సూచనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సూచనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

మంగళవారం, జులై 13, 2021

 Interest in Telugu blogs has waned? | తెలుగు బ్లాగుల పట్ల ఆసక్తి సన్నగిల్లింది?

Interest in Telugu blogs has waned
Interest in Telugu blogs has waned?

ఈమధ్యకాలంలో తెలుగు బ్లాగులోకంలో మంచి,మంచి బ్లాగర్లు కనుమరుగయ్యిపోయారు. చాలా తక్కువమంది బ్లాగర్లు అప్పుడప్పుడూ పోస్టులు పెడుతున్న చదివే బ్లాగు వీక్షకులు లేకుండా పోయారు. బహుశా సోషల్ మీడియా ప్రభావం అనుకుంటా! అత్యధికులు వీడియో కంటెంట్ కి కనెక్ట్ అయిపోయారు.

దానికారణంగా బ్లాగరుల వైపు చూడడమే తగ్గిపోయింది. దానికి తోడూ బ్లాగులలో బూతు కామెంట్లు, గోదావులు పెట్టె కామెంట్లు, తిట్ల పురాణాలు విరజిమ్మే కామేన్టర్లు తప్ప మంచి,మంచి అభిప్రాయాలు వెలిబుచ్చే వారు గాని, సలహా, సూచనలు అందించే కామేన్టర్లు గాని ఎవరూలేరు.

ఇది కూడా బ్లాగులు దెబ్బతినడానికి కారణమే!

పరిస్థితి ఇలానే ఉంటె తెలుగు బ్లాగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యి పూర్తిగా కనుమరుగయ్యి పోవడం ఖాయం. దయచేసి బ్లాగర్లు, బ్లాగు వీక్షకులు ఈ విషయాన్ని గమనించి తగు బాధ్యతా వహిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

ఏమి చేస్తే బాగుంటుందో తగు సూచనలు, సలహాలు ఈక్రింది కామెంట్ బాక్స్ ద్వారా అందించండి. అందరమూ పరిశీలించి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుందాం!

How to generate passive income: idea No:1

 

మంగళవారం, ఏప్రిల్ 20, 2021

 Nice message for today's situation | నేటి పరిస్థితులకు చక్కని సందేశం. 

Nice message for today's situation
Nice message for today's situation

అది ఒక జింకల వనం. అందులో జింక జాతులు ఆనందంగా నిర్భయంగా జీవిస్తున్నాయి .

ఒకసారి ఆ వనం నుంచి ఒక జింక దారితప్పి వేరే అడవిలోకి వెళ్ళింది. అక్కడ దానికి ఎన్నో కొత్త కొత్త జంతువులు, తోడేళ్ళను, పులులను, సింహాలను, నక్కలను తొలిసారి అక్కడే చూసింది.

అక్కడ ఒక కొమ్ముల జింక ఎదురై " ఓ జింక సోదరా ఈ అడవిలో నిన్నెప్పుడూ చూడలేదే " అంది.

"అవును మాది జింకలవనం " అంది.

" ఈ అడవి మీ జింకల వనం లాంటిది కాదు. ఇక్కడ మనల్ని చంపి తినే క్రూర మృగాలు ఉన్నాయి. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో మీకసలు తెలియదు. కాబట్టి ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపో " అంటూ ఆ జింక గెంతుతూ వెళ్ళి పోయింది.

" పిరికి జింక నేనూ జింకనే అదెలా తప్పించుకుందో నేనూ అలాగే తప్పిచుకోగలను " అనుకుంటూ జింకల వనం జింక ముందుకు వెళ్ళింది.

అక్కడ చెట్టు కింద నిద్రపోతున్న సింహం కనిపించింది. జింక చిన్నగా దాని దగ్గరికి వెళ్ళి తన ముందరి గిట్టతో సింహం తోక తొక్కింది .

 సింహానికి మెలకువ వచ్చింది. బద్దకంగా లేస్తూ జింకను చూసి గర్జించింది. ఆ గర్జన విని జింకకు గుండె ఆగినంత పనయింది .

వెనుదిరిగి వచ్చిన దారినే పరుగు పెట్టింది. అడవిని దాటి జింకల వనం వైపు పరుగు తీస్తూనే  వుంది. జింకల వనం సమీపానికి రాగానే సింహానికి చిక్కింది. సింహం దాన్ని చంపి చీల్చి ఆరగించింది .

 తరువాత సింహం లేచి మెల్లగా జింకల వనంలోకి వెళ్ళింది. దానికి అది క్రొత్త ప్రదేశం . అక్కడ దానికి గుంపులు గుంపులుగా జింకలు కనిపించాయి. సింహం ఆనందానికి అంతు లేదు. దొరికిన జింకను దొరికినట్టు చంపి తినేస్తుంది .

కొత్తగా ముంచుకొచ్చిన ఈ మృత్యువును చూసి జింకలన్నీ భయపడి పోయాయి. చెల్లాచెదురు అయ్యాయి. పొదల్లో దాక్కున్నాయి. బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నాయి .

పొ‌రపాటున ఏ జింకయినా బయటికొస్తే చాలు సింహం దాన్ని పడగొట్టేస్తుంది .

అయితే ఆ జింకల్లో తెలివయిన కుర్ర జింక ఒకటుంది. దాని పేరు జ్ఞాన నేత్ర. జింకల పెద్దలు జ్ఞాన నేత్ర దగ్గరికి వచ్చి "దీనికి పరిష్కార మార్గం ఏమిటి " అని అడిగాయి.

" జింక పెద్దలారా నేనూ అదే ఆలోచిస్తున్నాను. ఈ క్రూర జంతువును ' సింహం ' అని అంటారు. దీని పంజా నుంచి తప్పించుకొనే చాకచక్యం మనకు లేదు.

ఎటు ఆలోచించినా. . ఎంత యోచించినా ఒకే ఒక్క దారి కనిపిస్తుంది.

ఈ సింహం ఆహారం లేకుండా

14 రోజులు మాత్రమే బ్రతక గలదు. కానీ మనం 21రోజులు బ్రతకగలం.

కాబట్టి మన జింకలన్నీ తమ పొదల్లోకి దూరి 14రోజులు బయటకు రాకుంటేచాలు దాని పీడ మనకు విరగడౌతుంది. మనలో ఎవరైనా నిర్లక్ష్యంతో బయటకు వచ్చి దానికి చిక్కారా దాని జీవిత కాలం మరో 14 రోజులు పెంచినట్లే.

ఈ రోజు అమావాస్య ఇప్పుడే పొదల్లోకి దూరిపోదాం. పున్నమి నాటికి బయటకు వద్దాం. తమ పొదల నుండి బయటకు రాకుండా చూసే బాధ్యత ఆ జింకల పెద్దలదే" అంది.

జింకలన్నీ జ్ఞాన నేత్రం మాటలు విన్నాయి. ఆకలితో అలమటించాయి.

పున్నమి వచ్చింది. జింకలన్నీ ఒక్కొక్కటే భయం భయంగా బయటకు వచ్చాయి. వనం మధ్య చెట్టు కింద చచ్చి పడి ఉన్న సింహాన్ని చూశాయి. ఆనందంతో అరిచాయి, గెంతాయి. జింకల కేరింతలతో వనం అంతా పులకరించింది.

ఇది ప్రస్తుత పరిస్థితులకు కరెక్టుగా సరిపోయింది కదా.. 

అందుకే..

ఇంట్లోనే ఉండండి 

కరోనా రక్కసి పనిపట్టండి... మనం జింకలకన్నా తెలివైనవాళ్ళమేగా

How to generate passive income: idea No:1

సోమవారం, ఆగస్టు 24, 2020

కరోనా కు మానవ జాతి ఎందుకు బలవుతోంది?

కరోనా కు మానవ జాతి ఎందుకు పిట్టలాగా రాలిపోతోంది. ఇన్ని రోజులు మానవ జాతి సాధించిన అభివృద్ధి  మానవున్ని ఈ చిన్న వైరస్ నుండి ఎందుకు కాపాడ లేక పోతోంది..
WHO చెప్పిన ప్రకారం కరోనా అనేది SARC జాతి వైరస్. ఈ SARC  కరోనా వైరస్, ముందు వచ్చిన SARC వైరస్ లకన్నా తక్కువ శక్తి కలది.  అయినా ఈ కరోనాకు ఇన్ని లక్షల మంది ఎలా బలి అయిపోతున్నారు
ఈ వైరస్ లు ఇప్పుడు పుట్టినవి కాదు. కొన్ని వేల సంవత్సరం ల కింద నుండే వున్నాయి. అప్పుడు వైరస్ లను తట్టు కున్న మానవులు ఇప్పుడు ఎందుకు చిగురుటాకు లాగ రాలి పోతున్నారు.

సోమవారం, సెప్టెంబర్ 30, 2019

are-there-girls-in-your-house-care-must-exercised-by-parents-the-protection-home-bound-girlsమన భారత దేశంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను మనం ప్రతి రోజూ చూస్తూనే ఉన్నాం. ఆఖరికి నెలల పసికందులను కూడా వదలని కామాంధ రాక్షసులు రోజు,రోజుకూ పెరిగిపోతూనే ఉన్నారు. ఇటువంటి వారు మన ప్రాంతాలలో కూడా ఉండవచ్చు. నిజానికి వీళ్ళు ఆకాశంలోనుంచి రారు. మన చుట్టు ప్రక్కలనే ఉంటారు. మైనారిటీ రాని అబ్బాయిల నుండి కాటికి కాళ్ళు చాపే పండు ముసలి వాళ్ళ వరకూ అత్యాచారాలకు పాల్పడిన వాళ్ళను మనం TVలలో, వార్తా పత్రికలలో చూస్తూనే ఉన్నాము. ఇటువంటి పరిస్థితులలో మన ప్రాణమైన మన కంటి దీపాలైన ఆడపిల్లలను మనం నిత్యం కాపాడుకుంటూనే ఉండాలి. దీని నిమిత్తం "జనవిజ్ఞాన వేదిక" వారు కొన్ని సూచనలను మనకు అందించారు. వాటిని పరిశీలించి తగు జాగ్రత్త తీసుకోవడం అత్యంత ముఖ్యం. 

Recent Posts