్యాలు చేస్తున్నారు. కొట్లాటలు ప్రారంభిస్తున్నారు. ఇది ఎంతవరకూ సమంజసం? దేశ సంస్కృతిని, జాతులను ధ్వంసం చేస్తున్నా, బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్నా హిందూ పరిరక్షకులు స్పందించడంలో తప్పు లేదు గాని వాటి పేరు చెప్పి హింసాత్మకం సృష్టించడం మాత్రం ఉగ్రవాదం క్రిందికే వస్తుందని నా అభిప్రాయం. చట్టాలు,కోర్టులు ఎందుకున్నట్టు? భారతదేశపు బలమైన పోలీస్ వ్యవస్థ ఎందుకున్నట్టు? దేశ సంస్కృతిని, జాతులను ధ్వంసం చేసేవారిని (వీరు కూడా ఉగ్రవాదులే) వీరి దృష్టికి తీసుకెళ్లి సరిదిద్దాలని ప్రయత్నించాలి తప్ప హింసాత్మకం చేయడం ఏవిధంగా న్యాయమవుతుంది? ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కమల్ హాసన్ "హిందూ ఉగ్రవాదం" అంటూ వ్యాఖ్యానించాడు. కాని కొత్త పార్టీలు పురుడు పోసుకుంటే జీర్ణించుకోలేని పాత (పాతుకుపోయిన)పార్టీలు కమల్ పార్టీని అడ్డుకోవడానికే ఆయనపై కుట్ర పన్నడం హాస్యాస్పదమేమీ కాదు.

ఈరోజు కమలహాసన్ గూర్చి అంతర్జాలంలో వచ్చిన ఒక వార్త యధాతధంగా ఇస్తున్నాను.

మామూలుగానే కొన్ని సంఘటన్ల మీద తనదంటూ ఒక అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పే కమల్ రాజకీయాల్లోకి వస్తున్నానంటూ నిర్ణయం ప్రకటించిన దగ్గరినుంచీ సామాజికాంసాలమీద స్పందించటం ఎక్కువ చేసాడు. నిజానికి కమల్ చేసిన వ్యాఖ్యలను ఎక్కువమందే సమర్థించారుకూడా. ఈ వ్యాఖ్య‌ల‌తో క‌మ‌ల్‌కు ఒక్క త‌మిళ‌నాడులోనే కాకుండా దేశ‌వ్యాప్తంగానూ మంచి మద్దతు లభించింది.

అయితే ఆ వ్యాఖ్యల వల్లే కమల్ ఇప్పుడు చిన్న చిక్కులో ఇరుక్కున్నాడు. . క‌మ‌ల్ చేసిన వ్యాఖ్య‌లకు సంబంధించి కేసులు న‌మోదు చేసి విచార‌ణ చేపట్టాల‌ని ఏకంగా మ‌ద్రాస్ హైకోర్టు చెన్నై పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాజకీయాల్లోకి దిగిపోయానంటూ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన క‌మ‌ల్‌. త‌న పార్టీ పేరును ప్ర‌క‌టించ‌క‌ముందే కేసులో ఇరుక్కున్న‌ట్టైంద‌న్న అభిప్రాయం వినిపిస్తోంది.

అయినా క‌మ‌ల్ చాలా వ్యాఖ్య‌లే చేశారు క‌దా. ఆ వ్యాఖ్య‌ల్లోని ఏ కామెంట్ ఆధారంగా క‌మ‌ల్‌పై కేసు న‌మోదు చేయాల‌ని కోర్టు ఆదేశించిందంటే... ఇటీవ‌ల ఆయ‌న ఓ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. దేశంలో హింందూ ఉగ్ర‌వాదం ఉంద‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న ఆ ఉగ్ర‌వాదం నానాటికీ పెచ్చ‌రిల్లుతోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ఈ వ్యాఖ్య‌ల‌పై వెనువెంట‌నే కొన్ని వ‌ర్గాల నుంచి రియాక్ష‌న్ వినిపించినా... క‌మ‌ల్ దానిని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అంతేకాకుండా తన పోస్టర్ వేలాడదీసి ఇద్దరు పిల్లలు కత్తులతో పొడుస్తున్నట్టుగా వచ్చిన ఒక వీడియోని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట‌ట్ చేసిన క‌మ‌ల్‌... అలాంటి ఏ పాపం ఎరుగ‌ని పిల్లాడి చేతిలో చ‌నిపోవ‌డం త‌న‌కు ఆనంద‌మేనంటూ మరో సంచ‌ల‌నాత్మ‌క కామెంట్ విసిరారు.

హిందూ ఉగ్ర‌వాదం అంటూ క‌మ‌ల్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు ఓ వ్య‌క్తి మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. తన వ్యాఖ్యల ద్వారా హిందువులపై ఉగ్రవాదులు అనే ముద్రను కమల్ వేశారంటూ పిటిషన‌ర్ కోర్టుకు విన్న‌వించాడు. హిందువులకు వ్యతిరేకంగా విషాన్ని వ్యాపింపజేసేందుకు క‌మ‌ల్‌ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

హిందూ ఉగ్ర‌వాదం అంటూ క‌మ‌ల్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు ఓ వ్య‌క్తి మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. తన వ్యాఖ్యల ద్వారా హిందువులపై ఉగ్రవాదులు అనే ముద్రను కమల్ వేశారంటూ పిటిషన‌ర్ కోర్టుకు విన్న‌వించాడు. హిందువులకు వ్యతిరేకంగా విషాన్ని వ్యాపింపజేసేందుకు క‌మ‌ల్‌ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

మానసికంగా బలహీనున్ని చేయాలని మ‌రి ఈ కేసు విచార‌ణ ఏ మ‌లుపులు తిరుగుతుందో చూడాలి. మొత్తానికి కమల్ ని ఇప్పటినుంచే ఇబ్బందులకు గురి చేసి పార్టీ పెట్టకముందే అతన్ని మానసికంగా బలహీనున్ని చేయాలని ప్రభుత్వ ఆలోచన అన్న ఇంకో వాదన కూడా తమిళ నాడు లో వినిఒపిస్తోంది.

శనివారం, ఆగస్టు 12, 2017

that is narendra modi
ప్రజలను మిమ్మల్ని MPలను చేసింది తినేసి ఇళ్ళ దగ్గర పడుకోవడానికి కాదు..పని చేయడానికంటూ ప్రధాన మంత్రి నరేంద్రమోడి తన పార్టీ MPల తీరుపై విరుచుకుపడ్డాడు. వాళ్ళు సరిగా సభలకు రాకపోవడంపై విసుకు చెందిన మోడి పైవిధంగా స్పందించారు. అంతే కాకుండా మీరు పధ్ధతి మార్చుకోకపోతే వచ్చే 2019 ఎలక్షన్స్ లో సీటు ఇవ్వడం కష్టమేనని కూడా తేల్చేస్తూ గట్టి వార్నింగ్ కూడా ఇచ్చాడు.

మోడీ విషయంలో ఇవ్వన్నీ చూస్తుంటే త్వరలో మన ప్రధాని మోడీ గారు భారతదేశానికి ఎదురులేని రాజుగా,నియంతగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అధికార పక్షంతోపాటు ప్రతిపక్షం కూడా మోడీ ఎప్పుడు,ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడో తెలియక అనుక్షణం భయంతో బ్రతుకుతూనే ఉన్నారు.

ఏది,ఏమైనా MPల, MLAల మద్దతు కోసం ప్రాకులాడుతూ పరిపాలక సీట్లలో కూర్చుని కూడా ఏమీ చేయలేక మద్దతు ఎక్కడ ఊడుతుందో, అధికారం ఎక్కడ చేజారిపోతుందోనని భయపడి తన క్రింది సభ్యులకు బానిసలుగా మారిపోయే ముఖ్యమంత్రి,ప్రధానమంత్రుల పదవులకు దీటుగా ప్రధాని మోడి MPలకు లొంగక పోవడం గొప్ప విషయం. ఇదే నిజమైన ప్రధానమంత్రి పీఠానికి ఇచ్చే గొప్ప గౌరవం.

పదవిలో ఎంతకాలం ఉన్నామన్నది ముఖ్యం కాదు.ఎలా పరిపాలించాము? అన్నదే ముఖ్యం. దీనిని బట్టే భరతమాత ముద్దు బిడ్డలుగా మిగిలేది.చూద్దాం మన ప్రధాని నరేంద్రమోడి పరిపాలన సాగినంత కాలం భరతమాత ముద్దు బిడ్డగా ఉంటాడో,లేదో!!

మంగళవారం, ఫిబ్రవరి 09, 2016

తునిలో కాపు గర్జన పేరుతో జాతీయ ఎక్స్ ప్రెస్ ట్రైన్ "రత్నాచల్" ను తగులబెట్టేశారు. ఈ అసాంఘిక సంఘటనకు నేను ప్రారంభించిన ఉద్యమానికి ఏవిధమైన సంబంధం లేదని ముద్రగడ వారు ప్రకటించేశారు. పేపర్లలో,టి.వి.లలో మాత్రం దీని వెనుక జగన్ ఉన్నాడని, రాయలసీమ,హైద్రాబాద్ నుండి కొంతమంది ముసుగు రౌడీలు ప్రవేశించి ఈ ఘాతుకం చేశారని వచ్చింది. అదే నిజమైనప్పుడు జగన్ ను మళ్ళీ జైల్ గోడల మద్యకు ఎందుకు నెట్టలేదో ఆంధ్ర ప్రజలెవరికీ అర్ధం కావడం లేదు. రౌడీల ఆగమనం చూస్తుంటే రత్నాచల్ ట్రైన్ తగుల బెట్టేయాలని ముందే ప్లానింగ్ జరిగిపోయినట్టు అనిపిస్తోంది. అంటే కాపు గర్జన సభలో పాల్గొన్న రాజకీయ పెద్దలకు ముందే తెలుసేమో అన్పిస్తోంది. ఎవరేమి పన్నాగాలు పన్నినా మొత్తానికి ఆంధ్రాలో కుల చిచ్చులు రేపారు. నిజానికి ఈ కుల రాజకీయాలు ఎంతో కాలం నిలవవు. ఈ కుల రిజర్వేషన్స్ నిలవవు. వీటికి ముగింపు తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. 

 


Recent Posts